పిచ్చుక సాహసం కథ



ఒక బుల్లి పిట్టా సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసి మురిసిపోయింది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది. ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను అలలేలా గుప్పొడిచాయి అని అర్థమైంది పిచ్చుకకు. వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. "ఓ సముద్రుడా, నా గుడ్లను ఒడ్డుకు చేర్చు" అని వేడుకుంది పిచ్చుక.

సముద్రుడు స్పందించకపోవడంతో, పిట్ట కోపంగా "నీ నీళ్లన్నీ తొడుస్తా!" అని శపధం చేసింది. వెంటనే పిట్టా తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది. అది చూసి సముద్రుడు మరియు ఇతర జంతువులు పకపక నవ్వారు. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు.

ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతునికి తెలిసింది. ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపోయాడు, తన వంతు సహాయం చేయాలని గరుత్మంతుడు పిట్ట వద్దకు వెళ్ళాడు. "పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను," అన్నాడు గరుత్మంతుడు. అతని మాటలకు సంతోషించింది పిచ్చుక, గరుత్మంతుడు భీకర స్వరంతో "మిత్రమా! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి," అని హెచ్చరించాడు.

ఇది విన్న సముద్రుడు భయపడి, గరుత్మంతుని తరుపున విష్ణువే యుద్ధం చేస్తే తన పని అయిపోయినట్టే అని అనుకొని, దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చాడు. పిచ్చుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పిట్ట ఆనందంగా ఎగిరింది.

కథ యొక్క నీతి: చిన్నదైనా ధైర్యంతో పని చేసినట్లయితే, ఫలితం లభిస్తుంది.

Responsive Footer with Logo and Social Media