ఐక్యత ఒక బలం



ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా వేటకు బయలుదేరాడు. కానీ ఆ రోజు ఏ జంతువు కూడా తన వేటకు చిక్కలేదు. రోజంతా తిరుగుతూ తిరుగుతూ అలసిపోయిన వేటగాడు సాయంత్రానికి ఒక ఆలోచన తీసుకున్నాడు.

ఒక చెట్టు కింద సన్నటి వల వేశాడు, దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలు చల్లాడు. తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు.

ఇంతలో అటునుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి. వెంటనే గుంపంతా ఇటు వైపు రావడం మొదలుపెట్టాయి. హాయిగా కింద పడిన విత్తనాలను తింటున్న పక్షులు, మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి. వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు ఆనందించాడు.

మరోవైపు, భయంగా ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి. అప్పుడు ఆ పక్షులలో ఒక పక్షి ఇలా అన్నది: "మనమందరం వేటగాడి వలలో పడ్డాము. ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నాం. ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి."

ఇప్పుడు మిగతా పక్షులు "ఏంటి ఆ నిర్ణయం?" అని అడిగాయి. మరో పక్షి సమాధానం ఇచ్చింది: "ఒంటరిగా ఎగరలేని మన అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలను రక్షించుకోవచ్చు."

వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి. అనుకున్నట్లుగా కొద్దిక్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగిరి, వలతో పాటు గాలిలోకి ఎగిరి పోయాయి. దీంతో తమ ప్రాణాలను రక్షించుకున్నాయి.

వేటగాడు ఆ పక్షులను ఎగరడం గమనించి, ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వేటగాడు బారి నుంచి తప్పించుకుని పక్షులు విముక్తి పొందాయి.

కథ యొక్క నీతి: ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.

Responsive Footer with Logo and Social Media