హితవు
ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక రోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి.
వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరుగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి.
” నీళ్ళతో గొంతు తడుపుకొకపోతే నా ప్రాణం పోయేలా ఉంది ” దీనంగా అంది ఒక కోతి.
” ఏం చేద్దాం… నీళ్ళు కనబడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు. ఇదేమి మాయో…” అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటోంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది.
“ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోండి” అని చెప్పింది. ఇది విని కోతులకి చాలా కోపం వచ్చింది.
“మేం తెలివితక్కువ వాళ్ళమా? ” అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. “నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి” భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం విడిచింది.
కథ యొక్క నీతి:మనోభావాలను సమర్ధంగా మార్చుకోకుండా, నిర్లక్ష్యంగా పని చేయడం వల్ల కొంతమందిని నష్టపోవాల్సి వస్తుంది.