గలివర్ సాహస యాత్ర
నాపేరు గలివరు. నేను మా తండ్రికీ పుట్టిన అయిదుగురు కుమారు
లలో మూడవ వాడను, మా నాన్న ఒకపాటి ఆస్తిపరుడు, అందువలన ఆతడు
తన కుమారుల చదువుకోసం ఆవసరమయినంతగా డబ్బు ఖర్చుపెట్టేవాడు. నేను
పాఠశాల చదువును ముగించింతరువాత, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాను.
ఆక్కడ మూడు. సంవత్సరాల కొలం గడిపాను. పిమ్మట ప్రసిద్ధిచెందిన సర్జన్
దగ్గర చదువుకోటానికి లండన్. వెళ్ళాను.
ఆ రోజుల్లో మా నాన్న నా సొంత ఖర్చులకోసం అప్పుడప్పుడు కొంత
డబ్బు పంపుతుండేవాడు. నేను ఆ సొమ్మును వృధా వ్యయం చేసేవాడను కాను,
గణిత "శాస్త్రానికి సంబంధించిన పరికరాలను, నౌకాయానానికి సంబంధించిన పుస్త
కాలను కొంటుండేవాడను. నా విరామకాలంలో ఆ పుస్తకాలను చదువుతుండేవాడను
పరికరాలను ఉపయోగిస్తుండేవాడను. అందుచేత నేను సర్జన్‌గా తయారవటంతో
బాటు, నౌకాయాన శాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించాను.
లండన్‌లో చదువు పూర్తి ఆయినతరువాత మా నాన్న (పోత్సాహ
ముతో హాలండ్‌కు వెళ్ళాను. ఆ దేశంలో లేడెన్ విశ్వవిద్యాలయం వైద్య విద్యకు .
చాలా ప్రసిద్ధిగాంచింది నేనక్కడ వైద్య విద్యార్థిగా రెండున్నర సంవత్సరాలకాలం
గడిపాను.
వైద్య విద్య పూర్తి అయినతరువాత నేను ఇంగ్లాండుకు తిరిగివచ్చాను.
అచిరకాలంలో “స్వేలో” అను పేరుగల ఓడపై డాక్టరుగా కుదిరాను. తూర్పు
దేశాలకు ఎన్నో దీర్గప్రయాణాలు చేసాను. ఈ ప్రయాణాలలో విశేషమయిన
అనుభవం సంపాదించాను.
ఈ మధ్యలో నేను కొంత డబ్బుగల బర్దన్ కన్యను వివాహం చేసు
కున్నాను. ఆమె మంచి హృదయంగల సుందరాంగి. సుఖమయ వైవాహిక జీవితం
గడపాలనే ఉద్దేశ్యంతో, సముద్ర ప్రయాణాలకు స్వప్తి చెప్పాను. వైద్య వృత్తి
నవలంభించి లండన్ మహానగరంలో స్థిరపడ్డాను. మామయగారి వ్యాపారానికి కూడా
వారసుడనయ్యాను.
అయితే వైద్య వృత్తి అంత లాభదాయకంగా కనిపించలేదు. వ్యాపా
రంకూడా క్రమక్రమంగా క్షీణించసాగింది. అటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి?
కర్తవ్యాన్ని గూర్చి నేను, నా భార్య కూలంకషంగా చర్చించుకున్నాం. చివరకు ఒక
నిర్ణయానికి వచ్చాం. ఈ నిర్ణయానుసారం నేను మళ్ళీ ఓడలలో డాక్టరుగా (ప్రవే
శించాను. బాగా ధనం సంపాదించసాగాను. నేను తిరిగి ఓడలలో పనిచేయటానికి
సహృదయంతో అంగీకరించిన నా భార్యను నేను అభినందించక తప్పదు.
ఒకసారి నేను దక్షిణ సముద్రయాత్రకు బయలుదేరిన “ఏంటిలోవ్”
ఆనే పేకుగల ఓడలో పనికి కుదిరాను. మా ఓడ బ్రిస్టల్ నగరంనుండి. కీ.శ,
1699వ సంవత్సరం మే నెలలో ఒక రోజున బయలుదేరింది.
