Subscribe

ఆత్మ విశ్వాసం


శేషు చిన్నప్పట్నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు. శేషుతల్లి శాంత చదువు సులభమైనదిగా ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు శేషు తండ్రి రంగారావ్ బంగారపు వ్యాపారస్థుడు, కొడుకు చెడిపోతున్నాడని తెల్సిన కొడుకు ఇంటినుండి వెళ్ళిపోతానని బెదిరించడంతో నోరు మెదిపేవాడు కాదు ఆయన శేషుకి మామయ్య అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండే వాడు అక్కాబావల్ని చూడాలని వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్ధం చేసుకుని, శేషుని కొన్నిరోజులు తన వద్దకు పంపమని అడిగాడు. కొడుకు బాగుపడతాడేమో నన్న ఆశతో కిషోర్ వెంటపంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేషు ఎంతో సంతోషించాడు.
చూపించాల్సినవన్ని కిషోర్ శేషుకి కొద్దిరోజులు చెనై అంతా త్రిప్పి చూపించాడు అందరూ తెల్లవారేసరికి నీట్గా రకరకాల యూనిఫారమ్స్ వేసుకుని చదువుకోవడానికి వెళ్తున్నారు. వారిని చూసి నేనుకూడా ముచ్చటపడ్డాడు. తర్వాత క్రీడా మైదానాలలో ముఖ్యమైన క్రికెట్ స్టేడియంకు శేషుని తీసుకెళ్ళాడు కిషోర్, అక్కడ ఆ రోజు భారత్ ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది. టిక్కెట్ కొని ఇద్దరూ లోనికి వెళ్ళి క్రికెట్ ఇద్దరికి ఇస్టం కనుక ఆసక్తిగా చూడసాగారు.
భారత్ ఆటగాళ్ళు ఒక్కొక్కరూ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తలవంచుతున్నారు. భారత్ సారథి మాత్రం ధైర్యంను చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు.
ఒక్కసారిగా భారత్ ఆటగాళ్ళుతమలోనున్న శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని చివరకు విజయాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి శేష! కష్టతరమైనదని తెలిసీ కూడా మన ఆటగాళ్ళు ఎలా విజయాన్ని సాధించారో చూశావా? ఇప్పటికైనా తెలుసుకో.
ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని అని నిదానంగా చెప్పాడు. ఆ మాటలు శేషు మనసుని బాగా ఆలోచింపచేశాయి. తను చేస్తున్న తప్పేమిటో తనకి అర్థమయ్యింది .
అప్పట్నుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్చుకు అతడి తల్లితండ్రులు ఎంతగానో ఆనందించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల వుంటే సాధించలేనిది లేదు.

Responsive Footer with Logo and Social Media