నవ్వులే నవ్వులు పార్ట్ 2


క్లయింట్ : సార్ ఒక్క ప్రశ్నకు ఎంత ఫీజు తీసుకుంటారు?
లార్ : ప్రశ్నకు రెండొందలు
క్లయింట్ : కొంచెం తగ్గించరా?
లార్ : తగ్గించను ఈ రెండు ప్రశ్నలకు నాలుగువందలు ఇవ్వండి


దేవుడు ప్రత్యక్షమై “ఏమిటి నీ కోరిక?” అన్నాడు.
భక్తుడు : నాకు టీవీ సీరియల్లో హీరోగో నటించే వరం ఇవ్వండి" అన్నాడు.
దేవుడు : “కాని వంద సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడం సృష్టి విరుద్దం కదా” అన్నాడు.

మొదటి హీరోయిన్ : “ నేను మొన్న అర్ధరాత్రి రోడ్డుమీద ఒంటరిగా నడిచాను" అంది.
రెండో హీరోయిన్ మేకప్ లేకుండా నడిచుంటావ్" అంది.


విలేఖరి: "మీరు పెళ్ళయిన తర్వాత నటించడానికి మీ భర్త ఒప్పుకున్నారా?” అని అడిగాడు.
హీరోయిన్ : " అది డిసైడ్ చేసేది.. నా భర్త , నేనో కాదు, ప్రేక్షకులు” అంది.


డైరెక్టర్ : “నేను తీయబోయే హర్రర్ సినిమాలో మీ పాత్ర ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుంది” అన్నాడు.
హీరోయిన్ : నాకు ఎలాంటి మేకప్ వేయబోతున్నారు” అంది.
డైరెక్టర్ : మీరు మేకప్ ఏమీ వేసుకోకండి చాలు॥ అన్నాడు.


రాము : " ఆయన బాడీ లాంగ్వేజ్ బావుంది అంటే ఏమిటర్ధం?” అని అడిగాడు.
శ్యాము : ఆయన బాడీపైన రాయించుకున్న టాటూలో భాష బావుందనేమో” అన్నాడు.


డాక్టర్ : నేను జ్వరానికి మూడు టాబ్లెట్స్ రాస్తాను.. నువ్వు ఆ పేషెంట్ కి ఐదు టాబ్లెట్స్ రావావేం..? అని అడిగాడు.
మరో డాక్టర్ : మెడిసిన్లపై థర్టీ పర్సెంట్ కమీషన్ వస్తున్నప్పుడు, ఆ మాత్రం రాయాలనిపించదా” అన్నాడు.


ప్రతిపక్ష నాయకుడు : "మొన్న ఎన్నికల్లో మీరు గెలిపించిన అభ్యర్తి కోట్లు తినేసాడు అని పేపర్లో వచ్చింది. ఈ సారి ఎవరిని గెలిపిస్తారు?" అని అడిగాడు. జనంలోంచి గొంతు వినిపించింది “మళ్లీ అతణ్నే.. అతను మాకు ఫ్రీ బియ్యం, ఫ్రీ ఆరోగ్యం, ఫ్రీ చదువు, అన్నీ ఇస్తాడు” అని..


పక్కింటావిడ : "మీ పాపకు అనురాగాలు సీరియల్ చూపిస్తూ అన్నం పెడతావెందుకు?" అని అడిగింది.
విమల : “నేనుకూడా చిన్నప్పుడు ఈ సీరియల్ చూస్తూనే అన్నం తినేదాన్ని” అంది.
పక్కనేఉన్న విమల అమ్మ: "మా అమ్మకూడా నాకు ఈ సీరియల్ చూస్తూనే అన్నం తినిపించేది" అంది.


విలేఖరి : "మీ సినిమాలలో నటీమణులు చిన్న బట్టలతో నటిస్తుంటారు. మరీ మీ కొత్త సినిమాలో కూడా అంతేనా?” అని అడిగాడు.
నిర్మాత : కొత్త సినిమాకి అస్సలు కాస్ట్యూమ్ డిజైనరిని పెట్టుకోలేదు” అన్నాడు ఉత్సాహంగా.


బార్య : “ఎప్పుడూ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళేవాళ్లం. ఇవాళ మ్యాట్నీకెళ్లాం అంటున్నారేం?" అంది చీరలు తీస్తూ..
భర్త : ఎప్పుడూ సినిమా సగం అయిపోయాక వెళ్తున్నామని అలా చెప్పా, నిజానికి ఇవాళ్ళకూడా ఫస్టే షో కే..” అన్నాడు.


జడ్జి : "ఏంటయ్యా.. మాటమాటికీ వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావు?” అని అడిగాడు.
దొంగ : అదేంలేదు సార్. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తున్నప్పుడే దొరికి పోతున్నాను” అన్నాడు నిట్టూరుస్తూ..


జడ్జి : "నువ్వు ఎప్పుడూ పోలీసుల ఇంట్లోనే దొంగతనం ఎందుకు చేస్తావు?” అని అడిగాడు.
దొంగ : వాళ్ళకు పై ఆదాయం బాగా ఉంటుందని” చెప్పాడు.


సంజయ్ : "నాకు గుణవతి, రూపవతి, విద్యావతి, శీలవతి అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు.
విజయ్ : “అలా అయితే నువ్వు నలుగురు అమ్మాయిలను పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది” అన్నాడు.


హిమ : "మన కాలేజిలో అంతమంది అమ్మాయిలు ఉన్నా నన్నే ఎందుకు ప్రేమించావు?" అని అడిగింది.
సుమంత్ : “నువ్వయితేనే నా మాటలు నమ్ముతావని" అని నాలుక కరచుకున్నాడు.


ఒకతను " నాకు జ్వరం వచ్చిందని డాక్టర్కి చెప్పా. వెంటనే అతను బ్లడ్ టెస్ట్, బిపి, ఈసిజి, సీటీ స్కాన్ చేయించుకోవాలని చెప్పాడు" అన్నాడు బాధగా.
రెండో అతను "నేను ఎలక్ట్రిషియన్ని, కరెంట్ బిల్ ఇవ్వడానికి వచ్చాను. నాకు మీకు చెప్పిన అన్ని టెస్టులూ రాశాడు" అన్నాడు మరింత బాధగా...


తెలివైన డాక్టర్?
జ: "మీకు ఏ జబ్బువచ్చినా ఏ టెస్టూ లేకుండా, ఒక్క టాబ్లెట్తోనే నయం చేస్తాం” అని క్లీనిక్ ముందు బోర్డు పెట్టేవాడు.


సుబ్బారావు : నేను నీకు ఇరవై సంవత్సరా నుండి ఇటు వచ్చినప్పుడల్లా అరవై ఆరు రూపాయలు
ఇచ్చేవాణ్ని. ఈ మద్య నన్నుచూసి మొహం మాడ్చుకుంటున్నావు” అని అగిగాడు బిచ్చగాడు. ఈ రోజుల్లో రూపాయికి ఏమొస్తుంది సార్. కాస్త ఎక్కువ దానం చెయ్యండి" అన్నాడు.


దేవుడు ప్రత్యక్షమై “ఏంటి భక్తా.. నా లీలల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నువ్వెందుకు అనుమానిస్తున్నావు?” అని అడిగాడు.
భక్తుడు సురేష్ : “ఈ మద్య తెగ ఎండలు, వర్షాలు లేవు. మరోపక్క సునామీలు, మీరేమైనా మనుషుల మీద పగబట్టారా?” అనుమానంగా అడిగాడు.


దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
భక్తుడు : ఇంతకీ మనుషులకు పునర్జన్మ ఉందా?” అని అడిగాడు.
దేవుడు : "ఎందుకు నీకా అనుమానం?" అని అడిగాడు.
భక్తుడు : నాకు భూమ్మీద బాగా ఎంజాయ్ చెయ్యాలని కోరిక.. పునర్జన్మ ఉంటే అవి తిరుతాయని” చెప్పాడు.


సంగీత సెల్ లో మాట్లాడుతూ.. "లతా నీతో గంటకన్నా ఎక్కువ మాట్లాడాను. నా వంద రూపాయల రిఛార్జింగ్ అయిపోయింది” అంది ఆశ్చర్యంగా లతా “కాని నువ్వు చెప్పే విషయాలు సగంలోనే ఆగిపోయింది” అంది బాధగా.


హైదరాబాద్లో...
కొత్తగా వచ్చిన ఆకాశ్ "ఒక్క కిలో మీటర్ లోనే పది స్టాపులా కండక్టర్గారూ” అని అడిగాడు.
బస్ కండక్టర్ "అవి స్టాపులు కావు. స్పీడ్ బ్రేకర్లు.. అక్కడ జనం ఎక్కుతుంటారు, దిగుతుంటారు” అని చెప్పాడు.
ఆకాశ్ : మరి బస్ స్టాపులో దిగరా?" అని అడిగాడు.
కండక్టర్ : దానికి ముందు వచ్చే స్పీడ్ బ్రేకర్ దగ్గర దిగిపోతారు” అన్నాడు.


రాము "హైదరాబాద్ సిటీ చూద్దామని వచ్చాను. ఒక్క రోజులో చూడవచ్చా?" అని అడిగాడు.
సంతోష్ : “ఇది వరకు అలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కోరోజు ఒక్కోప్లేసుకి వెళ్ళాలి" అన్నాడు.
రాము : "ఎందుకు?" అని అడిగాడు.
సంతోష్ : ట్రాఫిక్ జామ్ వల్ల" అని చెప్పాడు.


టీచర్ : "ఎంతయినా పరాయి దేశం వెళ్ళి వాళ్ళకు సేవ చేసేకన్నా, సొంత దేశ సేవ మంచిది" అంది.
రాము : "ఎందుకు?" అని అడిగాడు.
టీచర్: ఇక్కడే, సేవచేస్తే కోట్లు సంపాదించుకోవచ్చు మన ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు, రాజకీయ నాయకులనీ చూస్తే తెలియడం లేదూ!" అంది.


రామారావు : "మా వాడికి కోట్లు సంపాదించాలని కోరిక” అన్నాడు.
సుబ్బారావు : “బిజినెస్ చేద్దామనుకుంటున్నాడా?" అని అడిగాడు.
రామారావు : దానికి వాడు ఐ.ఏ.ఎస్. అయ్యే మార్గం ఎంచుకున్నాడు. దాంట్లో బిజినెస్ లాగా లాస్ ఏమీ ఉండదట" అన్నాడు.


రాజకీయ నాయకుడు "నన్ను, మామూలు దొంగలతో కలిపి ఒకే సెల్లో ఉండమంటున్నారా?" అని అడిగాడు కోపంగా.
జైలర్ : "వాళ్ళకీ మీలాగే డబ్బంటే మాచెడ్డ ఆశక్తి" అని సర్దిచెప్పాడు.


విలేఖరి : "మీరు సినీరంగం నుండి రాజకీయ రంగానికి వెళ్తున్నారా?" అని అడిగాడు.
హీరో : లేదు కాని నిజానికి రాజకీయరంగం నుండి సినీరంగంలోకి వస్తేనే ఈజీగా నటించేయగలరు" అన్నాడు.


సురేష్ : "నేను స్వట్జర్లాండ్ వెళ్తున్నాను.. ఈ సమ్మర్లో అన్నాడు.
నరేష్ : మంచి ఐడియా" అన్నాడు.
సురేష్: ఏంటి? " అని అడిగాడు.
నరేష్ : అక్కడి బ్యాంకుల్లోనే మన డబ్బులు సేఫ్ అండ్ సీక్రెట్” అన్నాడు.


పిసినారి పాపారావు బస్ండ్లో వెయింగ్ మిషిన్ లో రెండు రూపాయల కాయిన్ వేసి, దానిపై నిలబడ్డాడు. దాంట్లో నుంచి బరువు ఇంకా అదృష్టంతో "మీ బ్రతుకులో ఈ రోజు లాభం కలుగుతుంది" అని వచ్చింది. తర్వాత తాను వేసిన రెండురూపాయల కాయిన్ బయటకి వచ్చింది. పిసినారి పాపారావు ఆ రెండు రూపాయలు తీసుకొని, "లాభం వస్తుందని ఎంత కరెక్టుగా చెప్పింది" అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు.


బస్టాండులో గవర్నమెంటు వెయింగ్ మిషన్పై నిలబడి సుందర్ దాంట్లో రెండు రూపాయల కాయిన్ వేశాడు.

పక్కనతను "అరె, ఎలా వచ్చింది?" అన్నాడు ఆశ్చర్యపోతూ.. సుందర్ "నాకు గవర్నమెంట్ వాళ్లపనితీరు బాగా తెలుసు. పై ఆదాయం వస్తే ఎంతపనైనా చేస్తారు" అన్నాడు.


రాము "ఎప్పుడూ నేను బస్ పాస్ చూపిస్తే కండక్టర్ రైట్' అనేవాడు. ఇవ్వాళ 'రాంగ్" అన్నాడేం?" అన్నాడు.
శ్యామ్ : నీ బస్ పాస్ డేట్ అయిపోయిందేమో చూసుకో" అన్నాడు.


హైదరాబాద్ లోకల్ బస్సులో...
కండక్టర్ "బస్సు ఎక్కకండి, రష్ ఎక్కువగా ఉంది. వెనుక ఖాళీ బస్సు వస్తుంది." అన్నాడు.
ప్రయాణీకుడు హరీష్ : " ఆ బస్సు ఎక్కితే జర్నీ చేసినట్లుండదు" అన్నాడు.


బార్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు.
రమేష్: “పెళ్ళయిన తర్వాత మన ఫ్రెండ్స్ అంతా మాటలు తగ్గించేశారు. సురేష్, నువ్వేంటి మాట్లాడ్డమే మానేశావు? అని అడిగాడు.
సురేష్: నాకు ఇద్దరు భార్యలు " అని చెప్పి ముగించాడు.


ఇద్దరు బాస్ లు మాట్లాడుకుంటున్నారు.
మొదటి బాస్ : "నువ్వు ఎవ్వరినీ నమ్మవెందుకు?" అని అడిగాడు. రెండవ బాస్ : "నిజం చెప్పాలంటే నన్ను నేనే నమ్మను” అన్నాడు.


గురువు : "మనిషి, దేవుడు మనలాగే ఉంటాడని ఊహించి మన రూపంలోనే దేవుడిని తయారుచేసాడు" అన్నాడు ఆలోచించి.
శిష్యుడు : "దేవుడు మనలాగే ఎక్స్పెక్టచేస్తాడు అనుకొని, ప్రతిపని పూర్తవగానే దేవుడికి దక్షిని ఇస్తాం" అన్నాడు బాగా ఆలోచించి,


రాజారావు "జీవితంలో నాకు ఒకటే కష్టం.. నాకు పిల్లలు లేరు" అన్నాడు. ఆనందరావు “నాకు ముగ్గురు పిల్లలు అంటే మూడు కష్టాలు" అన్నాడు.


రాజేష్ : “ఈ మధ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చేసిన ప్రతి తప్పుకు, దేవుడు హుండీలో పది రూపాయలు వెయ్యాలని నిర్ణయించుకున్నాను" అన్నాడు.
సురేష్ : తర్వాత..' అని అడిగాడు.
రాజేష్ : “తర్వాత ఏముంది! నా తప్పులకు జీతం సరిపోవడంలేదు. అప్పులు తీసుకొని మరీ హుండీలో వెయ్యాల్సివస్తుంది" అన్నాడు విచారంగా..


ఇద్దరు విడిపోయిన ఫ్రెండ్స్ సెల్లో మాట్లాడుకుంటున్నారు. మొదటి ఫ్రెండ్: మనం విడిపోయి ఇన్ని రోజులైనా నువ్వు రోజూ గుర్తుకు వస్తుంటావు" అన్నాడు. రెండవ ఫ్రెండ్: "ఎందుకు?" అని అడిగాడు. మొదటి ఫ్రెండ్ నీ తిట్లు అలాంటివి" అన్నాడు.


