క్రైమ్ స్టోరీస్
ఒక మర్డర్ మిస్టరీ
అర్ధరాత్రి కావొస్తోంది... మద్రాసు న్యూవింగ్టన్ హైస్కూలు భవనం పై అంతస్తు పడగ్గది. చీకట్లో, రెండు పడకల మీద గాఢనిద్రలో వున్నారు వాళ్ళిద్దరూ. హఠాత్తుగా గోడ గడియారం గంటలు కొట్టసాగింది. పన్నెండు గంటలు కొట్టడంతో తేదీ మారి, అక్టోబర్ 15, 1919 రాత్రి ... గంటలు పూర్తవగానే పెద్ద చప్పుడుతో ఢామ్మని పేలుడు! కెవ్వున కేక! గబగబా స్కూలు విద్యార్థులు దౌడు తీస్తున్న అడుగుల చప్పుళ్ళు...
సివిల్ సర్జన్ మేజర్ హింగ్స్‌టన్ కాల్ అందుకుని వచ్చి చూస్తున్నాడు. తల కుడిపక్క తుపాకీ గుండు దెబ్బకి శవమై పడున్నాడు హైస్కూల్ ప్రిన్సిపాల్ డేలా హై. గుండెలవిసేలా రోదిస్తోంది మిసెస్ హై.ఉదయం స్కూలు భవనం మెట్ల పక్కన 12 బోర్ గన్, దాని చుట్టూ కొన్ని తూటాలూ కన్పించాయి. పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేశారు. విద్యార్థులు కడంబూర్, సింగంపట్టి పోలీసుల ఎదుట వున్నారు.‘యేసెయ్యాలన్నాడ్సార్, దొరైని ఈ కడంబూరే!’ విద్యార్థులు చెప్పేస్తున్నారు.‘ఎందుకూ...’‘మా తమిళుల్ని బార్బేరియన్స్ అన్నాడ్సార్ దొరై - అందుకని!’‘బార్బేరియన్స్ అన్నాడని కోపంతో అలా మాట్లాడానే గానీ నేనేసెయ్యలేద్సార్!’ మొత్తుకోసాగాడు కడంబూర్. జమీందారు కొడుకు సింగంపట్టి తనకేం కాదని ధైర్యంగా వున్నాడు. ‘వీళ్ళే చంపేశార్సార్ దొరైనీ!’ తోటి విద్యార్థులు చెప్పేస్తూంటే, సింగంపట్టి ప్లేటు ఫిరాయించి అప్రూవర్‌గా మారిపోయాడు.
కడంబూరే చంపాడని వాంగ్మూలమిచ్చేశాడు. కడంబూర్‌ని అరెస్టు చేశారు.ఫ ఫ ఫనగరంలో భావోద్వేగాలు చెలరేగాయి. రకరకాల పుకార్లూ వాదోపవాదాలూ తెల్ల దొర హత్య చుట్టూ ముసురుకున్నాయి. పరిస్థితిని గమనించి మద్రాసు గవర్నర్ లార్డ్ విల్లింగ్డన్ భారత ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేసుని మద్రాసులో విచారిస్తే ... ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిందితుడు కడంబూర్‌కి న్యాయం జరగదనీ, జ్యూరీ ప్రభావితమయ్యే అవకాశముందనీ, అందువల్ల నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేసుని దూరంగా బాంబే హైకోర్టుకి తరలించాలనీ విజ్ఞప్తి చేశాడు.బాంబే హై కోర్టులో స్వయంగా విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సర్ నార్మన్ మెక్‌లాయిడ్, ఆ రోజు విచిత్ర వేషధారణలో కోర్టు కొచ్చాడు. మొహమంతా కప్పేసినట్టున్న విగ్గు, ఎర్రటి చెమ్కీ గౌను, మోకాళ్ళ పట్టీలు, సిల్కు సాక్స్, భారీ బూట్లు ధరించి వచ్చాడు.
