కొంగ జిత్తులమారి నక్క



ఒక అడవిలో కొన్ని జంతువులు, పక్షులు ఉండేవి. అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు పట్టి తినేది. ఎవరైనా అడిగితే, కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది. ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ. పక్షులు, జంతువులు అన్నీ కొంగను మెచ్చుకునేవి. ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ, లోలోపల కొంగపై అనసూయ పెంచుకున్నది. దానిని ఎలాగైనా బంగపరచాలని అనుకున్నది నక్క.

ఒక రోజు కొంగ వద్దకు వెళ్లి, "రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను, కాదనకు మిత్రమా!" అంటూ ప్రేమగా నటించింది నక్క. "సరే మిత్రమా, నీవు ఇంతగా పిలిస్తే కాదంటానా?" అని ఒప్పుకున్నాడు కొంగ. మరుసటి రోజు కొంగ వెళ్లిన తర్వాత, పాయసం, చేపల పులుసు మరియు కొన్ని రకాల వంటకాలు అన్నీ చేసి, వెడల్పాటి పాత్రలో పోసి, కొంగ కోసం ఎదురు చూస్తున్నది నక్క.

కొంగను చూడగానే, "రా మిత్రమా రా!" అంటూ ఆహారాన్ని చూపించింది. "తిను" అని చెప్పింది, నక్క తినడం ప్రారంభించింది. కానీ కొంగకు, వెడల్పాటి పాత్రలోని ఆహారం తినడంలో ఇబ్బంది వచ్చింది. అప్పటికి నక్క హేళనగా, "ఇలా తినాలి మిత్రమా! చూడు" అంటూ మొత్తం తినేసింది.

కొన్ని రోజుల తర్వాత, నక్కకు బుద్ధి చెప్పాలని, కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది. పొడవాటి పాత్రలో పాయసం పోసి, "తాగు మిత్రమా, పాయసం చాలా బాగుంది" అన్నాడు కొంగ. "ఇలా తాగాలి! చూడు, నేను చూపిస్తాను" అని తన ముక్కును పొడవాటి పాత్రలో పెట్టి, పాయసం అంతా తాగేసింది కొంగ.

"ఇంత రుచికరమైన పాయసం తాగలేక పోయావు మిత్రమా?" అంటూ హేళనగా నవ్వింది కొంగ.
"నేను చేసిన దానికి సరిగా బుద్ధి చెప్పినది" అనుకున్నది నక్క, లోలోపల.

కథ యొక్క నీతి: ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే, వారు కూడా మోసపోతారు.

Responsive Footer with Logo and Social Media