ఆవు పులి కథ



ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది.

ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా, బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. పులి ఎంతో అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూసి, అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది.

ఇది గమనించిన ఆవు, "ఆగు, ఆగు పులిరాజా! నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలిని తీర్చలేదు. నీవు దయ తలిస్తే, నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను," అని వేడుకుంది.

ఆవు మాటలను పులి ఫక్కున నవ్వి, "ఓహో! ఎంత నమ్మకంగా పలుకుతున్నావు! చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా? చాలా ఆకలిమీద ఉన్నాను. నీ మాయమాటలకు పడిపోయి నిన్ను వదుల్తా అనుకున్నావా?" అని గద్రించింది.

ఆవు మరొకసారి, "అయ్యో! పులి రాజా, నన్ను నమ్ము! నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. నువ్వు దయతలిస్తే, వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. నేను నిన్ను మోసగించి బతకగలనా? అయినా, ఆ అసత్యపు జీవితం నాకు ఇష్టం కాదు. ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్యకార్యం చేయడం ముఖ్యం. నన్ను నమ్ము," అని చెప్పింది.

పులి ఆవు మాటలను నవ్వి, "సరే, వెల్లు కాని, మళ్ళీ తిరిగిరాకపోయావో. ఈ రోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి," అని చెప్పింది.

ఆవు సంతోషంతో, "అంతమాటలకే సంతోషించి, ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని, తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, 'బిడ్డా, ఇదే నా ఆఖరిచూపు. మంచి దానిగా మసులుకో. బుద్ధిమంతురాలిగా యజమానికి సహకరించు. తోటి వారితో సఖ్యంగా ఉండు. గొడవలు వద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు. సత్యాన్నే పలుకు, అది నీకు మేలు చేస్తుంది. అందరిలో మంచి దానవుగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో,' అని మంచి బుద్ధులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది."

అడవిలో, ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూసిన పులి, దూరంగా ఆవు రావడం చూసి ఆశ్చర్యపోయింది. "ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం. ఈ ఆవు గొప్పది," అని అనుకుంది.

ఆవు దగ్గరికి రాగానే, "ఓ మహోత్తమురాల! నువ్వు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక, నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు," అని చెప్పింది.

ఆవు సంతోషంతో ఇంటికి చేరి, తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.

కథ యొక్క నీతి: చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే, ప్రతిఫలం దక్కుతుంది.

Responsive Footer with Logo and Social Media