ప్రతిపక్షనాయకుడు "పెట్రోల్ ధర పెంచితే సాధారణ ప్రజలు ఎట్లా బ్రతుకగలరు" అన్నాడు.
అధికార పక్షం నాయకుడు "అంతర్జాతీయం ఆయిల్ రేట్లు పెరిగాయి" అన్నాడు.
ప్రతిపక్షనాయకుడు "అయినా మేం ప్రజల కోసం బంద్ ప్రకటిస్తున్నాం" అన్నాడు. ఆవేశంగా..
అధికార పక్షం నాయకుడు: "మీ బంద్ లో ప్రజలకు కష్టం రాకుండా చూస్తాం" అన్నాడు..


అనిత : " మా ఆయన అన్నీ తప్పులే చేస్తుంటాడు" అంది.
సైకాలజిస్ట్ : మీరు ప్రేమ, అవగాహన పెంచుకోవాలి. వారం రోజుల తర్వాత
ఎలా ఉందో చెప్పండి" అంది.
అనిత వారం రోజుల తర్వాత వచ్చి అంది" నిజానికి నేనే అన్నీ తప్పులు చేస్తుంటానని అర్ధమైంది" అంది.


రాము : "ఇవ్వాళ్ల మా టీచర్ "నిన్ను నువ్వు తెలుసుకో ఇంట్రస్టింగ్ ఉంటుంది" అంది" అన్నాడు.
శ్యామ్ "నా కైతే ముందు సీట్లో కూర్చునే రాణి గురించి తెలుసుకుంటే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది" అన్నాడు.


రాధిక ఫోటో చూపిస్తూ "నాకు పెళ్ళి సెటిల్ అయింది. అబ్బాయి ఫోటో చూసి నా టేస్ట్ ఎలా ఉందో చెప్పు" అంది.
చంద్రిక “నీ టేస్ట్ బావుంది. అబ్బాయి టేస్టే బాగాలేదు” అంది.


బస్సులో ముందున్న అమ్మాయి నడుం పైన చేయివేసాడు గోపి. అమ్మాయి: “ఏయ్ మిస్టర్ చెయ్యి ఎక్కడ వేశావ్" అంది కోపంగా... గోపి: "రాంగ్ ప్లేసా.. సారి" అన్నాడు చెయ్యి తీసేస్తూ..


సురేష్ : "ప్రతి మనిషికి ఓ లోపం ఉంటుందని అంటే ఇదివరకు నమ్మకపోయే వాణ్ని" అన్నాడు.
భార్య సుందరి : " ఇప్పుడు?" అని అడిగింది.
సురేష్: “నమ్ముతాను. ఎందుకంటే అందరికి ఒక భార్య ఉంటుందికదా" అన్నాడు.


ఆనంద్ " సారీ సుప్రియా, నేను నీ ప్రేమను కొనలేను. మనం విడిపోదాం" అన్నాడు.
సుప్రియ : "ఎందుకు?" అంది.
ఆనంద్: "మన ప్రేమ మొదలయ్యాక నా జీతం సరిపోవడంలేదు."


కమల : ' ఆ విమలది పెద్ద బడాయి, ప్రతి విషయంలో తనే ఫస్ట్ ఉండాలని ఆరాటం" అంది.
అనిత : "ఏమిటి సంగతి?" అని అడిగింది.
కమల : "మొన్న నాగుల చవితినాడు పుట్టలో పాలలో బూస్ట్ కలిపిపోసింది" అంది.


పేషంట్: "నాకు తెగ బద్దకం.. ఏ పనీ చేయబుద్దికాదు" అన్నాడు ఆవులిస్తూ..
డాక్టర్: సరే.. ముందు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇసిజి, సిటీ స్కాన్ చేయించండి.. నెక్స్ట్" అన్నాడు.


పెళ్లికొడుకు సెల్ లక్ష “అరేయ్.. ఫోన్ కట్ చెయ్యి నా పెళ్లి జరుగుతుంది" అన్నాడు.
సెల్లో "సరే అక్షింతలప్పుడు మళ్ళీ కాల్ చేస్తాలే" అని ఫ్రెండ్ చెప్పాడు.


షాపు యజమాని: "మా షాపులో ఏది కొన్నారెండు రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం" అన్నాడు.
పింకీ “అయితే రెండు రూపాయి షాంపు ప్యాకెట్ ఇవ్వండి" అంది.


మెడికల్ షాపులో నుంచి అనిత ఫోన్ చేసింది.. 'సార్, మీకేమైనా మెడిసిన్స్ కావాలా, డోర్ డెలివరీ చేస్తాం” అని..
ఇకముందు ఆ అవసరంలేదు" అని వినిపించింది. అనిత "ఎందుకు మా సర్వీస్ బాగాలేదా?" అంది. "సర్వీస్ బావుంది. పేషంట్ పోయాడు" అని వినిపించింది.


కొత్త సంగీత దర్శకుడు సార్, నాకు సంగీతంపైన మంచి పట్టుఉంది. నన్ను
మీ సినిమాలో సంగీత దర్శకుడుగా నన్ను పెట్టుకోండి" అన్నాడు. నిర్మాత : "ఇప్పటి సినిమా సంగీతంలో ఎక్కడైనా పట్టు ఉందా.. ట్రెండ్ ఫాలో కాకుండా సంగీతం నేర్చుకొని వస్తే ఎట్లా" అన్నాడు విసుగ్గా..


సునీత “నువ్వు మన తల్లిదండ్రులను ఒప్పించి మాత్రమే పెళ్ళి చేసుకోవాలని ఎందుకు అంటున్నావ్?" అంది.
అనిత : “అలా అయితేనే కట్నం వస్తుంది" అని చెప్పాడు.


విలేఖరి "మీరు మహాకవి కదా. యువతకి ఏం చెబుతారు?" అని అడిగాడు. మహాకవి : యువ కవులుతెలివైన వాళ్ళు. వాళ్ళు సినిమా పాటలు మాత్రమే రాస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వాళ్ళకు నేను చెప్పేదే ఏముంది ఇక” అన్నాడు.


అనీల్: "నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను" అన్నాడు. హారిక: డబ్బుతో చెప్పుచాలు" అంది.


తెలుగు సినిమాలో..
హీరో " నిన్ను కూని చేస్తాను, నాకు తిక్కరేగితే అన్నాడు'.
గూండా : "కూని కాదురా ఖూనీ" అన్నాడు.
హీరో : "నేను తెలుగు హీరోనీ" అన్నాడు.
గూండా : "సారీ అన్నా తప్పయిపోయింది" అని నమస్కారం పెట్టాడు.


టీచర్ "నువ్వు ఏం జాబ్ చేయాలనుకుంటున్నావ్? అని అడిగాడు.
రాము "నాకు ఇంజనీరింగ్ లంటివి కాకుండా, ఏదైనా ఛాలెంజింగ్ జాబ్ చెయ్యాలని ఉంది" అన్నాడు.
టీచర్: గుడ్ ఏo జాబ్?" అని అడిగాడు. రాము "హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్" అన్నాడు.


ఒక రాజకీయ నాయకుడు "మా నాయకుడు అవినీతి పరుడని మీ నాయకుడు తెగ విమర్శిస్తున్నాడు. మీ నాయకుడు అవినీతి పరుడుకాడా? అన్నాడు.
వ నాయకుడు : “కాడు” అన్నాడు.
వ నాయకుడు : "ఎందుకు?" అన్నాడు.
వ నాయకుడు: "ఆయన అవినీతిని ఎవరూ నిరూపించలేరు. ఆయన పద్దతి అది" అన్నాడు.
నిర్మాత గుండె ఆగినంత పనయ్యేదెప్పుడు?
జ: తన కొత్త సినిమా రిలీజ్కాకముందే, పైరసీ సిడీలు మార్కెట్లో దొరుకుతున్నాయని తెలిసినప్పుడు.


నీ కోసం చూసిన అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుందిరా” అంది. కొడుకు రత్నం : అది సరే, ఆమెకు నిజం బంగారం ఎంతుందట?" అని ఆసక్తిగా అడిగాడు.


యమభటుడు : "మేం నీకు ఎన్ని శిక్షలు విధిస్తున్నా నవ్వుతున్నావేం?" అన్నాడు.
సుబ్బారావు: "భూలోకంలో నాకు ఇద్దరు భార్యలు లెండి" అన్నాడు.


రాజేష్ : "నీతో ఎదైనా చెప్పడం కంటే ఆ గొడకు చెప్పడం నయం" అన్నాడు.
భార్య : నవత "ఎందుకు?" అంది.
రాజేష్ : కనీసం అది తలతిక్క సమాధానం చెప్పదు" అన్నాడు.


చంటి : "మీ ఇంటి ముందు టైగర్ ఉన్నది జాగ్రత్త" అని ఎందుకు పెట్టారు. మీకు లేదుకదా?" అన్నాడు.
బంటి : "మా కుక్క పేరు టైగర్" అన్నాడు.


గవర్నమెంటు ఆఫీసులో...
రంజన్: “మన ఆఫీసర్ అంటే నాకు గౌరవం, ఆదర్శం" అన్నాడు.
సునీల్: "ఎందుకు?" అని అడిగాడు.
రంజన్ : " ఆయన మనలా వందలతో సరిపెట్టుకోడురా, లక్షల్లో లంచాలు పడతాడు" అన్నాడు.


పెద్ద రచయిత: "మనకు చాలా సన్మానాలు, సత్కారాలు చేయడం,
మామూలు మనుషులు ఇలా చేయించుకోకపోవడం వింతగా లేదూ" అన్నాడు. మరో రచయిత: “మనకు ఆర్ట్ ఉంది. వాళ్ళకు పెద్దహార్ట్ ఉంది?" అని అడిగాడు.


చింటూ: ఎప్పుడూ నిజం చెప్పాలని అన్నావే.. ఇవ్వాళ్ళేం జరిగిందో తెలుసా?" అన్నాడు.
బామ్మ: “ఏం జరిగింది?" అని అడిగింది.
చింటూ : “ స్కూల్లో టీచర్ హెూమ్ వర్క్ చేసిందెవరు అని అడిగితే డాడీ అని చెప్పా.. ఆమె చెంప పేల్చింది" అన్నాడు.


ప్రభుత్వ ఆసుపత్రిలో....
రోగి : " ఇలా ప్రతిదానికి డబ్బులు అడగడం ఎందుకు నాయినా.. మీకు జీతాలు సరిపోవడం లేదా" అన్నాడు.


ఉద్యోగి : "అది ఇదివరకు.. ఇప్పుడు జీతాలు బాగానే ఉన్నా అలవాటై అడుగుతున్నాం?" అన్నాడు.
ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు...
వ జర్నలిస్ట్ : " ఫలానా హరీష్ కాబోయే సూపర్ స్టార్" అన్నాడు.
వ జర్నలిస్ట్: “ఎందుకు" అని అడిగాడు.
వ జర్నలిస్ట్ : " అతని తండ్రి సూపర్ స్టార్" అన్నాడు.
వ జర్నలిస్ట్ : "మరి, మాజీ మెగా స్టార్ కొడుకు కూడా ఉన్నాడు. అతను సూపర్ స్టార్ కాడా?" అని అడిగాడు.
వ జర్నలిస్ట్ : అలా చూసుకుంటే ఇద్దరు పాత అగ్రనటుల కొడుకులు కూడా ఉన్నారు మరి" అన్నాడు ఆలోచిస్తూ...


మిత్రుడు: "ఏంటయ్యా మన సి.ఎమ్. నిన్ను చూసి ఆదోలా నవ్వుతుంటాడు?" అని అడిగాడు చిన్నగా.
ఎక్స్ సి.ఎమ్ : "నేను నా టైమ్ లో వెయ్యి కోట్లు మాత్రమే సంపాదించానని చిన్నచూపు" అన్నాడు గుసగుసగా..


రాజేష్ : "ఏంటి మీ బామ్మర్ది వస్తే తెగ ఖుషి అయ్యేవాడివి. ఈసారీ వస్తే డల్ గా ఉన్నావు?" అని అడిగాడు.
సురేష్ : " ఈ నెలలో అతను రావడం ఇది మూడోసారి" అన్నాడు" విసుగ్గా..


విలేఖరి : "మీరు పాలకపక్షం అవినీతిని గురించి చెప్పినా, ప్రజలు మళ్లీ వాళ్ళనే గెలిపించారు. కారణమేంటి?" అని అడిగాడు.
ప్రతిపక్షం నాయకుడు: "ప్రజలు కూడా ఈ మద్యే తమకేం వస్తుందా అని ఆలోచిస్తున్నారు" అన్నాడు నిరాశగా.


ముఖ్యమంత్రి : "మన మంత్రులకూ, ఎమ్మేల్లేకు ఓ ట్రైనింగ్ ఇప్పించాలయ్యా" అన్నాడు.
సెక్రటరీ : "ఏంటది సార్?" అన్నాడు.
సి.ఎమ్. " సి.బి.ఐ. ఎంక్వైయిరీలను ఎదుర్కోవడం ఎలా? అనే విషయం గురించి" అన్నాడు.


బాస్ల కాన్ఫరెన్స్లో...
మొదటి బాస్ : "ఈ మధ్య మా ఆపీసు స్టాఫ్ సరిగ్గా మాట వినట్లేదయ్యా" నీ పరిస్థితి ఎలా ఉంది? అని అడిగాడు.
రెండవ బాస్ : "మా స్టాఫ్ మరీ అమాయకులండి. నేను పెట్టే టెన్సన్కి టెన్సన్కి మద్య గ్యాప్ కావాలంటున్నారు" అన్నాడు.


టీచర్: "చైనా సామాన్లు ప్రపంచం అంతటా దొరుకుతాయట. దీన్ని బట్టి ఏమర్దమవుతుంది?" అని అడిగింది.
రాము : "మన దేశంలోనే కాక అన్ని దేశాల కూడా బీదవాళ్ళు ఉన్నారని" అన్నాడు బాగా ఆలోచించి,


టీచర్: "చైనా బొమ్మలతో ఆడుకోకూడదని పేపర్లో వచ్చింది" ఎందుకో చెప్పు అంది.
శ్యామ్ : అవి వాళ్ళవి కాబట్టి" అన్నాడు.


ప్రతిపక్ష నాయకుడు: "ప్రభుత్వం ఇప్పుడు నడిపిస్తున్న పథకాలన్నీ మేమే మొదలు పెట్టాం" అన్నాడు.
వాటిలో అంత ప్రాపిట్ ఉంటుందా సార్" అని ఓ గొంతు వినిపించిందో ముందున్న గుంపులోనుంచి,


అనసూయ : "మీ ఆయన సెలవొస్తే చాలు, బారికెళ్ళి, మందుతాగుతుంటాడంట కదా" అంది.
విజయ : 'అవును ఆ విషయం మీకెలా తెలుసు?" అంది బాధగా...
అనసూయ : “అదే బార్లో మా ఆయన రోజూ పీకలదాకా తాగుతుంటాడ్లే" అంది.


టీచర్: ఇప్పుడు సంగీతం, సాహిత్యం గురించి చెప్పాను కదా.. ఈ రెండింటిలో నువ్వు దేన్ని ఎంచుకుంటావ్?" అని అడిగింది.
రమ : సాహిత్యాన్ని" అంది.
టీచర్: ఎందుకు?" అని అడిగింది.
రమ : దానివల్ల శబ్ద కాలుష్యం ఉండదు ఇక ఇంటి పక్కవాళ్ళు కూడా పొట్లాటకు రారు" అంది ఆలోచించి.


లెక్చరర్ : "నువ్వు ఇంజనీరింగ్నే ఎందుకు ఎంచుకున్నావ్?" అని అడిగాడు.
హరీష్ : "మా డాడీ దృష్టిలో చదువంటేనే ఇంజనీరింగ్సార్” అన్నాడు.
లెక్చరర్: మరి ఉద్యోగం అంటే? అని అడిగాడు.
హరీష్ : అమెరికాలో చేసేదే అసలైన ఉద్యోగం" అని వివరించాడు.


విలేఖరి : "అందరూ పాత హీరోల వంశాల నుండే యువ హీరోలు వస్తుంటే బయటి వాళ్ళకు అవకాశం రావడం ఎలా?" అని అడిగాడు.
హీరో : "మా పోటీ హీరో వంశంనుండే ఎక్కువమంది యువహీరోలు వస్తున్నారు మరి" అన్నాడు కసిగా..


