అసలైన స్నేహితుడు



ఈ రోజు నాని బర్త్ డే నానికి చాలా ఆనందంగా ఉంది పొద్దుట లేచింది దగ్గర నుంచి అందరూ బర్డే విషెస్ చెబుతూనే ఉన్నారు. నాని వాళ్ళ నాన్నగారు నానికి గేర్ సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చారు అమ్మ తనకి ఇష్టమైన గులాబ్ జాములు చేసింది అన్న ఏమో తనకి పెయింట్ బ్రషుల సెట్ కొని ఇచ్చాడు ఇంకేముంది ఆనందానికి అసలు హద్దులే లేవు చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి చాక్లెట్ బాక్స్ తో సహా స్కూల్ కి వెళ్ళాడు. స్కూల్లో అడుగుపెట్టగానే మళ్లీ బర్త్ డే విషెస్, అందరూ దారంతా విషెస్ చెప్తూనే ఉన్నారు క్లాసులోకి వెళ్లాక ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్ లన్ని తీసుకున్నాడు, ఒక్కొక్కళ్ళు గిఫ్ట్ ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అన్ని తీసుకొని క్లాస్ లో అందరితో ఒరేయ్!! మీ అందరికీ ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ అందరూ రండి అని చెప్పి చెప్పాడు. సాయంత్రం నాని వాళ్ళింట్లో తన క్లాస్మేట్స్ అందరితో చాలా సందడిగా పార్టీ జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ఇష్టమైన భోజనాన్ని పెట్టి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఆ రోజుకి పార్టీ ముగించాడు నాని.

మరుసటి రోజు.... నిద్ర లేచి స్కూల్ కి వెళ్తాం అనుకుంటే ఒళ్ళంతా ఎందుకో చాలా నీరసంగా అనిపించింది ఏమిటా అని మళ్లీ నిద్రపోయాడు . ఇంతలో అమ్మ వచ్చి నానీ.. నీకు జ్వరం వచ్చింది నాన్నా... నిన్న ఎక్కువ అలసిపోయావు కదా అందుకు అనుకుంటా.. ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉందువులే అని చెప్పి వెళ్ళిపోయింది.

అమ్మ అన్నట్టే చాలా జ్వరం వచ్చింది చాలా నీరసంగా అనిపించింది రెండు రోజులు అనుకున్నాను కానీ ఈరోజుకి మూడో రోజు డాక్టర్ అంకుల్ ఇంకా రెండు రోజులు తర్వాత గాని జ్వరం తగ్గదు అని చెప్పారు నాకేమో చాలా బోర్ కొడుతుంది ఏం చేయాలి అనుకుంటూ కూర్చున్నాడు నాని. ఇంతలో గేటు దగ్గర ఏదో చప్పుడు అవుతుంది ఎవరు వచ్చి ఉంటారో... రవి గాడు వచ్చి ఉంటాడా సతీష్ వచ్చి ఉంటాడా అని అనుకుంటూ గేటు వైపు వెళ్ళాడు నాని.

ఎదురుగా చైతన్య ఉన్నాడు చైతన్యను చూసేసరికి నానికి కొంచెం నిరాశగా అనిపించింది. చైతన్య నానితో ఏరా జ్వరం తగ్గిందా అని అడిగాడు అందుకు నాని లేదురా ఇంకా 2 డేస్ ఉంటుంది అంట అమ్మ చెప్పింది అని చెప్పాడు. అప్పుడు చైతన్య తనతో తీసుకువచ్చిన స్కూల్ బ్యాగ్ ని నాని ముందు ఉంచి ఈ మూడు రోజుల నుంచి కొంచెం నోట్స్ చెప్పరు నీకు పెండింగ్ అయి ఉంటుంది కదా అందుకే తీసుకువచ్చాను అన్నాడు ఆ బుక్స్ చూస్తుంటే నాని కి ఇంకా నీరసం వచ్చింది. ఇప్పుడు నాకు ఓపిక లేదు రా రాయలేను అన్నాడు. అప్పుడు చైతన్య సరే రా నీ బుక్స్ నేను రాసి పెడతాను అని చెప్పి బుక్స్ తీసుకొని పెండింగ్ అంతా పూర్తి చేశాడు. కొంచెం సేపు నాని తోపాటు కూర్చొని క్లాస్ విషయాలన్నీ చెప్పి నాని కి ఒక కలర్ పెన్సిల్ బాక్స్ ఇచ్చి వెళ్లిపోయాడు.

చాలా సేపటినుండి... వాళ్ళిద్దర్నీ గమనిస్తున్న నాన్న నాని దగ్గరికి వచ్చి ఏరా మీ ఫ్రెండ్ వచ్చాడు కదా నువ్వు హ్యాపీ నా అని అడిగారు అందుకు నాని లేదు నాన్న రవి గాడు గానీ సతీష్ గాడు గానీ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది నాకు ఎందుకో ఈ చైతన్య గాడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు కామ్ గా ఉంటాడు నేనెప్పుడైనా అరిస్తే ఒరేయ్ అరవకురా టీచర్ తిడతారు. సార్ తిడతారు అనిచెప్తూ ఉంటాడు నాకు ఇష్టం లేకపోయినా ఎప్పుడూ నా పక్కనే వచ్చి కూర్చుంటూ ఉంటాడు అని నాన్నతో అన్నాడు.

అప్పుడు నాని వాళ్ళ నాన్న చిన్నగా నవ్వి నీకుచైతన్యే అసలైన ఫ్రెండు మిగిలి వాళ్ళందరూ కాదు అని చెప్తారు, అప్పుడు నాని అదేంటి నాన్న అలా అన్నావ్ అని అడుగుతాడు అప్పుడు ఆయన నీ మిగిలిన ఫ్రెండ్స్ అందరూ నీ సంతోషంలో ఎప్పుడూ నీతోనే ఉన్నారు కానీ ఈ చైతన్య మాత్రం నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అని ఆలోచనతో ఇంటికి వచ్చి నిన్ను పలకరించాడు నువ్వు రాయలేను అన్నప్పుడు నీకు సహాయం చేద్దామనే ఉద్దేశ్యం తో నీ పెండింగ్ వర్క్ అంతా రాశాడు వెళ్ళిపోతూ నీకు పెయింటింగ్ ఇష్టము కాబట్టి బోర్ కొట్టకుండా ఉంటుందని కలర్ పెన్సిల్స్ గిఫ్టుగా ఇచ్చి వెళ్ళాడు. నీ గురించి చైతన్య ఆలోచించినట్టుగా క్లాసులో ఇంకెవ్వరు ఆలోచించరేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి మన కష్టాల్లో మనతో పాటు ఉండి మన గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్లే మనకు అసలైన స్నేహితులు. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నా గానీ వాళ్లలో చైతన్య కచ్చితంగా ఉండే విధంగా చూసుకో అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

కథ యొక్క నీతి: సత్యమైన స్నేహం కష్టకాలంలోనే అర్థం అవుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది మనతో ఉంటారు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనతో ఎవరూ ఉంటే వారు నిజమైన స్నేహితులు.

Responsive Footer with Logo and Social Media