చెడ్డ స్నేహితుడు
ఒక అడవిలోని నది ఒడ్డున చెట్టు దగ్గర ఎలుక ఒకటి ఉండేది. అక్కడే నదిలో కప్ప ఉండేది. నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి. అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది.
ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంటని తినాలని అనుకునేది ఎలుక. కానీ, నదిని దాటి వెళ్లడానికి దానికి ఈత రాదు.
నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక. నువ్వు బరువుగా ఉంటావు. నా వీపు మీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరము మునిగిపోతాం. అని బదులిచ్చింది కప్ప.
కానీ ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకునే ఎలుక, ఇలా అన్నది. నీ కాలికి నా కాలికి, ఒక తాడుని కడతాను. నువ్వు ఈత కొట్టుకుంటూ ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను. అని సలహా ఇచ్చింది. వెనుక మిత్రుడి మాటను కాదనలేక సరే అంది కప్ప.
ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది. తర్వాత కప్ప నదిలోకి దూకింది, అంతే ఎలుక బరువుగా ఉండటం తో అందులో మునిగి పోయే పరిస్థితి వచ్చింది.
అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది. కప్ప నీటిలోకి లాగింది. అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని, చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది.
కథ యొక్క నీతి: ఆలోచనలలో లోపం ఉంటే సమస్యలు కలుగుతాయి. ఒక చర్య చేయడానికి ముందు పూర్తి ఆలోచన అవసరం.