టీచర్ : మ్యాన్ ప్రపోజెస్.. గాడ్ డిస్ పోజ్స్ అంటే అర్ధం ఏమిటి?" అని అడిగింది.
రాము : "మన పనికి దేవుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, దేవుణ్ని తిట్టుకోకూడదని" అన్నాడు ఆలోచించి.


ప్రియ: "మన పెళ్ళికాక ముందు నన్ను పెళ్ళి చేసుకోకుంటే చస్తాను అన్నారు" అంది గోముగా,
భర్త రాజేష్ : "పెళ్ళి చేసుకుంటే ఇలా రోజూ చావాల్సి వస్తుందని తెలియక అలా అన్నాను" అన్నాడు.


నళిని : 'మా ఆయన నా పెదవులపై ముద్దు పెట్టుకోవడం మానేశాడు" అంది రహస్యంగా..
సుప్రియ : "ఎందుకు?" అని అడిగింది ఆసక్తిగా..
నళిని : “ఈ మద్య ఆయనకు షుగర్ వచ్చింది. తీపి మానెయ్యాలని డాక్టర్ చెప్పాడట" అంది.


మంత్రి కొడుకు రవి: "మా డాడి ప్రపంచంలో ఒకరికి తప్ప" ఎవరికీ భయపడడు అన్నాడు.
మరో మంత్రి కొడుకు శివ సింహంఅన్నా, పార్టీ అధిష్టానం అన్నా భయంలేదా?" అని అడిగాడు.
రవి : లేదు అన్నాడు గర్వంగా.
శివ : పోనీ ఎవరు ఆ ఒకరు?
రవి : సి.బి.ఐ. వాళ్ళు అన్నాడు.


శిష్యుడు : "నాకు చనిపోవాలని ఉంది. కాని ధైర్యం లేదేమోనని అనుమానంగా ఉండి"..
గురువు : పెళ్ళి చేసుకో. అంత సవ్యంగా జరుగుతుంది అన్నాడు.
శిష్యుడు : ఎందుకు? అని అడిగాడు.
గురువు : అప్పుడు చావాలనే కోరిక బాగా బలపడుతుంది. అప్పుడు ఇలాంటి అనుమానాలన్నీ పోతాయి" అన్నాడు హుక్కా పీలుస్తూ...


రాజేష్ : నువ్వు చేసేవంట, ఎవరికైనా తినిపించి బావుంటే, నేను తింటాను" అన్నాడు విసుగ్గా...
భార్య రమ్య : “అయితే ముందు అత్తగారికి పెడితే సరిపోతుంది" అంది.


భార్య స్రవంతి: ఈ కంప్యూటర్ నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేయడం లేదు" అంది.
భర్త నరేష్ : అది నాలా ఎలా పనిచేస్తుంది" అన్నాడు పరధ్యానంగా..


మానవ సృష్టి ఆరంభంలో...
సాతాను పాములో ప్రవేశించి అడవిలో ఉన్న ఇద్దరు ఆడ మగ మనుషులను చూసి.. 'వీళ్లే ఆడమ్, ఈవ్లు' అనుకుంది.
వాళ్ళముందు బుసలు కొట్టింది. వాళ్ళిద్దరూ దాని వైపుకు పరుగెత్తారు చేతులు
చాస్తూ..
పాము వెంటనే వేగంగా పరుగుతీసింది "ఇది చైనా దేశం కాబోలు" అనుకుంటూ..


టీచర్: "లైఫ్ లో నీ గోల్ ఏంటి?" అని అడిగింది.
రాము : "ఇంజనీర్ అవ్వాలని" అన్నాడు.
టీచర్: ఎందుకు? అని అడిగింది.
రాము : అందరూ తమ పిల్లలకు ఈ గోలే పెడ్తున్నారట, మా డాడీ నాకీ గోల్ పెడుతూ” చెప్పారు అన్నారు.


లెక్చరర్: మీరంతా ఎందుకు మెకానికల్ ఇంజనీరింగ్నే ఎంచుకున్నారు? అని అడిగాడు ఆసక్తిగా...
స్టూడెంట్స్ "కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీట్లు దొరక్క" అన్నారు ముక్త కంఠంతో..


అపార్ట్ మెంట్ దగ్గర...
రామారావు : "ఇందాక ఓ అతణ్ని పైన ఎన్ని ప్లోర్లు ఉన్నాయని అడిగితే మూడు గుద్దులు గుద్దాడు ఎందుకు? అని అడిగాడు అయోమయంగా..
రాజారావు : అతను మూగావాడు. అంటే మూడుప్లోర్లు ఉన్నాయని అర్ధం" అని వివరించాడు.
రామారావు : అయితే ఇరవై ప్లోర్లు ఉంటే ఏమయి ఉండేదో అన్నాడు కంగారుగా...
రాజారావు : అప్పుడు మిమ్మల్ని ఎత్తి పడేస్తాడు అన్నాడు.
రామారావు ! ఎందుకు? అని అడిగాడు.
రాజారావు : దానికి లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది కదా అన్నాడు.


భర్త రాజారావు : నీకు మీ వాళ్ళు సంగీత లక్ష్మిల పేరు ఎందుకు పెట్టారో అర్ధమైంది" అన్నాడు.
సంగీత లక్ష్మి : "ఎందుకు?" అని అడిగింది.
రాజారావు : " నువ్వు ఏడిస్తే ఆరున్నొక్క రాగాలు గుర్తుకొచ్చాయి" అన్నాను.


కండక్టర్ "మీరు ముగ్గురు ఎక్కి రెండు టికెట్లే ఎందుకు తీసుకున్నారు" అని అడిగాడు.
రవి “వీడి దగ్గర పాస్ ఉందనుకొని" అన్నాడు. పక్కనే ఉన్న గోపి “నా దగ్గర పాస్ లేదు” అన్నాడు కంగారుగా. రవి “అయితే టికెట్ ఇవ్వండి ఇప్పుడే మా మద్య చిన్న గొడవయిందిలెండి" అన్నాడు డబ్బులు తీస్తూ...


. టీచర్: "అందరికీ మంచి మార్కులు రావాలని పై నుంచి ఆర్డర్లు చూస్తుంటే, మనం పాఠాలు చెప్పడం మానేసి, గైడ్లుచదివించడం మంచిది" అన్నాడు విసుగ్గా.. మరో టీచర్ : "దాని కన్నా స్కూల్కి సెలవులిచ్చి, ఇంటి దగ్గరే చదువుకొమ్మంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి” అన్నాడు.


టికెట్ కలెక్టర్ "రిజర్వేషన్ లేకుండా, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ఎందుకు ఎక్కావు? " అని అడిగాడు.
సుబ్బారావు "జనరల్ కంపార్ట్మెంట్ లో కాలు పెట్టడానికి స్థలంలేదు"
అన్నాడు.
టికెట్ కలెక్టర్ " మరెలా...?" అన్నాడు సాలోచనగా..
సుబ్బారావు "పోనీ ట్రైన్ పైకి ఎక్కి ప్రయాణం చేస్తాలెండి" అన్నాడు. ఓదార్పుగా...


ఆటో డ్రైవర్ “ఇప్పటికే సిటీలో ఆటోలు సరిగ్గా నిండక కష్టపడుతుంటే, మళ్ళీ రెండు వేల ఆటోలకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? అన్నాడు.
అధికారి "గ్రేటర్ సిటీ అవుతుందికదా చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఆటోలు నడుస్తాయికదా" అన్నాడు.
నాయకుడు “అంటే వాళ్ళూ మాలాగే ఆటోలు నిండక మాలాగ అలా అయితే ఓకే.. అన్నాడు.


హైదరాబాద్లో ..
ఆటో అతను "ముందు కూర్చున్నవాళ్లు కాకుండా, వెనక వాళ్ళకూడా దిగి ఆ చెట్టుదాకా నడవండి. ముందు పోలీసువాళ్ళు ఉన్నారు అన్నాడు. ప్రయాణికురాలు “వెనుక వాళ్లు ఎందుకు?" అని అడిగారు. ఆటో అతను “మొత్తం ఖాళీగా ఉంటే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు" అన్నాడు.


టికెట్ కలెక్టర్ "టికెట్ లేకుండా ట్రైన్లో ఎందుకు ఎక్కావు " అని అడిగాడు. రమణ “మన ట్రైన్లో నలభై శాతం మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారట కదా.. నేనూ వాళ్ళలో ఒకణ్ని" అన్నాడు రహస్యంగా, టికెట్ కలెక్టర్ "అలాగా నేను మామూలు వాళ్ళను వదలను" అంటూ వెళ్ళిపోయాడు.


సీనియర్ హీరో " నీ కొత్త హిట్ సినిమాలో ఒక్కపాట కూడా అర్ధం కాలేదు" అన్నాడు.
జూనియర్ హీరో : అర్థమెలా అవుతుంది. అందులో మాటలు వినిపిస్తేగా.. అదే ఇప్పటి స్టైలట" అన్నాడు.


రాజేష్ "నిన్న తెగ బోర్ కొట్టి ఓ తెలుగు సినిమాకి వెళ్ళాను. మైండ్ ఫ్రెష్ అయింది అన్నాడు.
సుమన్ "ఏముంది దాంట్లో " అని అడిగాడు.
రాజేష్ “దాంట్లో ఆడవాళ్ళు డ్రెస్లు చక్కగా వేసుకున్నారు. మరీ మన రోడ్లమీద కనిపించేవాళ్ళలాగా కాకుండా" అన్నాడు.


సునీత "మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏంచెయ్యాలి?" అని అడిగింది. సైకలజిస్ట్ "ఓ చెత్త స్కూల్లో వెయ్యాలండి.. అప్పుడు ఫస్ట్ వస్తాడు" అన్నాడు. విసుగ్గా..


హైదరాబాద్ ...
సంగీత "మీటరు వెయ్యకుండా, యాభయి రూపాయలు ఇవ్వమంటే ఎలా?"అడిగింది.
ఆటో అతను "మీటర్ ప్రకారంగా అయితే మీకు ఆటో దొరకడానికి ఎన్నిగంటలు పడుతుందో చెప్పలేదు" అని వెళ్ళిపోయాడు.


తెలివైన భక్తుడు..?
జ: దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడూ కోర్కెలను తీర్చే కామధేనువును ఇవ్వమని కోరేవాడు.


జడ్జి : "నీకు ఏకంగా ఐదేళ్ళు జైలు శిక్ష వేస్తే సంతోషంగా కనిపిస్తున్నారేం?"
అని అడిగాడు.
ముద్దాయి “బయట ధరలు బాగా పెరిగిపోతున్నాయి సార్" అన్నాడు.


జడ్జి : "నీమీద కేసు రుజువులు లేక కొట్టేస్టున్నాను. అని, ఓ క్షణం ఆగి "గుడ్ మంచి లాయర్ను పెట్టుకున్నావ్. ఆల్ ది బెస్ట్" అన్నాడు.


దేవుడు ప్రత్యక్షమై "నరుడా ఏమి నీ కోరిక? అన్నాడు.
భక్తుడు : మీ ఫోటో ఒకటి తీసుకోవాలని" అన్నాడు.
దేవుడు : అలా కుదరదు. నాకు ఇలా పర్సనల్గా కలవడమే అలవాటు"
అన్నాడు.


హైదరాబాద్లో వినాయక చవితి సందర్భంలో... రాజేష్ " చందా ఇవ్వడం కుదరదు" అన్నాడు.
గల్లీ లీడర్" ఎందుకు" అన్నాడు.
రాజేష్ : మా ఆవిడ ఇంట్లో లేదు" అన్నాడు.
లీడర్ " ఆవిడ లేకుంటే ఇవ్వరా? అని అడిగాడు గట్టిగా..
రాజేష్ : ఆమెదే ఈ ఇంట్లో పెత్తనం" అని వివరించాడు.
లీడర్: ఇలా అయితే మే ఎవరి దగ్గర చందాలు వసూలు చెయ్యలేం" అన్నాడు వెళ్ళిపోతూ..


మొదటి ధనవంతుడు "మన వాళ్ళందరం మన కోసం ఓ రోజును ఏర్పాటు చేసుకోవాలి.
రెండో ధనవంతుడు అలా కుదరదు అన్నాడు. మొదటి ధనవంతుడు ఎందుకు? అని అడిగాడు
రెండో ధనవంతుడు : ఆ మిగిలిన రోజులు కూడా మనవే కదా" అన్నాడు. నవ్వుతూ.


లత "నీ విశాల హృదయం చూసి నిన్ను ప్రేమించాను" అంది.
రవి "మరి విశాల హృదయం కదా. అందులో సుమ. నవ్య కూడా ఉన్నారు" అన్నాడు.


సుందరయ్య : "మా అల్లుఉ స్కూటర్ కొనివ్వమని అడగటం మానేశాడు" అన్నాడు.
బంగారయ్య “మా అల్లుడు కూడా మానేశాడు " అన్నాడు. సుందరయ్య “కాని ఎందుకు?" అని అడిగాడు.
బంగారయ్య “ఈమధ్య పెరిగిన పెట్రోలు ధరలు నువ్వు చూసుండవ్" అన్నాడు.


ఒకడు "పెళ్ళిలో పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు తరపువాళ్ళు గొడవ పడాలికాని పురోహితుడు, వీడియో గ్రాఫర్ గొడవ పడుతున్నారేం?" అని అడిగాడు.
ప్రక్కనతను "వాళ్ళు పెళ్ళి ఎలా చేయాలనే విషయంలో గొడవ పడుతున్నారు" అని వివరించాడు.


ప్రియాంక "మా ఆయన ఒక రూపాయికి బదులు ఐదు రూపాయలు దానం చేస్తున్నారు. కళ్ళు పరీక్షించండి" అంది.
డాక్టర్ "నిజమేనా?" అని అడిగాడు. భర్త రాజేష్ : "మీకు ఇంతంత ఫీజులిస్తున్నప్పుడు ఓ ఐదు రూపాయలు దానం చేస్తే ఏండని అలా చేస్తున్నా" అన్నాడు.


నాగుల చవితినాడు...
సౌమ్య : "నువ్వు పుట్టలో పాలు పోయంగానే పాము బయటకొచ్చిందే?" అంది ఆరాధనగా చూస్తూ..
పక్కింటి పిన్ని: "మరచిపోయి ఫ్రీజ్లో లోని పాలు పోసాను" అంది కంగారుగా…


కండక్టర్ "అందరూ టికెట్లు తీసుకున్నారా? ముందు చెకింగ్ ఉంది" అన్నాడు.
అలా అయితే నాలుగు టిక్కెట్లు ఇవ్వండి అని బస్ వెనక వైపునుంచి వినిపించింది.


నమిత "నువ్వు పెళ్ళి చేసుకోబోయే నరేష్ ఎంత పనికిమాలినవాడు తెలుసా? ఇంతకు ముందు నాతో తిరిగేవాడు?" అంది.
హరిత "కాని అతను నీతో తిరగడం పనికి మాలినపని" అని ఒప్పుకున్నాడు"


పార్క్ల
ఆనంద్ “నాకు నీ ప్రేమ చాలా విలువైనది" అన్నాడు.
రమ్య “పెళ్లయిన తర్వాత ఎంత విలువైనదో కరెక్టుగా తెలుస్తుంది" అంది.


సభలో..
రాజకీయ నాయకుడు “మా పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటలూ కరెంట్ ఇస్తాం" అన్నాడు.
ముందున్న గుంపులోనుంచి “దానికి ప్రజలమీద అప్పు ఎంత పెడతావ్" అని వినిపించింది.


రాజు "భర్త రెండో స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి చట్టం ఎందుకు ఒప్పుకోదు?" అని అడిగాడు.
రావు "ఆ మనిషి మీద జాలితో" అన్నాడు బాగా ఆలోచించి.


