కాకి హంస కాగలదా?



ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది! ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది.

ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి.

మరునాడు నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా!

అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది.

అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది.

కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది.

ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.

Responsive Footer with Logo and Social Media