కోపం వస్తే
గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకురమేశ్. పదో తరగతి చదివేవాడు. రమేశ్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే, ఎంత కోపపడ్డా, దిగి పోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేశ్ రోజూ ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతణ్ణి గట్టిగా మందలించాడు. 'రమేశ్! నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు' అని చెప్పాడు.
రమేశ్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రానురాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఓరోజు రంగయ్య రమేశ్‌కి అది చూపించి, 'ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా! నువ్వు కోప్పడేకొద్దీ ఎదుటివాళ్లు కూడా నిన్ను ఇలాగే చూస్తారు...' అని చెప్పాడు. 'అర్థమైంది నాన్నా... నన్ను నేను మార్చుకుంటాను!' అన్నాడు. అప్పుడు రంగయ్య 'మంచిదే! నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ ఒక్కో మేకును తీసేస్తూ ఉండు' అన్నాడు. రమేశ్ అలాగే తీయడం మొదలుపెట్టాడు…
అతను మేకును తొలగించిన ప్రతిచోటా తలుపుపైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలి పోయింది. అప్పుడు రంగయ్య రమేశ్ భుజం మీద చేయివేసి, 'నువ్వు ఎదుటివాళ్లపైన కోపం చూపినప్పుడల్లా, వాళ్ల మనసులో నువ్వు ఓ మేకును దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయతీగా, శ్రద్ధగా మేకును తీసినా, ఎదుటివాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి, ఎవర్నీ అనవసరంగా కోప్పడకూడదు!' అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేశ్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.
కథ యొక్క నీతి: కోపం అనేది మనసులోని మేకుల వలె, ఒకసారి దేనికి నష్టం జరిగినప్పుడు ఆ చిల్లు మిగుల్తుంది.