రాజేష్ : " నా గర్ల్ ఫ్రెండ్కి మహేశ్ బాబు అంటే ఇష్టం" నాకు అనుష్క అంటే ఇష్టం అన్నాడు.
పక్కనే ఉన్న బామ్మ "మరి మీరిద్దరూ పెళ్ళి ఎందుకు చేసుకోవాలను కుంటున్నారు?" అని అడిగింది.
రాజేష్ " మా ఇద్దరికీ "రేడియో టమాటా అంటే ఇష్టం" అన్నాడు.


సుమంత్ "ఒక గాలం ఇవ్వండి అని అడిగాడు. షాపతను ఒక గాలం ఇచ్చాడు. సుమంత్ "దీంతో అమ్మాయిలను పట్టడం ఎలా?" అని అడిగాడు. ఆశ్చర్యంగా..


చింటూ "నాకు లెక్కల్లో దాదాపుగా వందమార్కులొచ్చాయి" అన్నాడు. తల్లి సుమ "ఎన్ని వచ్చాయి నా? " అని అడిగింది. చింటూ "కాదు లో తీసేస్తే రెండు సున్నాలు మాత్రమే వేశాడు" అన్నాడు.


జైల్లో
ఒక ఖైది "నువ్వు కోటి రూపాయలు కొట్టేసి పట్టుబడ్డావా? అన్నాడు ఆరాధనగా.. రెండో ఖైది “నేను రాజకీయనాయకుడిని" అన్నాడు. ఒకటవ ఖైది "అయితే ఏం?" అడిగాడు. రెండో ఖైది "అది చిన్న ఎమౌంటే. మా వాళ్ళ దగ్గర సిగ్గుచేటుగా ఉంది"
అన్నాడు. రాజేష్ "నాకు గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది" అన్నాడు. సురేష్ "ఇంటర్వూలో ఏమి అడిగారు? అడిగాడు. రాజేష్ "నేను ఆవులిస్తుంటే "నిద్రవస్తుందా?" అని అడిగారు. నేను అవునన్నాను. సెలెక్ట్ చేసుకున్నారు అంతే" అన్నాడు.


రాజేష్ సిగరెట్లు మానెయ్యలనుకున్నాడు. “ఒక వేళ మద్యలో తాగాలనిపిస్తే ఎలా?" అని అడిగాడు.
సురేష్ "ఆ ఒక్క సారికీ తాగేయ్" అని సలహా ఇచ్చాడు.


రమేష్ "మీ ఇంట్లో ఎలుక, పిల్లిని తరుముతుందేం?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
వెంకట్ “అది మా ఆవిడను. నన్ను చూసి ఉంటుంది" అన్నాడు.


రాజేష్ "జీవితంలో నేనెప్పుడూ ఓడిపోలేదు" అన్నాడు. వివేక్ "అది ఎలా సాధ్యమయింది?” అడిగాడు ఆశ్చర్యంగా. రాజేష్ “నేను ఎప్పుడూ ఏపనీ చేయలేదు" అని వివరించాడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ: ఏంటి ఇవ్వాళ హెూంవర్క్స్ లెక్కలన్నీ తప్పుచేశావ్' అని అడిగితే విద్యార్ధి మా డాడీ క్యాంప్ కెళ్లే హెూంవర్క్ నేనే చేశాను" అని చెప్పినప్పుడు.


ప్రశ్న: భర్త అవాక్కయేది ఎప్పుడు?
జ : నాకు ఇష్టం ఉండదని తెలిసినా రోజూ కాకరకాయ కూరే చేస్త్నువేం అని అడిగితే భార్య “నాకు కొత్త చీర కొనిచ్చేంత వరకూ ఇంతే" అని చెప్పినప్పుడు.


ప్రశ్న: బాస్ చేతల్లబోయేది ఎప్పుడు?
రోజూ ఆఫీసుకు లేటుగా వస్తావేం అని అడిగితే ఉద్యోగి "ఇంట్లో రోజూ వంట చెయాల్సింది నేనే సార్" అని చెప్పినప్పుడు.


ప్రశ్న : నిజాయితీ అయిన టీవీ సీరియల్ నిర్మాత?
జ : మీ సీరియల్ ఇంత సక్కైస్ అవ్వడానికి కారణం అని విలేఖరి అడిగితే తెలుగింటి ఆడపడుచుల సహనశీలత అని చెప్పేవాడు.


ప్రశ్న: సిసలైన పేకాటరాయుడు?
జ : తన పిల్లలకు డైమండ్ రాజ్ ఆటిన్ రాణి అని ముద్దుపేర్లు పెట్టేవాడు.


ప్రశ్న : విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
జ : మీ అందం వెనుక రహస్యం ఏమిటని అడిగితే.. హీరోయిన్ నా మేకప్మాన్ అని చెప్పినప్పుడు.


ప్రశ్న: పేషెంట్ తెల్లబోయేది ఎప్పుడు ?
జ : నాకు ఓపిక అస్సలు ఉండడంలేదు అని అంటే డాక్టర్ తెలుగు టీవీ సీరియల్లు చూడండి ఓపిక బాగా పెరుగుతుంది అని చెప్పినప్పుడు.


ప్రశ్న: విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
జ : మీ రాబోయే సినిమాలో చాలా కష్టపడి నటించారా ఎందుకని అని అడిగితే.. హీరోయిన్ ఆ సినిమాలో వంటినిండా బట్టలు వేసుకొని నటించను అని చెప్పినప్పుడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ: నీ చేతిరాత చండాలంగా ఉంది, నీ హెూమ్ వర్క్ చెక్ చేయడం నావల్లకాదు అని కోపంగా అంటే విద్యార్ధి రేపటి నుంచి బాగా రాయమని మా డాడీకి చెపుతాను అని అన్నప్పుడు.


ప్రశ్న : విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
జ : మీరు నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి కారణం మీ ప్రతిభా లేక అదృష్టమా అని అడిగితే హీరోయిన్ 'అవేమీకాదు, ఎక్సపోజింగ్ అని చెప్పినపుడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేదెప్పుడు?
జ : హెూమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు అని అడిగితే విద్యార్థి హెూమ్ వర్క్ చేయడానికి మాడాడి లేరు, ఊరెళ్ళారు అని చెప్పినప్పుడు.


ప్రశ్న: బాధ్యతాయుతమైన భర్త?
జ: ఆఫీసులో ఆఫీసు పనే కాక, ఇంట్లో భార్య కోసం వంట, కొడుకు కోసం హెూమ్ వర్క్ చేసేవాడు.


ప్రశ్న: పూజారి తెల్లబోయేదెప్పుడు?
జ : పెళ్ళయ్యాక గుడికి రావడం మానేశావేం అని అడిగితే.. మా ఆయన నా కోర్కెలు బాగానే తీరుస్తున్నారు అని చెప్పినపుడు.


ప్రశ్న:తేడా?
జ : గతంలో హీరోయిన్లు నటనకు బాగా అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొనేవారు. ఇప్పుడు ఎక్స్పోజింగ్కు బాగా అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు.


ప్రశ్న : నిజాయితీఉన్న నిర్మాత?
జ : మా సినిమాలో నటించటానికి ఎక్సోపోజింగ్ పై ఆశక్తి ఉన్న కొత్త నటీమణులు సంప్రదించగలరు అని పేపర్లో ప్రకటన ఇచ్చేవాడు.


ప్రశ్న: భార్య తెల్లబోయేది ఎప్పుడు?
జ: షాజహాన్ భార్యకోసం తాజ్ మహల్ కట్టించాడు. మరి నా కోసం మీరేం కట్టిస్తారు. అని మురిపెంగా అడిగితే.. భర్త నీ షాపింగ్ బిల్లులు కడుతునే ఉన్నాగా" అని చెప్పినప్పుడు.


ప్రశ్న : తెలివి తక్కువ బార్బర్?
జ : పంజాబీ వాళ్ళుండే కాలనీలో హెయిర్ కట్టింగ్ సెలూన్ను ఓపెన్ చేసేవాడు.


ప్రశ్న : విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
జ: మీరు టాప్ హీరోయిన్ అవ్వడం వెనుక రహస్యం అని అడిగితే హీరోయిన్ బట్టలు పొదుపుగా వాడడం అని చెప్పినప్పుడు.


ప్రశ్న : డాక్టర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : రూల్స్ పాటించకుండా ఉండాలనిపిస్తుందా. ఒక ఉదాహరణ చెప్పండి.
అని అడిగితే పేషంట్ ఇప్పుడు మీ బిల్లు కట్టాలనిపించడం లేదు అని చెప్పినపుడు.


ప్రశ్న: ఇంటర్వూ అధికారి తెల్లబోయేది ఎప్పుడు?
జ : మీ మదర్ టంగ్? అని అడిగితే.. క్యాండేట్ ఇంగ్లీష్ అని చెప్పినపుడు.


ప్రశ్న: గుడ్డిలో మెల్ల అంటే?
జ : ఆ అయిన యాక్సిడెంట్ ఏదో అంబులెన్సులోనే అవ్వడం..


ప్రశ్న: గవర్నమెంట్ ఇంటర్య్వూ అధికారి ఇంప్రెస్ అయ్యేది.
జ : మీకు నచ్చిన పౌరాణిక పాత్ర? అని అడిగితే క్యాండేట్ 'కుంభకర్ణుడు'
అని ఠక్కున చెప్పినప్పుడు.


ప్రశ్న: పేషెంట్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు అని అంటే.. డాక్టర్ పగటిపూట ఆఫీసులో నిద్ర మానెయ్యండి అని చెప్పినపుడు..


ప్రశ్న: మమ్మీ అదిరిపడేది ఎప్పుడు?
జ : కోడికి వేడినీళ్ళు తాగిస్తున్నవేంరా అని అడిగితే.. కొడుకు అది డైరెక్ట్ గా బాయిల్డ్ ఎగ్ పడుతుంది అని చెప్పినప్పుడు…


ప్రశ్న : డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అధికారి తెల్లబోయేది ఎప్పుడు?
జ : కారు దేంతో స్టార్ట్ అవుతుంది అని అడిగితే క్యాండేట్ టక్కున పెట్రోల్తో అని చెప్పినపుడు.


ప్రశ్న: కస్టమర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : నా కాఫీలో ఈగ చచ్చిందేమిటాయ్ అని అడిగితే వెయిటర్ కాఫీ వేడికి చచ్చి ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు.


ప్రశ్న : కార్పోరేట్ హాస్పటల్లో లో వైద్యం చేయించుకోవాలంటే ?
జ : నైవేద్యం బాగా ఇచ్చుకోగలిగి ఉండాలి.


ప్రశ్న : అప్పు తీసుకునేవాడు ?
జ : జ్ఞాపకశక్తి లేనివాడని అర్ధం.


ప్రశ్న : డాక్టర్కి మిత్రుడు ?
జ : కులాసానే కదా అంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తావా అనేవాడు.


ఉత్తమ వాతావరణశాఖ డైరెక్టర్?
జ : మీరు ఆరాధించే దైవం అని అడిగితే.. వానదేవుడు అని చెప్పేవాడు.


ప్రశ్న : విషాద వార్త ?
జ : స్నేహితుడు సిగరెట్లు మానేశావా కంగ్రాట్స్ అంటే లంగ్ కాన్సర్ వచ్చింది. మరి అని చెప్పడం.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : మైదానం బొమ్మ వెయమంటే ఆవు బొమ్మ వేసావేం అని అడిగితే స్టూడెంట్.. గడ్డి అంతా ఈ అవే తినేసింది అని చెప్పినపుడు.


ప్రశ్న: ఎవర్నీ మాట్లాడనీయకుండా తనొక్కడే మాట్లాడే వాళ్ళను ఏమంటారు?
జ: టీచర్.


ప్రశ్న: స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?
జ : నీ భార్య మీద కోపం వస్తే ఏం చేస్తావు అని అడిగితే.. స్నేహితుడు వంట చేయడం మానేస్తాను అని చెప్పినపుడు.


ప్రశ్న : ఎవరు రోడ్డుమీద ఎంత పెద్దగా ఈల వేసినా జనం ఏమీ అనరు?
జ : ట్రాఫిక్ పోలీసు.


పేషంట్: గురక వల్ల నిద్రరావడం లేదు.
డాక్టర్: మీ ఆవిడ గురక పెడుతుందా?
పేషంట్ ఆఫీసులో మా బాస్ గురక పెడుతూ నిద్రపోతాడు.


ప్రశ్న : అందరూ ఇష్టపడే ఆర్డర్ ?
జ: మనీ ఆర్డర్.


బుద్దిమంతుడైన భక్తుడు ?
జ : తన కోరిక తీర్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి గుడికి వెళ్ళేవాడు.


ప్రశ్న: స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?
జ : చిరాయువుగా ఉండాలంటే ఏం చెయాలి అని అడిగితే స్నేహితుడు పాపాలు చేయాలి అని చెప్పినపుడు.


ప్రశ్న: టీవీ పిచ్చోడి కల ?
జ : తనకు వచ్చే కల మద్యలో అడ్వర్టైజ్మెంట్లు రావడం.


ప్రశ్న : హీరోయిన్ తెల్లబోయేది ఎపుడు?
జ : బట్టలు మరీ చిన్నవిగా ఉన్నాయేం అని అడిగితే నిర్మాత మనది లో బడ్జెట్ సినిమా కదయ్యా అని చెప్పినప్పుడు.


ప్రశ్న: డాక్టర్ అవాక్కయేది ఎప్పుడు?
జ : కడుపులో మంటగా ఉందా, ఎప్పట్నుంచి అని అడిగితే పేషెంట్ పక్కింటా వాళ్ళు కారు కొన్నప్పట్నుంచి అని చెప్పినపుడు.


ప్రశ్న: ప్రేమికుడు అవాక్కయేదెపుడు?
జ : నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ కిష్టం అయితే పెళ్ళిచేసుకుంటాను అంటే ఆ యువతి మా ఆయన ఒప్పుకోవాలిగా మరి అన్నపుడు.


ప్రశ్న: స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?
జ : మా ఆయన క్లబ్బుకెళ్తాడని నీకెలా తెలుసు అంటే స్నేహితురాలు మా ఆయనకూడ అదే క్లబ్లో మందుతాగి, పేకాట ఆడుతుంటాడులే అని చెప్పినప్పుడు.


ప్రశ్న: స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?
జ : ఇవ్వాళ మీ ఇంట్లో ఏం కూర అని అడిగితే స్నేహితురాలు ఉండు, మా ఆయన్ని అడిగి చెబుతాను అన్నపుడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : ఇవ్వాళ హెూమ్ వర్క్ చేయలేదేం అని అడిగితే స్టూడెంట్ మా డాడాకి వంట్లో బాగాలేదు మేడమ్ అని చెప్పినపుడు.


బాస్ : ఏం ఇవ్వళకూడా ఆఫీసు లేటుగా వచ్చారేం అని అడిగాడు.
సుబ్బారావు : ఏం చెప్పమంటారు. ఇంట్లో వంట చెయ్యాల్సి ఉంటుంది సార్ అన్నాడు.
బాస్ : నేను రావడం లేదా, ఇంట్లో వంట చేసి అన్నాడు కోపంగా.


ప్రశ్న : అందరూ ఇష్టపడే లెటర్ ?
జ: కాల్ లెటర్


ప్రశ్న : ఆడవాళ్ళతో మాట్లాడాలంటే ?
జ : చీరలు, నగల గురించి నాలెడ్జ్ ఉండాలి.


ప్రశ్న: హీరోయిన్ కి కోపం వచ్చేది ఎప్పుడు?
జ : తన కొత్త సినిమా అడ్వెర్టైస్మెంట్ హీరోయిన్ మేకప్ లేకుండా నటించిన గొప్ప హర్రర్ చిత్రం అని క్యాప్షన్ ఉన్నపుడు.


ప్రశ్న: హీరోయిన్ కి అభిమానులు ఎందుకుంటారు?
జ: మేకప్ వేసుకోవడం వల్ల..


ప్రశ్న: నిర్మాత తెల్లబోయేది ఎపుడు?
జ : ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాలి అంటే హీరోయిన్ కలెక్షన్లు లేకపోయిన పరవాలేదా అని అడిగినపుడు.


