చిలుకల మాటలు



రామాపురం అనే ఊరిలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మాట్లాడే చిలుకలు పెంచుకోవాలనే కోరిక ఉండేది. ఒక రోజు, పక్క ఊరిలోని సంతలో చిలుకలు అమ్ముతారని తెలిసి, వాటిని కొనడానికి వెళ్లాడు విష్ణుశర్మ. సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలకలను పెట్టుకున్నాడు ఒక వ్యాపారి. విష్ణుశర్మ అక్కడికి వెళ్లి 500 రూపాయలు ఇచ్చి ఒక చిలుకను తీసుకుని ఇంటికి వెళ్లాడు.

ఆ చిలుక ఏమి అడిగినా, "అవునండి" అనే మాట తప్ప మరే మాట రాలేదు. వ్యాపారి మోసం చేశాడని, ఆ చిలుకను తీసుకుని వచ్చేవారం సంతకు వెళ్ళాడు విష్ణుశర్మ.

వ్యాపారి వద్దకు వెళ్లి, "ఈ చిలుకను కొన్న రోజు నేను 1000 రూపాయలు ఇచ్చాను. చిల్లర లేవని చెప్పావు, 500 రూపాయలు వచ్చే వారంలో సంతలో ఇస్తాను" అని అన్నావు, ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు విష్ణుశర్మ.

అప్పుడు వ్యాపారి, "నీవు 500 రూపాయలు ఇచ్చావు, నీకు ఏమీ ఇవ్వలేమని" అన్నాడు. అప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నదని చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అందులో ఒక పెద్ద మనిషి, వ్యాపారి విష్ణుశర్మకు పైసలు ఇవ్వాలని, చిలుకని అడిగాడు.

అప్పుడు చిలుక, "అవునండి" అంది. వ్యాపారి, చిలుకకు "అవునండి" అనే మాట తప్ప వేరే మాట రాలేదని చెప్పగా, మోసం చేసిన విషయం వెల్లడింది. వ్యాపారి, 500 రూపాయలు విష్ణుశర్మకు ఇచ్చాడు.

విష్ణుశర్మ మరో చిలుకను కొనుగోలు చేసి రెండు చిలకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

కథ యొక్క నీతి: ఆలోచనతో ఆనందంగా ఉండొచ్చు.

Responsive Footer with Logo and Social Media