సమ్ముద (పయాణం చాలా ఆహ్లాదకరంగా వుంది, సమ్ముదపు గాలి
నాకు మంచి శక్తిని (పసాదిస్తోంది. సమ్ముదపు' హోరు నాకు ఎక్కడలేని "ఉత్సా
హాన్నీ కలిగిస్తోంది. నేను రాత్రిళ్ళు ఆకాశంవంకా, ఆకాశంలోని నక్షత్రాలవంకా
చూస్తుండేవాడను. నక్షత్రాలకు సంబంధించిన నిగూఢ రహస్యాలనుగూర్చి బుర్ర
త్మీవంగా ఆలోచిస్తుండేది. ఆ అపూర్వ అనుభవాన్ని వర్ణంచటానికి మాటలు
చాలవు. ఎవరి మట్టుకు వారు అనుభవించి ఆనందించవలసించదే.
రోజులు గడిచిపోతున్నాయి. నెలలు గడచిపోతున్నాయి,ఓడ ముందుకు
సాగిపోతోంది.
హఠాత్తుగా ఒకరోజున వాతావరణంలో తీవ్రమైన మార్పు కనిపించ
సాగింది. తీవ్రమైన తుఫాను రాబోతోందని ఓడలోని వారందరం భయపడ
సాగాం.
భయపడినంతా అయ్యింది. ఒక దుర్ముహూర్తాన ప్రచండమయిన
తుఫాను బయలుదేరింది. గాలుల ధాటికి మా ఓడ మునిగిపోతుందేమో ఆని భయ
పడ సాగాం, మా కందరకూ సర్వలోక రక్షకుడగు భగవంతుడు జ్ఞప్తికి వచ్చాడు.
మే మందరం మా ప్రాణాలను రక్షించే భారాన్ని ఆ భగవంతునిమీదనే "పెట్టాం.
అయినా 'మమ్మల్ని భయం వదిలి పెట్టలేదు.
గాలి తన ప్రతాపాన్ని చూపుతూనే వుంది.ఓడ ఏ క్షణాన్న సముద్ర
గర్భం పాలవుతుందో తెలియకుండా వుంది, గాలుల ధాటికి ఓడ భూమధ్యరేఖను
దాటి చాలా దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోయింది. మా ఓడ వున్న ప్రదేశం ఏమిటో
మాకు స్ఫష్టంగా తెలియటంలేదు. ఆ ప్రదేశం మా దగ్గరవున్న పటాలలో ఎక్కడా
కనిపించలేదు.
ఓడలోని నావికుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుంది. వారు తలకు
మించిన భారంతో శ్రమపడవలసివస్తోంది. వారికి సరియైన ఆహారం లభించటం
లేదు. ఈ పరిస్థితుల (పభావంవ్యల్ల కొందరు నావికులు నీరసించి ప్రాణాలు వది
లారు. మిగిలిన వారం అందుకు విచారించటం తప్ప చేయదగింది ఏమీ లేక
పోయింది.
మిగిలినవారి శరీంల్లోని శక్తికూడా క్రమ క్రమంగా సన్నగిల్లుతుంది
మరణ దేవత ఎప్పుడు ఎవరిని కౌగిలించుకుంటుందో తెలియకుండా వుంది.
నవంబరు 5వ తేదీ వచ్చింది,.మేమున్న దక్షిణ (పాంతంలో ఈ రోజు
ల్లోనే వేసవికాలం ప్రారంభమవుతుంది. ఆ రోజున మా నావికుల్లో ఒకనికి
సమ్ముద గర్భాన్న దాక్కుని పైకి పొడుచుకువచ్చిన కొండ కనిపించింది. అతడా
విషయాన్ని మాకందరకూ తెలియజేసాడు. అప్పడు మాకు కలిగిన భయం ఇంతా
అంతా కాదు. ఓడ వెళ్ళి ఆ కొండను ఢీ కొంటే జరిగేదేమిటో ఎవరయినా సులభ
ముగా ఊహించగలరు. ఇటువంటి విషయం ఎవరయినా చెబుతుంశే వింటేనే ఒళ్లు
జలదరిస్తుంది. మరి అటువంటి దృశ్యం నిజంగా ఎదురయితే ?
గాలి ప్రచండంగా విస్తోంది, ఆలా వీచటంవల్ల కలిగే దారుణమయిన
ఫలితం ఏమిటో దానికేమాత్రం పట్టినట్లు లేదు, ఓడ కొండను సమీపిస్తోంది,
“సమీపిస్తోంది.. సమీపించింది.. వేగంగా వెళ్ళి ఢీ కొట్టింది.
ఓడ రెండు ముక్కలయింది. అది పూర్తిగా సముద్రగర్భంలో మునిగి
పోక పూర్వం కొందరు నావికులు సాహసంతో కొండపైకి వెళ్లారు. తరువాత వారి
గతి ఏమయిందో నాకు తెలియదు, వారు నీటీపాలయ్యారని ఊహించటమే సమం
జసంగా వుంటుంది.