ప్రశ్న : ఆడవాళ్లకు పతియే ప్రత్యక్ష దైవం ఎందుకని?
జ : తాము కోరుకునే చీరలు, నగలు కొనిచ్చేవాడు భర్తయే అవడం చేత.


ప్రశ్న: మీనాక్షి చదువులేనివాడిని ఎందుకు పెళ్లిచేసుకుంది?
జ : అతనికి చీరల షాపు ఉండడం వల్ల.


ప్రశ్న: హీరోయిన్ తెల్లబోయేదెపుడు?
జ : అభిమాని ఫలానా సినిమాలో మీ ఎక్స్ పోజింగ్ చూసి మీ అభిమాని నయ్యానని చెప్పినపుడు.


ప్రశ్న: పేషెండ్ తెల్లబోయేది ఎప్పుడు?
జ : నాకు లోబీపి ఉందిసార్ అంటే డాక్టర్ ఫరవాలేదు నా బిల్లుచూస్తే అది పెరిగి హైబీపీ అయిపోతుంది అన్నపుడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎపుడు?
జ: ఇవాళ హెూమ్ వర్క్ లో లక్కలు అన్నీ తప్పులే చేశావు అని అంటే విద్యార్ధి పనిష్ మెంట్ మా డాడికే ఇవ్వండి. తనే హెూమ్వర్క్ చేసింది అని చెప్పినపుడు.


ప్రశ్న : సిసలైన ఫెమినిస్ట్?
జ : దేవుడి గుడికి కాక, దేవత గుడికి వెల్లేది.


ప్రశ్న : పూజారి తెల్లబోయేది ఎప్పుడు?
జ : ఈ మద్య గుడికి రావడంలేదే అంటే భక్తుడు కోరాల్సిన కోరికలు ఏమీ లేవు అని చెప్పినపుడు.


ప్రశ్న: టీచర్ తెల్లబోయేది ఎపుడు?
జ: హెూమ్ వర్క్స్ లెక్కలన్నీ తప్పులే చేజావే అని అడిగితే, విద్యార్థి మాడాడ్ ఊరెళ్ళారు. హెూమ్ వర్క్ మా మమ్మి చేసింది అని చెప్పినపుడు.


ప్రశ్న : యాంకర్ తెల్లబోయేది ఎపుడు?
జ : ఇపుడు మీరు అడిగిన పాట చూపించాంకదా మళ్లీ ఫోన్ ఎందుకు చేశారు అని అడిగితే వీక్షకుడు వన్స్మోర్ చేయమని అన్నపుడు.


ప్రశ్న: డాక్టర్ తెల్లబోయేది ఎపుడు?
జ : జ్వరంగా ఉందా ఎప్పట్నుంచి అని అడిగితే పేషెంట్ నా అభిమాన హీరోయిన్ని మేకప్ లేకుండా చూసినపుటినుండి అని చెప్పినపుడు.


ప్రశ్న: హీరోయిన్ తెల్లబోయేది ఎపుడు?
జ : తనను చూడాలని వచ్చిన అభిమాని మిమ్మల్ని ఇలా పూర్తిగా బట్టల్లో చూడడం అసహజంగా ఉంది అని చెప్పినపుడు.


ప్రశ్న : నిజాయితిగల హీరోయిన్?
జ : మీ విజయం వెనుక రహస్యం అడిగితే హీరోయిన్ నా బట్టల విషయంలో పొదుపుతనం అని చెప్పినపుడు.


కుక్కకి, మనిషికి ఉన్న తేడా?
జ : కుక్కకి విశ్వాసం ఉంటుంది.


ప్రశ్న: స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?
జ : ఏంటి ఈ మద్య వంట కూడా మీ ఆయనతోనే చేయిస్తున్నవా అని అడిగితే స్నేహితురాలు ఏం చేయను మా అబ్బాయికి ఆయన వంట నచ్చింది అని చెప్పినపుడు.


సురేష్ : ఈ మద్య ఎప్పుడు చూసిన వంట పుస్తకాలు మేందేసుకొని చదువుతున్నావు ఏంటి సంగతి?
జ : పెళ్ళి చేసుకోబోతున్నాను ముందుజాగ్రత్త కోసం.


ప్రశ్న: స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?
జ : వంట పుస్తకాలు చదువుతున్నపుడు ఏంటి సంగతి అని అడిగితే స్నేహితుడు పెళ్ళి చేసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పినపుడు.


ప్రశ్న: హీరోయిన్ల పెళ్ళిల్లు పెటాకులెందుకు అవుతాయి ?
జ : హీరోయిన్ల భర్తలు వాళ్ళను మేకప్ లేకుండా చూడాల్సి రావడం వలన.


వెంకట్ : మా ఆవిడ పని మనిషిని పెట్టుకోమంటే వినదు.
సురేష్: మంచిదేగా పొదుపు చేస్తుందన్న మాట.
వెంకట్ ఏం మంచిదో ఏమో ఇంట్లో పనంతా నేనే చేయాల్సి వస్తుంది.


డాక్టర్: నేను చెప్పినట్లు పని మనిషిని తీసేశారు కదా. బరువు ఎంత తగ్గారు అని అడిగింది.
రజిత : నేనేం బరువు తగ్గలేదు. కాని మా ఆయన ఏడు కేజీల తగ్గారు అని చెప్పింది.


అక్షయ్ : ఈ మద్య మీ ఆవిడ తెగనవ్విస్తున్నవట ఎలా అని అడిగాడు.
శరత్ : నువ్వు నవ్వితే కాలేజీ అమ్మాయిలా కనిపిస్తావు అన్నానంతే అని చెప్పాడు.


కవిత : ఈ మద్య నీ బట్టలు తళతళలాడుతున్నాయి ఏం వాడుతున్నావేంటి? అని అడిగింది.
అనిత : పనిమనిషిని తీసేసి మా ఆయన్ని వాడుతున్నాను అని చెప్పింది.


విమల : మీరు సిగరెట్లు, మందు మానేస్తే చాలా డబ్బు పొదుపు అవుతంది.
భర్త రాజేష్ : సరే అలా పొదుపు అయిన డబ్బునేం చేద్దాం అని అడిగాడు.
విమల : ఆ డబ్బుతో చీరలు, నగలు కొనుక్కోవచ్చు అంది.


అక్షయ్ : హాసినికి నా మీద ప్రేమలేదని అర్థమైందిరా అన్నాడు.
శరత్ : ఎలా? అని అడిగాడు.
అక్షయ్ : సినిమా హీరోలా ఇరవైమందిని కొట్టాలి. ముగ్గురు అమ్మాయిలని ఒకేసారి ప్రేమించాలి. అలా చేస్తే నా ప్రేమని నిరూపించుకోమని షరతు పెట్టింది.


ప్రశ్న: తోటి సాదువు తెల్లబోయేది ఎప్పుడు?
జ : సాదువు నేను మాత్రం రంభ ప్రత్యేక్షమయ్యే వరకే తపస్సు చేస్తాను అని చెప్పినపుడు.


ప్రశ్న: స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?
జ : ఎప్పుడు మాట్లాడమన్నా బియ్యం ఏరాలి అంటుంటావు అని అడిగితే సేనహితురాలు మా ఆయనకు వంటలో ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అన్నపుడు.


వినీత: మా కాలనీలో ఎవరికి చిల్లర కావాలన్నా నన్నే అడుగుతారు అంది విసుగ్గా.
కవిత : ఎందుకని అని అడిగింది.
వినీత: మా ఆయన బస్ కండక్టర్ కదా..


రాజేష్ : ఆ వెంకట్ కి ఆఫీసుపని బాగా చేసినందుకు అవార్డు ఇవ్వడం నచ్చలేదు సార్ అన్నాడు.
మేనేజర్: ఎందుకని? అని అడిగాడు.
రాజేష్ : నేనైతే ఆఫీసు పనితో బాటు ఇంటిపని, వంటపడి కూడా చేస్తాను. అని చెప్పాడు.


ప్రశ్న : సినిమా హీరో ?
జ : రోడ్డుపై పోట్టాటలు, ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడంలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాడు.


టైలర్ తెల్లబోయేది ఎపుడు ?
జ : ప్యాంటి కి రహస్య జేబు కుట్టమంటారా అని అడిగితే, కస్టమర్ మా ఆవిడ కూడా దాన్ని కనిపెట్టకూడదు మరి అని చెప్పినపుడు.


ప్రశ్న: అమ్మాయి ?
జ : పెళ్ళికి ముందు మల్లెతీగ, పెళ్ళి తర్వాత షాక్ కొట్టే కరెంట్ తీగ.


నన్ను ప్రేమిస్తున్న వినోద్కు మేలు చేద్దామనుకుంటున్నాను అంది నవ్య.
కావ్య : పెళ్ళి చేసుకోబోతున్నావా? అని అంది.
లేదు. పెళ్ళి చేసుకోకుండా వదిలేద్దామనుకుంటున్నాను అంది నవ్య.


అక్షయ్ : ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదేనా నీ ఉద్దేశ్యంలో అని అడిగాడు.
శరత్ : అవును.. ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం మంచిది అన్నాడు.


ప్రశ్న : టీచర్ తెల్లబోయేదెపుడు?
జ : మీరు బాగా డబ్బు సంపాదించాలంటేభవిష్యత్తులో ఏం కావాలి అని అడిగితే.. విద్యార్ధులు ఏకకంఠంతో రాజకీయనాయకుడు అని చెప్పినపుడు.


ప్రశ్న: కస్టమర్ తెల్లబోయేదెపుడు?
జ : ఏవోయ్ నిన్న టిఫిన్ బాగాఉంది. ఇవ్వాళ బాగాలేదేం అని అడిగితే వెయిటర్ టిఫిన్ ఒక రోజు తర్వాత తింటే ఏం బావుంటుంది సార్ అన్నపుడు.


ఏంటోయ్ ఎపుడు సెలవు అడగట్లేదు అని అడిగాడు ఆఫీసర్. ఆఫీసులో కాస్త రెస్ట్ దొరుకుతుంది. ఇంట్లో ఉంటే పనేపనిసార్ అని చెప్పాడు సుబ్బారావు.


కాలేజీ నుంచి లేటుగా వచ్చావేం? అని అడిగింది అన్నపూర్ణ. ఓ రోమియో నా వెనక పడ్డాడు అని చెప్పింది కూతురు నవ్య. అయితే తొందరగా రావాలి కదే అంది అన్నపూర్ణ. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు మరి అని చెప్పింది నవ్య.


హీరోయిన్: నేను అర్ధరాత్రయినా ఒంటరిగా రోడ్డుమీద నడవగలను అంది
బడాయిగా.
రెండో హీరోయిన్ నిజమే, మేకప్ తీసేస్తే ఎలా నడవ గలవు అంది.


ప్రశ్న: కష్టపడకుండా డబ్బు సంపాదించే వాళ్ళనేమంటారు? జ: రాజకీయ నాయకులు.
రాజేష్ : లైఫ్ లో ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం అన్నాడు. మన పెళ్ళయిన తర్వాత నీ అభిప్రాయం మారుతుందిలే అంది ప్రియాంక.
జీవితమంటా విరక్తిగా ఉంది డాక్టర్ అని చెప్పాడు పేషెంట్. కొత్తగా పెళ్లయిందా ఏమిటి? వేంటనే అడిగాడు డాక్టర్.


రెండు రోజులుగా భోజనం చేయాలనిపించడం లేదు చెప్పాడు పేషెంట్.
మంచి హోటల్ కి వెళ్ళండి, తినాలనిపిస్తుంది. అని ఓదార్పుగా చెప్పాడు డాక్టర్.


టీచర్: హోంవర్క్ లెక్కలన్నీ తప్పు చేశావు. ఏదీ చేయి చాపు అంది కోపంగా,
రాము ఆ లెక్కలన్నీ మా డాడియే చేశారు. రేపు ఆయన్ని తీసుకొస్తాను ఆయనకు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పాడు.


ప్రశ్న : పెళ్ళికొడుకు అయోమయంలో పడేదెప్పుడు?
జ : పెళ్లిచూపుల్లో మీకు వంట వచ్చా అని అడిగితే పెళ్ళికూతురు వచ్చు మరి మీకు వచ్చా అని అడిగినపుడు.


ఆఫీసర్ : వెరీగుడ్.. నేను ఎంత కోప్పడ్డా ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదు అన్నాడు.
రవి : ఈ మద్యే నాకు పెళ్ళయింది లెండి అన్నాడు..


రజిత : నీకు ప్రేమ అంటే ఇష్టం లేదా ఎందుకుని అని అడిగింది.
విజిత : నా అందం చూసి ఎవరైనా పైసా కట్నంలేకుండా పెళ్ళి చేసు కుంటాడు. ఇక ప్రేమెందుకు అంది.


ప్రశ్న : అత్యంత నిరాశాపరుడు?
జ : పుట్టిన రోజు నాడు ఆయుష్యు ఒక సంవత్సరం తగ్గిపోయిందని బాధ పడేవాడు.


. రంజని : ఇవ్వాళ పాలేంటి చిక్కగా ఉన్నాయి. అంది సంతోషంగా,
పాలవాడు: ఎండాకాలం వచ్చింది కదమ్మా నీళ్ళు దొరకడం కష్టమవుతుంది. అన్నాడు.


. రాము : టీచర్ ఈ మద్య శ్యాము అస్సలు చదవడం లేదు అన్నాడు.
టీచర్: ఆ విషయం నీకెందుకు?
రాము : పరీక్షలో వాడి వెనుక కూర్చునేది నేనే అని వివరించాడు.


. రాజేష్ : టికెట్ కలెక్టరు అతన్ని ట్రైన్లోంచి బయటకు తీసుకెళ్తున్నాడు. అతను టికెట్ కొనలేదా అడిగాడు.
సురేష్: లేదు ట్రైను మొత్తంలో అతనక్కడే టికెట్ కొన్నాడట. సన్మానిద్దామని తీసుకెళ్తున్నాడు. అన్నాడు.


. నిన్న పాలెందుకు తేలేదోయ్ అని అడిగింది విమల.
ఏం చెప్పమంటారమ్మ. నిన్న మాకు నీళ్ళు రాలేదు. చెప్పాడు పాలు పోసేఅతను.


. ఆ సుందరావ్వు తన సూసైడ్ నోట్లో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా శవం కూడా మీకు దొరకదు అని పెట్టి వెళ్ళాడట. అని చెప్పాడు. సురేష్, ఎందుకని అని అడిగాడు వెంకట్,
అతను మహా పిసినారి, చనిపోయాక అయ్యే ఖర్చులకు జడిసి అలా చేసి ంటాడు వివరించాడు సురేష్,


. ఆఫీసర్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెర్రినవ్వులు, పిచ్చిచూపులు చూస్తున్నావు అని కోపంగా అడిగాడు.
వెంకట్ : నాకు ఈ మద్యే పెళ్ళయిందిలెండి.. అని వివరించాడు.


. నాలో ఏం చూసి ప్రేమించావు కిరణ్ అని అడిగింది అనీల,
పెళ్ళి చేసుకుంటానో లేదో అంచనా వెయ్యలేని నీ అమయకత్వాన్నిచూస్ అని నాలుక కరుచుకున్నాడు కిరణ్.


. రాజేష్ సినిమాలు చూసి యువత చెడిపోతుంది" అన్నాడు. సందేష్ “ఆ విషయం నీకెలా తెలుసు" అడిగాడు. రాజేష్ “సినిమాలు తెగ చూస్తే కదా నాకు ఆ విషయం అర్థమైంది" అని వివరించాడు.


. అనీల్ "సిగరెట్లు మానేశావని విన్నాను. నిన్ను చూస్తే మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నావు" అని అడిగాడు.
సునీల్ “మానేశానంటే ఎవరూ నమ్మడంలేదు. అందేచేత మళ్ళీ మొదలు పెట్టాను” అన్నాడు.


. ఊటీ వెళ్తున్నావట. కంగ్రాట్స్ బాగా ఎంజాయ్ చెయ్యి అన్నాడు నాగేష్. ఏం ఎంజాయ్ మెంట్ మా ఆవిడకూడా వస్తుంది చెప్పాడు బాధగా.


