బంగారు గొడ్డలి



ఒక ఊరిలో ఆశయ్య మరియు కాశయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కాశయ్య తన పని కష్టపడి చేసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ఆశయ బద్దకస్తుడు, కష్టపడి పని చేయకుండా పెద్ద ఆశలు పెట్టుకుంటూ ఉండేవాడు.

కాశయ్య రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయలుదేరేవాడు. ఒక రోజు, కాశయ్య ఒక పెద్ద చెట్టును చూసి అక్కడికి వెళ్లాడు. "ఈ చెట్టులో చాలా కట్టెలు కొట్టుకోవచ్చు" అనుకుంటూ చెట్టుకు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి చెరువులో పడిపోయింది.

తర్వాత కాశయ్య బాధపడుతూ, గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. "నా గొడ్డలి చెరువులో పడింది. నా గొడ్డలి నాకు ఇవ్వు" అని ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ చెరువులో మునిగి బంగారు గొడ్డలి చూపించింది. "ఆ గొడ్డలి నాది కాదు" అన్నాడు కాశయ్య. మళ్ళీ గంగమ్మ వెండి గొడ్డలి చూపించి, "ఇది కూడా నా గొడ్డలి కాదు" అన్నాడు కాశయ్య. చివరికి గంగమ్మ ఇనుప గొడ్డలి చూపించి, "ఇది నా గొడ్డలి" అని అన్నాడు కాశయ్య.

గంగమ్మ చెప్పింది, "నీ నిజాయితీకి నేను మెచ్చుకొని నీకు మూడు గొడ్డళ్లను ఇస్తున్నాను" అని. మూడు గొడ్డళ్ళను తీసుకొని కాశయ్య ఇంటికి వెళ్లి, భార్యతో జరిగిన విషయం చెప్పాడు.

ఆ సమయంలో, ఆశయ ఆశ పడ్డాడు. అతను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలని అనుకుని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువుకు వెళ్లాడు. చెరువులో గొడ్డలిని పడేసి, "గంగమ్మ నాకు గొడ్డలి ఇవ్వు" అని ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ అలా కాశయ్యకు ఇచ్చిన గొడ్డలిని చూపించింది. "ఇది నీ గొడ్డలి కాదు" అని, "ఇనుప గొడ్డలి నీది" అన్నీ చెప్పింది.

ఇంతలో గంగమ్మ ఆశయ యొక్క దుర్బుద్ధి తెలుసుకుని, "నీది ఇనుప గొడ్డలి, కష్టపడి జీవించు" అని చెప్పింది. ఆశయ కంటిలో నీళ్లతో ఇంటికి వెళ్ళిపోయాడు.
కాశయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బుగా మార్చుకొని సంతోషంగా జీవించసాగాడు.

కథ యొక్క నీతి: దురాశ దుఃఖానికి కారణం, అత్యాశ వలన సంతోషం దొరకదు.

Responsive Footer with Logo and Social Media