నక్క మరియు కోడిపుంజు



ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరక వచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇకమీదట జంతువులన్నీ కలసి మెలసి స్నేహితులు లాగా జీవించాలంట. అందుచేత కిందకు రా! మనం ఇద్దరం స్నేహితుల్లాగ మసలుకొందాం!” అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజం ఎంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది “అవును, ఆ వార్త నేను కూడా విన్నాను” అంది. లోలోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరికి కోడిపుంజు ఇలా అంది “అదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు, వాళ్లను కూడా రాని అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం!”

“ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే! ఇంతకూ ఎవరు వస్తున్నారు?” అని అడిగింది నక్క.

వేట కుక్కలు, వాటి స్నేహితులు” అని జవాబిచ్చింది పుంజు.

వేట కుక్కలు పేరు వినగానే నక్క హడలెత్తి పోయి వణకడం మొదలుపెట్టింది, వాటి కంటపడితే చావడం ఖాయం అనుకున్నది నక్క.

“అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు?” అని అడిగింది కోడిపుంజు.

అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకొంటాను” అని అక్కడి నుండి పరిగెత్తి పారిపోయింది.

కథ యొక్క నీతి: పొరపాటున లేదా మోసంగా చెప్పిన మాటలు ఇతరులను స్మార్ట్‌గా చేస్తాయి.

Responsive Footer with Logo and Social Media