. ఆ రాణితో నీ ప్రేమ వ్యవహారం సుఖాంతంమైందా? దుఃఖాంతమైందా? అని అడిగాడు నిహాల్.
దు:ఖాంతమే అయింది? చివరికి. ఇరువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు అని విచారంగా చెప్పాడు విశాల్.


. రాజు "నేను ఈత నేర్చుకుందామనుకుంటే వద్దంటావు. మరి డాడీని ఆపవేం? అని అడిగాడు.
సుందరి “డాడికి ఇన్సూరెన్స్ ఉందికదా" అని సర్దిచెప్పింది.


. చాలా రోజులనుండి చూస్తున్నాను నువ్వు మంచి వెయిటర్వి. ఇవ్వాళ నాతోబాటు సువ్వూ టీ తాగు, రెండు టీలు తే" అని అన్నాడు రమేష్.
సారీ అండి. నేను కాస్త మంచి హోటల్లో టీ తాగుతాను. అని చెప్పాడు వెయిటర్.


. నా వంట ఎలా ఉంది. అని అడిగింది శ్రావ్య. నా మొహంలా ఉంది అన్నాడు వినోద్ విసుగ్గా. మరీ అంత చండాలంగా ఏమీలేదులెండి అంది శ్రావ్య.


. నేను చనిపోయాక ఆ శంకర్ని పెళ్లాడు అన్నాడు అనంత్. ఎందుకని? అడిగింది భార్య వినీత. అతడే.. నా బద్ద శత్రువు.. అని చెప్పాడు అనంత్.


. కొత్త బట్టలను ఎందుకు దొంగిలించావు" అడిగాడు జడ్జి. సంక్రాంతి పండుగ వస్తుందికదాసార్. చెప్పాడు ముద్దాయి.


. ఇంత చిన్నపుడే ఇన్ని అబద్దాలడుతున్నావు పెద్దయ్యాక ఏమవుతావు? లాయర్ని కావాలని నా ఆశయం టీచర్" అని సమాధానం చెప్పాడు రాజు.

. మీ ఆవిడ సంగీతం ప్రాక్టీస్ చేస్తుందారాజూ అని అడిగాడు శ్రవన్. అవును ఆ విషయం నీకెలా తెలిసింది అని అడిగాడు నవీన్, మీ ఇంటికి ఇటూ అటూ నాలుగేసి ఇళ్ళ చొప్పున ఖాళీగా ఉంటేనూ అని సమాధానం చెప్పాడు శ్రావణ్,


. నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు అని అడిగింది శ్రవంతి. ఏ బాయ్ ఫ్రెండ్ అనిలా, శ్రావన్, వినీలా.. ఆరా తీసింది అనిత.


. నాకు గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది.
ఇంటర్వూలో ఏమడిగారు.
ఖాళీ సమయంలో ఏంచేస్తుంటావు అని అడిగారు.
నిద్ర' అని చెప్పానంతే? సెలెక్ట్ చేసుకున్నారు.


. డాక్టర్ కాఫీ తాగుతుంటే కంటిలో గుచ్చుకున్నట్టువుతుంది అని చెప్పాడు పేషెంట్.
కప్పులో చెంచాతీసి తాగండి. అలా అవదు చెప్పాడు డాక్టర్.


. ఏయ్ మిస్టర్ నేను రోడ్డు క్రాస్ చేస్తూ చేయి చూపించానుగా అయినా నా బండికి యాక్సిడెంట్ చేశావేం" అంది ఆధునిక యువతి. ఆ చేయి చూస్తుంటేనే యాక్సిడెంట్ అయింది మేడమ్ చెప్పాడు వంశీ.


. రాము : రైలు వెళ్ళేటప్పుడు రోడ్డుపైని రైల్వేగేట్లు ఎందుకు వేస్తారు. శ్యాము : రైలు ఊర్లోకి వచ్చేయకుండా.


. వెంకట్ : ఏవోయ్ ఇంకా దోసె తింటావ్ అని అడిగాడు. భార్య రమ్య : అదేమిటి మొదటి దోసే తినలేదు ఇంకో దోసె తింటావా అంటారేం అని అడిగింది.
వెంకట్ అలా అంటావేం మన పెళ్ళయిన కొత్తలో ఒక దోసె తినలేదూ అన్నాడు నిస్టూరంగా.


. పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రేమిస్తావా అని అడిగింది ప్రియాంక. ఇద్దర్లో ఎవరి పెళ్ళయ్యాక? అని అడిగాడు సుమన్.


. ఎవర్ని అడిగినా అడగకపోయినా మా యింటికి మాత్రం టంచన్ గా వచ్చి అన్నం అడుగుతుంటావు ఏంటి విషయం.. అడిగింది సునీత. "అయ్యగారి వంట చాలా బావుంటదమ్మా.." వివరించాడు బిక్షగాడు.


. వంకాయ రంగు మీరు ఇష్టపడరుకదా. ఆ రంగు చీర కొన్నారేం అడిగాడు సేల్స్ మెన్.
ఆ చీర మా అత్తగారికిలే అంది అనిత కసిగా,


. మేం పెళ్ళయిన వాళ్ళనే ఉద్యోగంలోకి తీసుకుంటాం అన్నాడు ఆఫీసరు. ఎందుకని అడిగాడు శరత్. “వాళ్ళయితేనే చెప్పినమాట వింటారు కనుక" వివరించాడు ఆఫీసరు.


. మీ ఇంట్లో వంటలన్నీ బావున్నాయి. ఏంటి రహస్యం అని అడిగింది సుప్రియ. మా ఆయనే వంట చేస్తారు" అని చెప్పింది కవిత.


. ఈ మద్య చనిపోవాలని ఉందని మానాన్నగారు అంటున్నారు చెప్పాడు సుబ్బారావు.
అలా అయితే నా దగ్గరికి తీసుకరాకపోయారా" అన్నాడు డాక్టర్ కైలాసం.


. "ఏంటి ఈ మధ్య కనిపించడం మానేశారు" అడిగాడు డాక్టర్. "ఈ మధ్య వంట్లో బాగుండడంలేదు" చెప్పాడు పేషంట్.


. ఈ సారి చీరల సెలెక్షన్ కోసం మీవారిని కాకుండా వేరేవారితో వచ్చారు. ఎవరితను? అడిగాడు సేల్స్ మెన్. ఇతను స్టీలు సామాన్ల అతనులే.. చెప్పింది హరిత.


. సినిమా హాల్లో పదిసార్లు సీటు మారాను అంది కవిత. ఎందుకు? వెనకాల నుండి ఎవరైనా చిలిపి చేష్టలు చేచారా? అడిగింది అనిత.
ఎవరూ చేయడంలేదు అందుకనే అంది కవిత.


. నేను రాసిన నవలమీద మీ అభిప్రాయం ఏమిటి? అడిగాడు రచయిత వెంకట్రావు. "అద్భుతం ఒరిజినల్ చదివినప్పుడు కలిగిన ఫీలింగే కలిగింది చెప్పాడు వినయ్.


. నీవు వరుస దొంగతనాలు ఎందుకు వేస్తున్నావు? అడిగాడు జడ్జి. బ్రతకడం కోసం..." నిజాయితీగా చెప్పాడు దొంగ..


. రాజకీయనాయకుడు తెల్లబోయేదెప్పుడు? విలేఖరి “ఒక్కస్కాములో కూడా మీ పేరు రావడంలేదు. రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నారా? అని అడిగినప్పుడు.


, కొత్త హీరోయిని హాల్లో సినిమా చూడాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగింది. హీరోయిన్ ఏముంది. మేకప్ లేకుండా వెళ్ళు నిన్ను ఒక్కడు చూస్తే ఒట్టు అని బరోసా ఇచ్చింది.


. నీ ప్రియుడు సంతోషిని వదులుకున్నావా ఎలా? అడిగింది నిత్య. అతన్ని పెళ్లిచేసుకుంటే మా నాన్న ఆస్తిలో చిల్లిగవ్వకూడా ఇవ్వనంటున్నాడని చెప్పాను.. చెప్పింది సత్య.


. షాపులో ఎన్నో మంచిమంచి చీరలుండగా ఈ చెత్త చీర తీసుకొంన్నాం. అడిగాడు సేల్స్ మెన్.
"ఇది మా అత్తగారికిలే అని చెప్పింది సునీత.


, మీరు నాకు నచ్చారు. మీకిష్టమైతే పెళ్ళి చేసుకుంటాను అన్నాడు అనీల్. నేను ఒప్పుకోవడంలేదు కాని మీ టేస్ట్ అద్భుతం అని చెప్పింది ప్రియ.


. అనిత అడిగింది. ఆ రాముని ఎందుకు కొట్టావ్? అని. శ్యాము నన్ను గోరంగా తిట్టాడు. అన్నాడు. ఏమని. ""రాజకీయ నాయకుడని అని చెప్పాడు"" శ్యామ్.


" , రాజకీయ నాయకుడు ఆడే ఆట? పాములు, నిచ్చెనలు..


. అనిత "పట్టుచీరల కొనడం మానేశావా.. ఎందుకని?" అడిగింది. పుజిత "పట్టుచీరల కట్టుకుంటే ఇరవైయేళ్ళు పెద్దగా కనిపిస్తున్నానని మా వారు అన్నారు" అని చెప్పింది.


. డాక్టర్ "మీకులాగనే నాకూ అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది" అన్నాడు. ఫేషంట్ అలాంటప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు? అని ఆతృతగా ఆడిగాడు.


. అనిత 'నీ మాజీ ప్రియుడు రఘువని మళ్ళీ కలుస్తున్నారు. ఎంటి విషయం" అని అడిగింది. వినీత. ఈ మధ్యే అతనికి యాబయి లక్షల లాటరీ తగిలిందటలే” అని వివరించింది.


. అందరికీ నచ్చే లెటర్? కాల్ లెటర్.


. స్నేహితురాలు ఆశ్చర్యపోయేదెప్పుడు?
ఈ మద్య ఆరోగ్యంగా, బలంగా కనిపిస్తున్నావ్ ఏంటి రహస్యం? అని అడిగితే స్నేహితురాలు మా ఆయన చేతి వంట అని చెప్పినప్పుడు.


. సురేష్ మన ఆఫీసులో కొత్తగా జాయిన అయిన ప్రియాంకకు మంచిచెడులు ఏమీ తెలియవు. మనమే నేర్పాలి.. అన్నాడు.
నరేష్.. మంచి ఏమిటో నువ్వు నేర్పు.. చెడు ఏమిటో నేను నేర్పుతాను అని చెప్పాడు.


. మీ ఆవిడ మీద కోపంవస్తే ఏం చేస్తావు? అని అడిగాడు సురేష్, ఆ పూట వంట చేయడం మానేస్తాను" చెప్పాడు వెంకట్.


. నాకు అన్యాయం చేయవుకదూ రాజేష్" అని అడిగింది అనిత. ఆ ప్రియాంక, నవ్యలతో బాటు నీకూ న్యాయం చేస్తాను" చెప్పాడు రాజేష్.


. తెలివైన టీ.వీ. సీరియల్ నిర్మాత? మీ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉన్నాయేంటి అని అడిగితే.. మహిలా ప్రేక్షకులు ఇంటిపనులు చేసుకోవడానికి" అని చెప్పేవాడు.


. క్విజ్ పోటీలకు అలవాటు పడిన విద్యార్ధి?
మాష్టారు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే "లైఫ్ లైన్" ఏమైనా ఉ న్నాయా సార్ అని అడిగేవాడు.


. విలేఖరి నివ్వెరపోయే పరిస్థితి?
మీరింత టాప్ పొజిషన్ కి రావడానికి కారణం అని అడిగితే హీరోయిన్ తడుముకోకుండా ప్రేక్షకుల రసదృష్టి అని చెప్పినప్పుడు.


. పురావస్తు శాఖ ఉద్యోగి?
ఏళ్ళు గడచి భార్య పాతదవుతున్న కొద్ది మరింతగా ప్రేమను కనబరిచేవాడు.


. హెూటల్ యజమాని "ఎంటిసార్. మీరు తిన్న ప్లేటును మీరే కడిగేశారు? అడిగాడు.
“ఓహెూ పొరపాటున మా ఇంట్లో ఉన్నాననుకున్నాను" చెప్పాడు రాఘవ పరద్యానంగా.


. సరైన అభ్యర్ధి?
గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వూలో నీ కిష్టమైన పౌరాణిక పాత్ర ఎవరు అని అడిగితే, ఊర్మిళాదేవి అని టక్కున చెప్పేవాడు.


. భార్య భర్తలకు మద్యగల సంబందం?
మంచి వక్త, మంచి శ్రోతల మధ్యగల సంబంధం,


. అతి భయంగల హీరోయిన్?
అభిమాని “మీరు ప్రతిరోజూ, నా కలల్లోకి వస్తున్నారు అని చెబితే, వెంటనే మేకప్ లోనే కదా వచ్చేది" అని ఆతృతగా అడిగేది.


. రాధిక "గవర్నమెంట్ ఉద్యోగస్తుణ్ని పెళ్లిచేసుకోవడం తప్పయిందే” అంది.
హారిక " ఏమయిందే" అని అడిగింది. రాధిక : శోభనం గదిలో ఆయనకి ఒకటే ఆవలింత" అంది చిరాగ్గా.


. ప్రేమ, దోమ కామెంట్?
రెండూ నిద్ర డిస్ట్రబెన్స్ కలిగించేవి.


. కొత్త హీరోయిన్ తెల్లబోయే పరిస్థితి?
ఈ బట్టలు వేసుకోవాలంటే సిగ్గేస్తుంది. అంటే, డైరెక్టర్ అలా నువ్వు సిగ్గు పడకూడదు. చూసే ప్రేక్షకులు సిగ్గుపడాలి అన్నప్పుడు.


. అపశకునం?
శుభమా అని జరగబోయే పెళ్ళికి లాయర్లని అతిధులుగా పిలవడం.


. 'ఆరోగ్యమే మహాభాగ్యం' సూక్తి జనానికి మరి డాక్టర్లకు? 'మీ అనారోగ్యమే మా మహాభాగ్యం'.


. సతీష్ “ కరెంట్ పోవాలని కోరుకుంటావేం?' అని అడిగాడు. నితీస్ "కరెంట్ పోతేనే మా ఆవిడ ఆ టీవీ సీరియల్స్ చూడడం ఆపి వంట మొదలెట్టేది? అని వివరించాడు.


. భర్త తెల్లబోయేదెప్పుడు?
టీవీ సీరియల్స్ బోర్ అంటూనే రోజంతా చూస్తావేం అంటే భార్య “మీరు మీరు పది సంవత్సరాలనుంచి బోర్ కొడుతున్నారు. అయినా మిమ్మల్ని వదిలేసానా మరి" అన్నప్పుడు.


. సుభాష్ "డాక్టర్ నాకు సుపిరియారిటీ కాంప్లెక్స్ ఉంది. పెళ్ళి చేసుకోవచ్చా అని అడిగాడు.
డాక్టర్ “ఫరవాలేదు పెళ్ళిచేసుకున్న తర్వాత ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది లెండి" అన సర్ది చెప్పాడు.


. చింటూ "నీకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏమీరాదు.. అయినా టీమ్ నిన్నెందుకు తీసుకుర్నారో అర్థం కావడంలేదు అన్నాడు.
కిట్టూ "క్రికెట్ కిట్ నాదే మరి అసలు సంగతి చెప్పాడు.


. ఇంగ్లీషు మాష్టారు "గదిలోనుంచి బయటకి వెళ్ళు అనడాన్ని ఇంగ్లీషులో ఏమనాలి?" అని అడిగాడు.
చింటూ 'గెట్ అవుట్' అంటానండి" అన్నాడు.. మాషాటరు గుడ్ మర్రి లోపలికి రమ్మని అనడానికి ఏమంటావ్? అని అడిగాడు.
చింటూ "నేను బయటకి వెళ్ళి మళ్ళీ గెట్ అవుట్ అంటానండి అన్నాడు ఆలోచించి.