ఆయితే వేరొక జట్టువారు మాత్రం అపూర్వ దైర్య సాహసాలు ప్రదర్శించి ఓడకు కట్టుబడియున్న ఒక పడవలో ప్రవేశించి దానిని ఓడనుంచి వేరు చేయ గలిగారు. ఆ అదృష్టవంతుల జట్టులో నేనుకూడా వున్నాను, ఈ విషయం తెలపటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది అంతా దై వానుగహం
పడవలోని ఆరుగురమూ సర్వజన రక్షకుడయిన భగవంతుని నామాన్ని
ఉచ్చరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఆ విధంగా సుమారు పదిమైళ్ళు
(పయాణం చేసాం. కాని అంతలో మరో ప్రమాదం ఎదురయింది. తాడి (పమాణ
మున్న ఒక పెద్ద అల మా పడవమీదకు వచ్చింది, పడవలోని వాళ్ళం నీళ్ళలో
పడ్డాం. పడవ నీటిలో మునిగిపోయింది.
నాతోబాటు నీళ్ళలో పడ్డ నా సహచరుల గతి ఏమయిందో నాకు తెలి
యదు. ఆ అయిదుగురూ సముద్రదేవత ఆగ్రహానికి బలి అయిపోయారని నేను
ఊహించవలసి వస్తుంది.
సహచరులనందరినీ పోగొట్టుకున్న నేను ఇంక చేయవలసింది ఏమిటి?
భగవంతునిమీద భారంవేసి ముందుకు ఈదుకుపోసాగాను. బొందిలో పాణం
వున్నంతవరకు దానిమీద తీపి తప్పదుకదా గాలి, సముద్రపు పోటు నాకు ఎంతో
సహాయపడసాగాయి . నీటి అడుగు నేల తగులుతుందేమో అని అప్పుడప్పుడు
ప్రయత్నించి చూడసాగాను. కాని ఎక్కడా నేల తగలడంలేదు.
క్రమక్రమంగా శరీరంలోని శక్తి సన్నగిల్లసాగింది. అయినా నేను
పట్టువిడవకుండా ముందుకు శఈదుకుపోతూనే వున్నాను,కాని ఎంతకాలం ఆవిధంగా,
చేయగలను? దేనికయినా ఒక మితి అంటూ వుంటుంది. నేను ఆ స్థితినికూడా దాటి
పోయే దళకు వచ్చాను. చివరిసారిగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను.
నేల తగులుతుందేమో అని (ప్రయత్నించి చూసాను.
అవును, నేను అదృష్టవంతుడనే కాళ్ళకు నీళ్ళలోని నేల తగిలింది
ఆ క్షణాన నాకు వేయి ఏనుగుల బలం వచ్చింది. నేను చేయవలసిన గొప్ప పనులు
ఎన్నోవున్నాయి. అందుచేతనే భగవంతుడు నాకు మాటిమాటికీ తోడ్పడుతున్నాడు
అని అనుకోసాగాను.
మళ్ళీ ఈదటం పారంభించాను. తుఫాను ఉధృతం తగ్గిపోయింది.
సముద్రం చాలా ప్రశాంతంగా వుంది. నేను కొంచెంసేపు ఈదుతున్నాను. కొంచెం
సెపు నీళ్ళలో నడుస్తున్నాను, నడుస్తున్నప్పుడు నీళ్ళు నా గడ్డందాకా పుంటున్నాయి.
అజాగత్రగా వున్నప్పుడు నీళ్ళు నోట్లోకి గూడా వెళ్తన్నాయి...
ఎట్టకేలకు పౌడి నేల చేరుకున్నాను. నక్షత్రాలను బట్టి చూడగా అప్పుడు రాతి ఎనిమిది గంటలు అయివుంటుంది. సుమారు ఒక అరమైలు దూరం లోపలికి నడిచివెళ్ళాను. నాకెక్కడా ఇళ్ళుగాని, మనుష్యులుగాని కనిపించలేదు. బాగుగా “అలసిపోయి యున్న నాకు దృష్టి మందగించిందేమో మరి ఇంక నేను ఏ విష యాన్ని గూర్చి ఆలోచించే స్థితిలో లేను. నీరసంవళ్ల న్నిద్రముంచుకుపస్తోంది. ఇక చోట మెత్తని పచ్చిక నేల తగిలింది. వెంటనే అచ్చట మేనువాల్చాను. ఆసతి కాల ములో గాఢంగా నిద్రపట్టింది.