మద్రాసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిడ్నీ స్మిత్, బాంబే బార్ లాయర్ డబ్ల్యు.ఎల్.వెల్డన్‌లు ప్రాసిక్యూషన్ చేపడితే, కడంబూర్ తరపున డిఫెన్స్ లాయర్‌గా బాంబేలో పేరుమోసిన క్రిమినల్ లాయర్ ఆర్డీ ఎన్ వాడియా, మద్రాసు క్రిమినల్ లాయర్లు డాక్టర్ స్వామినాథన్, యతిరాజ్‌లు విచ్చేశారు. అప్రూవర్ సింగం పట్టి తరపున బాంబే బారెట్లా జేడీ దావర్ నియమితుడయ్యాడు. ఏడుగురు సభ్యులతో స్పెషల్ జ్యూరీ ఏర్పాటయింది.‘మిలార్డ్, స్పష్టంగా వుంది. హత్యకి కారణం, కారకుడు, హత్యాయుధం, ప్రత్యక్ష సాక్షి ... అన్నీ కోర్టు ఎదుట ఉంచాం. ఆ రాత్రి నిందితుడు కడంబూర్ అప్రూవర్ సింగం పట్టిని తనతో రావాలనీ, లేకపోతే కాల్చుకు చచ్చిపోతాననీ బెదిరించాడు. రెండో రైఫిల్ సింగంపట్టికి ఇచ్చాడు. తను గురి తప్పితే సింగంపట్టి మిస్టర్ హైని షూట్ చేసేయాలన్నాడు ... సింగం పట్టినే అడుగుదాం. చెప్పు బాబూ, ఏం జరిగిందా రాత్రి?’ ప్రాసిక్యూటర్ అడిగాడు.
‘ఎవరడ్డొచ్చినా ఆళ్ళని కూడా యేసి పారెయ్యాలన్నాడు. అదృష్టవశాత్తూ దొరైని ఆడే గురి తప్పకుండా కొట్టాడు. కొట్టేసి ఆ తుపాకీనీ, తూటాల్నీ కిటికీలోంచి పార్నూకాడు. పారిపోయి వొచ్చేశాం...’ సింగం పట్టి చెప్తూంటే, ఎదుటి బోనులో వున్న కడంబూర్ రక్తం ఉడికి పోసాగింది.‘వరస్ట్ కేసు, యువర్ లార్డ్ షిప్’ అడ్డు తగిలాడు డిఫెన్స్ లాయర్ వాడియా.‘ఎట్లా?’ ఆసక్తిగా చూశాడు చీఫ్ జస్టిస్.‘యువరానర్, అంతెత్తు కిటికీలోంచి ఈ రైఫిల్ విసిరేసినట్టుందా? డ్యామేజీ అవదా? మైలార్డ్, ఈ బుల్లెట్స్ కూడా విండో లోంచి విసిరేస్తే ఎక్కడెక్కడో పడాలి కదా ... అక్కడున్న రైఫిల్ చుట్టూ పేర్చినట్టు పడడం ఏ భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం సాధ్యం?’‘ప్రొసీడ్!’‘రైఫిల్స్ ఎలా వచ్చాయ్ వీళ్ళకి? ఎవరో ఇస్తే తప్ప ఈ స్టూడెంట్ కడంబూర్ ఎక్కడ్నించి సంపాదించుకొస్తాడు, యువర్ లార్డ్ షిప్?’‘వాడ్డూయూ మీన్? ఐ అబ్జెక్ట్, మిలార్డ్... కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు!’ అరిచాడు ప్రాసిక్యూటర్.‘కేసా...తప్పుడు కేసా!’ నవ్వాడు వాడియా‘ఎలా? హౌ?’ ప్రాసిక్యూటర్లు ఎగబడ్డారు.డిఫెన్స్ లాయర్లు వాడియాకి రక్షణ వలయం కట్టారు.‘మరి రెండో రైఫిలెక్కడా? అది చెప్పండీ!’ నిలదీశాడు వాడియా.
‘డిస్‌గస్టింగ్ ... ది కేసీజ్ ఓవర్!’ అనేసి వెళ్ళిపోయాడు చీఫ్ జస్టిస్. జ్యూరీ తర్జన భర్జనలో పడింది.ఫ ఫ ఫకేసుకి హేతుబద్ధత లేదని జ్యూరీ ఏకాభిప్రాయానికొచ్చినట్టు ప్రకటించాడు చీఫ్ జస్టిస్. హత్యకి కారణం బలంగా లేదనీ, రైఫిల్స్ కుర్రాళ్ళకెలా వచ్చాయో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందనీ, రెండో రైఫిల్ ఎక్కడుందో చెప్పలేకపోయిందనీ, రైఫిల్‌నీ, బుల్లెట్స్‌నీ విసిరేస్తే అవి పడున్న విధానం నమ్మశక్యంగా లేదనీ ... అసలు సింగం పట్టి సాక్ష్యమే చెల్లదనీ, వీటన్నిటి దృష్ట్యా కేసు వీగిపోయిందనీ, నిందితుణ్ణి విడుదల చేస్తున్నామనీ తీర్పు ప్రకటించాడు చీఫ్ జస్టిస్.కడంబూర్ విడుదలై పోయాడు. మరి బ్రిటిష్ ప్రిన్సిపాల్‌ని చంపిందెవరు? కడంబూర్, సింగం పట్టిలని ఇంకెవరో వాడుకుని హత్య చేయించారా? ఎందుకు? ఈ మిస్టరీకి నూరేళ్ళు నిండుతున్నా ఇంతవరకూ జవాబుల్లేవు.