. సుబ్బారావు "ఏం భోజనం చేసేముందు దేవుడికి ప్రార్ధన చేయవా? అని అడిగాడు.
రాము "మా అమ్మ వంట బాగానే చేస్తుంది అని జవాబిచ్చాడు.


. సతీష్ "మా ఫ్యామిలీ డాక్టర్ మందు తాగవద్దని తెగ సలహాలు ఇస్తున్నాడు ఈమధ్య. అందుకే మనేశాను అన్నాడు.
వెంకట్ "మందు మానేశావా? అని అడిగాడు. సతీష్ “ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మానేశాను. కొత్త ఫ్యామిలీ డాక్టర్ని చూసుకున్నా" అన్నాడు.


. ప్రేమ-పెళ్ళి పోలి?
స్వర్గం నరకం లాంటివి.


. జాతకాల పిచ్చివున్న తండ్రి సంతృప్తి పడేదెప్పుడు?
పరీక్ష తప్పావా అంటే కొడుకు నా గ్రహస్థితి బాగాలేదు. ఎంత బాగా చదివినా ఫెయిల్తానట. సిద్ధాంతి చెప్పాడు అని చెప్పినపుడు.


. జయ "నువ్వెంత... తిట్టిన మీ ఆయన ఒక్క ముక్కకూడా మాట్లాడడేం? అని అడిగింది.
ప్రియ : ఆయన లైబ్రేరియన్లే అంది.


. పొదుపరి గృహిణి?
స్టీలు సామాన్ల అతని అభిరుచి ప్రకారం తన కొత్తచీరలు కొనుక్కునేది.


. శక్తివంతమైన సిటీ?
ఎలక్ట్రిసిటీ.


. నాకు పునర్జన్మల మీద నమ్మకం కుదిరించినందుకు థ్యాంక్స్ వెంట్రావు అన్నాడు ఆఫీసర్.
నేను నమ్మకం కలిగించనా ఎలా? అన్నాడు ఆశ్చర్యంగా వెంకట్రావు.
నువ్వు నిన్న మీతాత అంత్యక్రియలకని లీవ్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత, నీకోసం మీతాత ఆఫీసుకు వచ్చాడు" అసలు విషయం చెప్పాడు ఆఫీసరు.


. చమత్కారి పురోహితుడు?
పెళ్ళివాళ్ళు కాస్త ఆగండి పంతులుగారు మీకు దక్షిణ ఇస్తాం అంటే అలాగా ఉత్తరం, తూర్పు, పడమర కూడా ఇవ్వండి అనేవాడు.


. నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే తెగ భయపడేవాణ్ని అన్నాడు వెంకట్.
అంటే మీ ఆవిడ నీ ఆ భయం పోగొట్టందన్నమాట ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు సురేష్.
మా ఆవిడ మాటలు ఆ బాంబులకంటే పవర్ ఫుల్ అన్నాడు వెంకట్.


. మీ ఫ్రెండ్ ఒక పెద్దపేరున్న రచయిత అన్నావు కాని అతని పేరు ఎప్పుడూ వినలేదే అన్నాడు వెంకట్.
అతని పేరు పెద్దదేనండి. పచ్చిపులుసు సూర్యప్రతాప వీర వెంకట నరసింహారావు చెప్పాడు నరేష్.


. నేను రిటైరైన తరువాత నా అనుభవం అంతా రంగరించి ఓ పుస్తకం రాద్దామనుకుంటున్నాను.. అన్నాడు సుబ్బారావు.
ఏంటా పుస్తకం? అడిగాడు వెంకట్రావు.
ఇంటికి లేటుగా వస్తే భార్యకు చెప్పదగిన ఆఫీసుకథలు అనే పుస్తకం అన్నాడు.


. మాతాత పోయారట నేను ఊరెళ్ళాలి లీవ్ ఇవ్వండి.. దీనంగా మోహం పెట్టి అన్నాడు వంశీ.
నీకు మొత్తం ఎంతమంది తాతయ్యలు ఉన్నారో చెప్పుముందు" అన్నాడు ఆఫీసరు.
వయసు పైబడిన వారంతా తాతయ్యలు అనుకోవడం మా వంశాచారం సార్ చెప్పాడు వంశీ.


, రంగారావు చీకట్లో వంటరిగా నిలబడ్డాడు. ఎవరైనా ఇంటిదాకా వస్తారేమో తోడుగా అని ఎదురు చూస్తున్నాడు.
ఇంతలో ఒక మనిషి రోడ్డుమీద వస్తూ కనిపించాడు. అతడ్ని ఆపి రంగారావు కాస్త తోడుగా వస్తారా ఊరుదాకా అని అడిగాడు.
నేను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది అన్నాడతను. రంగారావు దయచేసి తప్పకుండా మీరే తోడురావాలి. నాకు మనుషులపైన నమ్మకం పోయింది. అదీగాక నా జేబులో డబ్బుకాస్త ఎక్కువగా ఉంది అన్నాడు.


. బార్లో వెంకట్, సురేష్ మందు తాగుతున్నారు.

ఇంతలో బార్ ఓనర్ కోపంగా ఈ బార్ నిదా అన్నాడు.
డిస్టర్బ్ చేయకుండా కాసేపు ఆగు. మా బిజినెస్ డీల్ సెటిల్ కాకుంటే నీకే అమ్ముతాను అన్నాడు.


. భార్యాభర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు.
మీరు పనిమనిషిని తీసేస్తే వళ్ళు తగ్గుతుందన్నారు. కాని అస్సలు తగ్గలేదు. అంది భార్య.
డాక్టర్ సాలోచనగా కాని తగ్గాలే అన్నాడు.
పక్కనే ఉన్న భర్త విసుగ్గా? నా వళ్ళుమాత్రం తగ్గింది. పనంతా చేసేది నేనేగా అన్నాడు.


, సురేష్, వెంకట్ బార్లో మాట్లడుకుంటున్నారు. స్థిత ప్రజ్ఞత అనే పదం ఈ రోజు విన్నాను. విని అర్ధం ఏమిటో తెలుసా నీకు అడిగాడు సురేష్.
మనం మూడో పెగ్ ఆగినతర్వాత ప్రశాంతంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడతామే. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు" వివరించాడు వెంకట్.


. ఇంటికి దీపం ఇల్లాలు అనే మాటను నమ్మను అన్నాడు వెంకట్. మరిదేన్ని నమ్ముతావురా? అడిగాడు రాజు.
ఇల్లాలు అంటే సర్చిలైట్. నా భార్య నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో ఇట్టే కనిపెట్టేస్తుంది.


. ఈ మధ్య ఇంటికి వచ్చిన బంధువులు ఎంతకీ వెళ్ళకుంటే ఓ ఉపాయం కనిపెట్టా అన్నాడు సురేష్.
ఏమిటది? అడిగాడు రాజు ఆతృతగా.
మా ఆవిడతో మైసూర్పాక్ చేయించి వాళ్ళను తినమని బలవంతం పెట్టాను, అప్పటికప్పుడే వాళ్ళంతా బయలుదేరారు.


. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు కరెక్టేనా? అడిగాడు వెంకట్రావు.
అవును తప్పకుండా నిజమవుతాయి. ఏంటి సంగతి? అడిగాడు రంగారావు. ఇవ్వాల తెల్లవారు జామున మా ఆవిడ ఇంటిపనంతా చేస్తునట్టు నేను ఆమెను కేకలు వేస్తున్నట్టు కల వచ్చింది.. అని ఆనందంగా చెప్పాడు.


. ఏవండీ.. ఇవ్వాళ మీకో మంచివార్త, ఓ చెడ్డవార్త చెబుతాను అంది కాంతం. సరే చెప్పుఅన్నాడు. భర్త ఆనందరావు. నేనొక కధరాశాను. అంది కాంతం. ఆనందరావు ఆతృతగా సరే ఇక మంచి వార్త చెప్పు అన్నాడు.


. ఓ భార్య భర్తలు ఫోటో దిగడానికి స్టూడియోకి వెళ్ళారు. ఫోటోగ్రాఫర్ “అమ్మామీరు సార్ భుజం పైన చేయ్యివేసి నిలబడండి. అన్నాడు. భర్త వెంటనే నా జేబుమీద చెయ్యివేసి నిలబడితే మరింత సహజంగా ఉ ంటుంది అన్నాడు.


. బస్ కండక్టర్ రెండు టికెట్లు తీసుకున్నారేం అని అడిగాడు.
ఒకటి పోతే రెండవది ఉంటుంది కదా అన్నాడు వెంకట్రావు.
కండక్టర్ ఆశ్చర్యంగా రెండవది కూడా పోతే అని అడిగాడు.
నేను అంత వెర్రివెధవలా కనిపిస్తున్నానా నా ద్గర బస్ పాస్ ఉంది. చెప్పాడు వంకట్రావు.


. స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?
మీ ఆయన పుస్తకాల పిచ్చోడా అని అడిగితే స్నేహితురాలు లేదు.. మామూలు పిచ్చిమేళమే అని చెప్పినపుడు.


. చమత్కారి పెళ్ళికొడుకు?
పెళ్ళికూతురి మెడలో మూడుముళ్లువేసి యువరైం స్టార్స్ నౌ అని చెప్పేవాడు.


. శాసన సభ్యుల అవాక్కాయేదెప్పుడు?
మీరు విసిరేసిన మైకులు, కుర్చీలు, రిపేర్ అయ్యేంత వరకు సభను వాయిదా వేస్తున్నాను అని స్పీకర్ ప్రకటించినపుడు.


. డాక్టర్ దగ్గరికి దంపతులు తమ బాబుని తీసుకువెళ్ళారు.
మీ బాబు నోట్లో వేలు పెట్టే అలవాటు తగ్గిపోయిందా? అడిగాడు డాక్టర్. తనవేలు పట్టుకోవడంలేదు.. కానీ,. అని చెప్పబోయంతలో బాబు అంకుల్ మీ బొటనవేలు ఒకసారి ఇస్తారా" అని అడిగాడు.


. విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
ఈ మధ్య మీ పారితోషకం పెంచారటగదా అని అడిగితే హీరోయిన్ "దానికి తగ్గ ఎక్స్ పోజింగ్ కూడా చేస్తునే ఉన్నానుకదా" అన్నప్పుడు.


. బామ్మ “నాకు వళ్ళునొప్పులు, వంట్లో బలహీనంగా ఉందిరా" అంది. చింటూ "నువ్వు నాలాగే బూస్ట్ తాగు శక్తివస్తుంది" అని చెప్పాడు ఓదార్పుగా,


. మొదటి హీరోయిన్ "నేనిక సినిమాలనుండి విరమించుకోవాలి" అంది. రెండో హీరోయిన్ " ఎందుకని? అని అడిగింది.
మొదటి హీరోయిన్ "నా ఎక్స్పజింగ్ ప్రేక్షకులకు బోర్ అయిపోయిందనిపిస్తుంది" అంది.


. విలేఖరి విస్తుబోయేదెప్పుడు?
సినిమాలో నటించడం మానేస్తారా ఎందుకని అని అడిగితే హీరోయిన్ "ప్రేక్షకులకు నా ఎక్సపోజింగ్ బోర్ అవుతున్నట్టు గమనించా" అని చెప్పినప్పుడు.


. రాము "రోజూ బస్సు వెనకాల పరుగెత్కు ఉంటూ వచ్చి ఐదు రూపాయలు సేవ్ చేసే వాడివిగా" ఇవ్వాళ్ళ ఏం చేసావు అని అడిగాడు.
శ్యాము "మామూలుగా నడుచుకుంటూ వచ్చా డబ్బులేం సేవ్ చేయలేదు" అని చెప్పాడు.


. భార్యాభర్తలు గుడిగి వెళ్ళారు.
భార్య 'దేవుడా నీ దయవల్ల చాలాకాలానికి నాకు అబ్బాయి పుట్టాడు. కృతజ్ఞతలు" అని మొక్కింది.
ప్రక్కనే ఉన్న భర్త "అంటే నా కృషి ఏమీ లేదంటావా దాంట్లో" అన్నాడు. విసుగ్గా.


. జ్యోతిష్యుడు "మీ భవిష్యత్తు అందకారంగా మారబోతుంది అన్నాడు చేయిచూసి.
సునీల్ "అంటే త్వరలో నాకు పెళ్ళి జరగబోతుందన్నమాట" అని గొణుకున్నాడు.


, బార్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ "నేను ఆ రాధికతో నా పెళ్ళి కాకపోవడంతో తాగుడు మొదలు పెట్టాను. మరి మీరు?" అని అడిగాడు. వినోద్ "రాణితో నా పెళ్ళయినప్పుటి నుంచి తాగుతున్నాను.


. వెంకట్రావు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అనే కవిత రాసి పత్రికకు పంపాడు. ఆ కవితను తిప్పిపంపుతూ ఎడిటర్ ఇలా రాశాడు " స్వయంగా తేకుండా పోస్టులో పంపారు కాబట్టి" అని.


, నేను రాసిన కధలు పడ్డాయి. అన్నాడు సురేష్. ఎక్కడ అని అడిగాడు వెంకట్. ఎడిటర్ గారి చెత్తబుట్టలో అని చెప్పాడు సురేష్.


. ఆనంద్ "నీ గర్ల్ ప్రెండ్ నువ్వు తెచ్చిన చీర నచ్చలేదందా మరి చీర మార్చేశావా? అని అడిగాడు.
నరేష్ లేదు గర్ల్ ఫ్రెండ్నే మార్చేశాను అని చెప్పాడు.


. వెంకటరావు షాపులో గొడవ పడుతున్నాడు. ఫిలిప్స్ రేడియో ఇవ్వమంటే వేరేవి ఎందుకు ఇచ్చావు అన్నాడు కోపంగా, అది ఫిలిప్స్ రేడియోనే సార్. అన్నాడు షాపతను, రేడియో ఆన్చేస్తే దిస్ ఈజ్ ఆలిండియో రేడియో అని చెప్తుందే అడిగాడు వెంగర్రావు.


. సినిమా నటుడు అతని స్నేహితుడు మాట్లాడుకుంటున్నారు. సినిమా నటుడు "నా నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. నేను సినిమాలు మానేసిన తర్వాత కూడా మెచ్చుకుంటారా? అని అడిగాడు. స్నేహితుడు 'నువ్వు మానేస్తే ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారు" అన్నాడు వెంటనే.


. రీటా ఉద్యోగం ఇంటర్వూలో సెలక్టయింది. నాకు పదివేలు జీతం ఇస్తారా అని అడిగింది. ఆనందంతో ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆఫీసర్. ఆనందానికి మరో పదివేలు ఇవ్వాలి అంది రీటా,


. ఓ అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్తో ఒక మహిళ చెప్పింది “పదిహేనేళ్ళ క్రితం మీరు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నారు".
ప్రొఫెసర్ “ఇంతకీ మన పెళ్ళయిందా? లేదా?" అని అడిగాడు బుర్ర గోక్కుంటూ,


. ఓ జంట లేడీడాక్టర్ దగ్గరకి వెళ్ళారు. డాక్టర్ స్త్రీని పరీక్షచేసి మీకో శుభవార్త మీరు తల్లితండ్రులు కాబోతున్నారు" అంది. అయ్యో ఇది శుభవార్తఎలా అవుతుంది. మాకింకా పెళ్ళికాలేదు అందా జంట.


. పార్కులో ప్రేమ జంట మాట్లాడుకుంటున్నారు.
వినీత “మీ ఇంట్లో వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువా? " అని అడిగింది. అనీల్ " మా వాళ్ళకు అలాంటి పాతకాలం ఫీలింగ్స్ ఏమీలేవు. డబ్బుంటేచాలు " అని సర్ది చెప్పాడు.


. ఈమద్య మా ఇంటికి వచ్చి బంధువులు ఎంతకీ వెళ్ళకుంటే, ఏం చెయ్యాలన్న దానికి ఉపాయం తట్టింది. అన్నాడు. వెంకట్, "ఏమిటది" అని అడిగాడు చందు. "మా ఆవిడతో సంగీతం ప్రాక్టీస్ మొదలు పెట్టించా. అప్పటికప్పుడే వాళ్ళంతా బయలుదేరారు" అని చెప్పాడు వెంకట్.


. విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?
మీరు తరచూ పార్టీలు మారుస్తారేం. అని అడిగితే రాజకీయనాయకుడు ప్రజాభీష్టం మేరకే అలా మారుస్తున్నాను అని చెప్పినప్పుడు.


. సుందరి "బామ్మగారు మా ఆయన ఇవ్వాళ కోప్పడ్డాడు అంది బాధపడుతూ, బామ్మ “పెళ్ళయిన కొత్తలోనే ఇలా జరుగుతుంది. భవిష్యత్తుంతా నీదే" అని సర్దిచెప్పింది.


. వందయేళ్ళు నిండిన వృద్ధుడు చెప్పాడు.
మందు, సిగరెట్, అమ్మాయిలు, పాన్, గుట్కా లాంటి ఏ చెడు అలవాట్లు
లేవు. వందయేళ్ళు ఆరోగ్యంగా బ్రతికాను అని. వింటున్న ఓ యువకుడు "మరలా ఏ ఎంజాయిమెంటూలేకుండా బ్రతకేం
లాభం" అని పెదవి విరిచాడు.


వెంకట్ ఆశ్చర్యపోయాడు. కాసేపయిన తర్వాత ఒకతను కనిపిస్తే ఈ విషయం చెప్పాడు.
అతను ఆ గుర్రం వంటి పైన మచ్చలు ఉన్నాయా' అని అడిగాడు. అతను అవునన్నాడు. దాని మాటలు పట్టించుకోకండి దానికి బైక్ ల గురించి పెద్దగా ఏమీ తెలియదు.


. మా కుక్కకు చెస్ ఆడటం వచ్చు అన్నాడు నరేష్.
అంటే మీ కుక్క మంచి తెలివైనదన్నమాట" అన్నాడు రాజేష్.. నరేష్ "ఏం తెలివో, పొద్దున మూడు ఆటలు ఆడితే రెండుసార్లు నేనే గెలిచాను అన్నాడు విసుగ్గా.


. అడవిలో సింహం, ఏనుగు ఎదురు పడ్డాయి.
సింహం నేనెవరో తెలుసా అంది.
ఏనుగు దాన్ని తొండంతో పట్టుకొని మూడుసార్లు తిప్పి విసిరేసింది.
సింహం తెలియకపోతే తెలియదని చెప్పొచ్చుకదా, బడాయి కాకపోతే అని దులుపుకొని వెళ్ళిపోయింది.


. వెంగర్రావు మొదటిసారి ఎరోప్లేన్ ఎక్కాడు.
పైలట్ క్యాబిన్కెళ్ళి అంతా సవ్యంగా ఉందికదాసార్ అని అడిగాడు.
పైలట్ అంతా బాగానే మీరేం కంగారుపడకండి అనిచెప్పాడు.
వెంగళావు అలా మూడుసార్లు వెళ్ళి అడిగాడు.
పైలటికి కోపం వచ్చి మీరు మరోసారి నా దగ్గరికి రావడానికి వీలులేదు అన్నాడు.
వెంగళావు ప్రయాణం మద్యలో ప్లేన్ ఆగిపోయింది. దిగి నెట్టండి అంటే నేను ఊరుకోను అన్నాడు గట్టిగా.


. మోహన్ నాకు పెళ్ళయిన మూడు నెలలకే మా ఆవిడకు బాబు పుట్టాడు ఇదెలా సాధ్యం డాక్టర్ అని అడిగాడు.
డాక్టర్ సాధారణంగా మొదటిసారే ఇలా అవుతుంది. తర్వాత తొమ్మిదినెలలే పడుతుంది అని సర్దిచెప్పాడు.


. సురేష్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ మరీ స్లోగా వెళ్తుంది. స్టేషన్ ఆగగనే సురేష్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. డ్రైవర్గారు ఇంతకంటే స్పీడ్గా వెళ్ళరేరా అని డ్రైవర్ "వెళ్ళగలను కాని ట్రైన్ వదిలివెళ్ళడం కుదరదుకదా" అన్నాడు.


. నినీత్ నేను ఆ హారికు నా ప్రేమ విషయం చెప్పుదామనుకుంటున్నాను అన్నాడు. అక్షయ్ మరి కత్తి, యాసిడ్ కొన్నావా.. అని ఆరా తీశాడు.


. సురేష్ “సినిమాల్లో హీరోయిన్లు చిన్నబట్టలు వేసుకోవడానికి సిగ్గుపడరా? అని అడిగాడు. వెంకట్ "వాళ్ళు సిగ్గుపడరు, చూసే ప్రేక్షకులు సిగ్గుపడతారు” అని సమాధానం ఇచ్చాడు.


, సినిమాలో పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు బయటికిందుకెళ్తారు? హీరోయిన్ ఎక్స్పోజింగ్ కు సిగ్గుపడి.


. మీ ఆయన అస్సలు బాగాలేరు. ఎలా ప్రేమించి పెళ్ళిచేసుకున్నావే అని అడిగింది.. సుమ.
ఆయనైతేనే పెళ్ళియిన తర్వాత, వేరేవాళ్ళు వలలో పడేయకుండా ఉంటారని చెప్పింది.. హేమ.


. ఐ లవ్ యూ చెప్పాలంటే? కనీసం ఓ బైక్, క్రెడిట్కార్డ్, సెల్ఫోన్ ఉండాలి.


. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిరా నా తెలివితేటలవల్ల చెప్పాడు నరేష్. ఏం చేశావేమిటి? అని అడిగాడు రాజేష్. ఇంటర్వూలో గంటలేటుగా వెళ్ళి సారీ చెప్పాను. వాళ్ళు ఇంప్రెస్ అయ్యాడు చెప్పాడు నరేష్.


. చివరికి లైబ్రేరియన్ ఉద్యోగం వచ్చిందిరా.. అన్నాడు సురేష్. ఎలా? అని అడిగాడు వెంకట్. ఇంటర్వూలో వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నా. అంతే ఉద్యోగం ఇచ్చారు” అన్నాడు.


. డాక్టర్ కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు పేషంటు. ఎప్పట్నుంచి? అని అడిగాడు. మీ బిల్లు చూసినప్పటినుంచి చెప్పాడు పేషంట్.


. ఇద్దరు ఆధునిక యువతులు మాట్లాడుకుంటున్నారు. "నేను గర్భవతిని కాకుండా ఉండేందుకు చాలా జాగ్రర్తగా ఉంటాను" అంది. "కాని మీ ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు కదా" అంది స్నేహితురాలు. "అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను".


. లేడీ డాక్టర్ ప్రసూతి వార్డులో రౌండ్కి వెళ్ళింది. మొదటిబెడ్ పేషంట్ అడిగింది. మీ డెలివరీ ఎప్పుడు? ఆమె ఎల్లుండి అని చెప్పింది. రెండో బెడ్పై ఉన్న స్త్రీ పడుకొని ఉంది. డాక్టర్ ఆమెను లేపుతుండగా మొదటి బెడ్. ఆమె చెప్పింది ఆమె డెలివరీ కూడా ఎల్లుండే అని డాక్టర్ ఆశ్చర్యపోయి మరి మూడో బెడ్ ఆవిడది? అని అడిగింది. మొదటి బెడ్ ఆవిడ ఆమె డేట్ తెలియదు. ఆమె మాతో పిక్నిక్ పార్టీకి రాలేదు అంది.


. ఫేమస్ డాక్టర్ ఆనందరావు కొడుకు చింటూ అందరికి తనను పరిచయం చేసుకున్నప్పుడు డాక్టర్ ఆనందరావు కొడుకుని అని చెప్పేవాడు. చింటు తల్లి దాన్ని సరిచేస్తూ అలా చెప్పనవసరంలేదు. నీ పేరు చెప్పుచాలు అని చెప్పింది. మరుసటి రోజు ఒక ఫ్రెండ్ వచ్చిఅడిగాడు నువ్వు డాక్టర్ ఆనందరావు కొడుకువుకదూ" అని.
చింటూ ఆలోచించి చెప్పాడు. నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి, కాని మమ్మీ అది తప్పని చెప్పింది. అన్నాడు.


. సుందరి మా ఆయన వాళ్ళ ఆఫీసులోని టైపిస్టిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. అంది బాధగా.
పనిమనిషి రంగమ్మ అలాంటిదేం ఉండదు మీరే నన్ను ఉడికించడానికి అలా అంటున్నారు అంది.


నిన్న నేను హాఫ్ స్కర్ట్ వేసుకొని బజారుకెళ్ళాను. ఇక మరోసారి అలా వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను" చెప్పింది రీటా. ఎందుకని? ఎవరైనా అల్లరి పెట్టారా? అని అడిగింది సోనీ, ఒక్కరు కూడా నా వైపు చూడలేదు. అందుకనే అని చెప్పింది బాధగా.


. పెళ్ళయిన తర్వాత కూడా ఇలాగే ప్రేమిస్తావు కదూ" అంది ప్రియాంక. "ఇంతకంటే ఎక్కువ ప్రేమిస్తాను. నాకు పెళ్ళయిన అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం" అన్నాడు.


. పిసినారి వెంకట్రావు చెప్పాడు "మా ఆవిడ రోజూ కట్టుకోవడానికి బట్టలు లేవంటుంది" అన్నాడు. సుబ్బారావు "మరి కొనిచ్చావా" అని అడిగాడు.
ఇంటికిటికీలకు పరదాలు వేయించాను అని చెప్పాడు వెంకట్రావు.


. డైరెక్టర్ హీరోయినికి సీన్ వివరిస్తున్నాడు.
మీరు నదిలో మునిగిపోతుంటే హీరో వచ్చి మిమ్మల్ని రక్షించి బయటికి తీసుకొని వస్తాడు. అని చెప్పాడు.
హీరోయిన్ “మరి అతణ్నుంచి ఎవరు రక్షిస్తారు" అడిగింది వెంటనే.


. పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.
నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దుపెట్టుకుంటాను. పది రూపాయలు బెట్ అన్నాడు ప్రియుడు.
నువ్వు ఓడిపోతావ్ అనవసరంగా అంది ప్రియురాలు. అయితే బెట్ ఓకేనా. र्ड.
ప్రియుడు ఆమెను చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకున్నాడు.
నువ్వు ఓడిపోయావు. నువ్వు నన్ను ముట్టుకోవడమే కాకుండా, గట్టిగా పట్టుకున్నావు. అంది ప్రియురాలు.
నిజమే నేను ఓడిపోయాను ఇదిగో పది రూపాయలు అని ఇచ్చాడు.


. రాజేష్ నిన్న సిటీలో అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోతున్నాను అన్నావు. అంది సిగ్గుపడుతూ స్నేహ.
అంతా అబద్ధం అతను, నన్నెపుడు చూడలేదు అంది ఊహ.


నరేష్ "మా నాన్న వ్యాపారంలో దివాలా తీశారు. అని చెప్పాడు బాధగా, హారిక.. నేను ముందే అనుకున్నాను. మన పెళ్లి చెడగొట్టడానికి మీ నాన్న ఎంతకైనా తెగిస్తాడు" అంది.


. రాజేష్ ఓ పెద్ద హెూటల్ కి వెళ్ళాడు. వెయిటర్చేతిలో యాభయి రూపాయలు పెట్టి “నేను సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్తో వస్తాను అన్నాడు.
వెయిటర్ సంతోషంగా మీ కోసం హెూటల్ ఖాళీగా ఉంచాలా అని అడిగాడు. టేబుల్ ఖాళీగా లేదని చెప్పాలి. అప్పుడు నేను నా గర్ల్ఫ్రెండ్ని వేరే ఏదైనా చిన్న హెూటల్ కి తీసుకుని వెళ్తాను. చెప్పాడు రాజేష్.


. వెంకట్రావు ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఫామ్ నింపుతున్నాడు. ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా? లేదు. కారణం? ఎప్పుడూ పట్టుబడలేదు.


. రాము నేనివాళ పరీక్షలో ఖాళీ పేపర్ ఇచ్చివచ్చా అన్నాడు. శ్యాము నేనూ అంతే, ఖాళీ పేపరే ఇచ్చా అన్నాడు. రాము కంగారుగా టీచర్ మనిద్దరినీ కాపీ కొట్టామని కోప్పడదు కదా అన్నాడు.


. నాతో గొడవ పడి మా ఆయన తన వంట తనే చేసుకుంటున్నారు చెప్పింది సుకన్య, మరి నీ వంట నువ్వే చేసుకుంటున్నావా అని అడిగింది కవిత. నా కలాంటి పట్టుదలేం లేదు. నాక్కూడా ఆయనే వంటచేస్తారు చెప్పింది. సుకన్య.


. నాకు తెగ తలనొప్పిగా ఉంది డాక్టర్ అని ఫోన్ చేశాడు సుబాష్. మరి ఫోన్ చేస్తే ఎలా? అన్నాడు డాక్టర్ మీరైతే మంచి డాక్టర్ పేరు చెప్తారని అన్నాడు సుబాష్,


. నువ్వు ఇన్ని ఏళ్ళువచ్చినా పెళ్ళి చేసుకోకుంటే ఎలా? అన్నాడు తండ్రి. లైఫ్ లో ఎంజాయ్ చెయ్యాలని నా అభిలాష అన్నాడు కొడుకు లలిత్.


వెంకట్.


. టాఫిక్ పోలీసుకు నచ్చేడ్రైవర్? రోడ్ రోలర్ డ్రైవర్.


. ఒలింపిక్ చాంపియన్ కి జ్వరం వచ్చింది. మీకు జ్వరం నూటనాలుగు ఉంది. అన్నాడు డాక్టర్ ధర్మామీటర్ చూసి. వరల్డ్ రికార్డ్ ఎన్ని డిగ్రీలు డాక్టర్ అని ఆతృతగా అడిగాడు చాంపియన్.


. రాము, శ్యాములు గొడవ పడ్డారు. కాసేపైన తర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు.
ఈడియట్స్క నేను దారి ఇవ్వను అన్నాడు రాము. కాని నేను ఇస్తాను. అని ప్రక్కకు జరిగాడు శ్యాము.


. ఫోన్ గంటల తరబడి మాట్లాడేదానివి ఇవ్వాళ అరగంటే మాట్లాడి పెట్టేశావేం. అడిగింది కవిత.
అది రాంగ్ నెంబర్ .. చెప్పింది స్రవంతి.


. మీరు అనేక సమస్యల పైన నవలలు రాశారు కదా కాని సమాజాన్ని పీడించే వరకట్న సమస్యపైన రాయలేదేం అని అడిగాడు విలేఖరి. కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాక, ఆ విషయంపై ఎలా రాయను అన్నాడు. రచయిత సుందర్రావు.


, ఈమద్య రావలిసిన పాపుల సంఖ్య తగ్గింది ఏంటి సంగతి అనడిగాడు యమ ధర్మరాజు,
డాక్టర్లు స్ట్రయిక్ చేసున్నారు ప్రభూ అన్నాడు చిత్రగుప్తుడు.


. విడ్డూరపు డాక్టర్?
ఈమద్య చీమలు కుడుతున్నాయి డాక్టర్" అని పేషంట్ అంటే, మీకు షుగర్ వచ్చిందికదా అని సర్ది చెప్పేవాడు.


. ఓ ఐదు రూపాయలుందా? అడిగాడు అప్పారావు.
ఐదు రూపాయిలేనా, ఎక్కువ వద్దా? అని అడిగాడు వెంకట్రావు. ఎదుటి మనిషి స్తోమతను బట్టి అడుగుతాను నేను అన్నాడు అప్పారావు.


ఓ ఐదు రూపాయలుందా? అడిగాడు అప్పారావు.
ఐదు రూపాయిలేనా, ఎక్కువ వద్దా? అని అడిగాడు వెంకట్రావు. ఎదుటి మనిషి స్తోమతను బట్టి అడుగుతాను నేను అన్నాడు అప్పారావు.


Responsive Footer with Logo and Social Media