దురాశ నక్క
గోపాల పురానికి చెందిన కొంత మంది పిల్లలు పక్కనున్న అడవికి ఆవులను మేపడానికి వెళ్ళేవారు. మధ్యాహ్నం అక్కడే భోజనం కోసం సద్ది మూట తీసుకపోయే వారు. సాయంత్రానికి ఆవుల తో ఇంటికి వచ్చేవారు. ఆ అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో తమ ఆహారాన్ని దాచుకునేవారు పిల్లలు.
ఆకలేసినప్పుడు వచ్చి ఆహారాన్ని అందరూ పంచుకుని తినేవారు. ఒకరోజు ఒక నక్క కి బాగా ఆకలి వేసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ మర్రిచెట్టు దగ్గరికి వచ్చింది.
తొర్ర లోంచి గుమ గుమ వాసనలు నక్క ముక్కును తాకాయి. ఇంకేముంది, పుట్టలోకి దూరింది ఆహారాన్ని తిన సాగింది.
ఆకలి తీరిన ఆగకుండా అత్యాశ కొద్దీ నలుగురికి సరిపడా ఆహారాన్ని తనే తినేసింది. నక్క పొట్ట బాణాల తయారైంది.
తొర్ర లోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా మెడ వరకు మాత్రమే బయట పెట్టగలిగింది. బాణా లాంటి పొట్ట చెట్టు తొర్రలో ఇరుక్కపోయింది.
ఆహారమంతా అడిగి పొట్ట తగ్గితే గానీ బయటకు రాలేనని అర్థమైంది నక్కకి. ఇంతలో పిల్లలు, ఆకలేసీ భోజనం తిందామని మర్రిచెట్టు దగ్గరకు వచ్చారు.
తొర్రలో నక్కను చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళకి విషయం అర్థమైంది. నలుగురు పిల్లలు కలిసి నక్కను బయటకు లాగి నాలుగు దెబ్బలు తగిలించారు.
అత్యాశతో కోరి కష్టాలు తెచ్చుకున్నాను అనుకుంది నక్క.
కథ యొక్క నీతి: అనవసరమైన అత్యాశ వల్ల చివరికి కష్టాలు వస్తాయి. సమతుల్యం మరియు సంతృప్తి జీవనంలో ముఖ్యమైనవి.