ప్రయత్నం



ఒకరోజు వినోద్ తన చిన్ననాటి స్నేహితుడు దుబాయ్ నుంచి పంపింన రంగులు మార్చే కప్పును మురిపంగా చూసుకుంటూ చాలా ఆనందిస్తున్నాడు. ఆ కప్పు తన క్లాసులో స్నేహితులందరికీ నచ్చింది, వావ్!! నీ కప్పు ఎంత బాగుందిరా.. ఇలాంటి కప్పు మాకు కూడా ఉంటే బాగుండు అని వినోద్ ని తెగ పొగిడేసారు. ఆ కప్పు వినోద్కు కూడా చాలా నచ్చింది దాన్ని అటు ఇటు త్రిప్పి చూస్తూ ఉంటే, చేజారి క్రిందపడి రెండు ముక్కలయింది దాన్ని చూసి వినోద్కు చాలా దుఃఖం వచ్చింది రేపు మా ఫ్రెండ్స్ వచ్చి నీ మ్యాజిక్ కప్పేది అంటే నేను ఏది చూపించాలి! అయినా నేను ఎంత బ్యాడ్ ఎంత మంచి కప్పుని ఎలా పగల గొట్టుకున్నాను, అని చాలా బాధపడుతూ కూర్చున్నాడు.

వారం రోజులైనా ఆ బాధ నుండి బయటికి రాలేదు వినోద్. వాళ్ళ అమ్మ వచ్చి వినోద్.. కప్పు పాడైపోతే పోయిందిలే ఇంకొకటి కొనుక్కోవచ్చు అన్నది. అందుకు వినోద్ లేదమ్మా ఆ కప్పు చూసి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు మళ్ళీ అలాంటి కప్పు నాకు ఎక్కడ దొరుకుతుంది అని మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు అమ్మ సరే అయితే ఒక పని చేద్దాం ఈ కప్పు ఎలాగూ పగిలింది కదా.. దీనిని జాగ్రత్తగా అతికించి, నీకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా అందంగా తయారు చేసుకో అంది. కప్పు గమ్ అతికిస్తే మళ్లీ దానిలో పాలు వేసుకొని తాగలేను కదా అమ్మా.. పాడైపోతాయి అన్నాడు. అది కాదు వినోద్ ముందు నువ్వు దాన్ని తయారు చేయి, తర్వాత నేను చెప్తాను అంది.

తర్వాత వినోద్ తనకు నచ్చిన పెయింటింగ్ అంతా ఆ కప్పు మీద వేసి అందంగా తయారు చేశాడు, దాన్ని చూసి అమ్మ వావ్! చాలా బాగుంది అని మెచ్చుకొని దాంట్లో రకరకాల పువ్వులను ఉంచింది. అది ఫ్లవర్ మగ్ లాగా చూడడానికి చాలా అందంగా ఉంది.

అప్పుడే వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ఆ ఫ్లవర్ మగ్ ని చూసి అబ్బ చాలా బాగుందిరా.. అయినా నీ దగ్గర ఉండేవి అన్నీ మంచి మంచి వస్తువులు అని వినోద్నా తెగ పొగిడారు. అది విన్న వినోద్ ఆనందంతో నేనే తయారు చేశాను రా.. ఇలా అని చెప్పాడు గర్వంగా. ఫ్రెండ్స్ అందరూ నీది 'సూపర్ బ్రెయిన్ రా' అన్నారు వినోద్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ ఫ్లవర్ పాట్ని అలాగే చూస్తూ కూర్చున్నాడు.

అప్పుడు అమ్మ వచ్చి ఇప్పుడు హ్యాపీ నా.. ఏదన్నా మనకి చాలా ఇష్టమైనది. చాలా ముఖ్యమైనది మన దగ్గర నుంచి పోయిన లేదా అదేమన్నా చెడిపోయిన మనం దాని గురించే బాధపడుతూ కూర్చోకూడదు, మనకు సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు అది ఇంకొక సరి కొత్త వస్తువులా తయారవుతుంది. అదేవిధంగా నీ దగ్గర ఉన్న ఏ బొమ్మ పాడైన, ఏ వస్తువు పోయినా నువ్వు బాధపడకుండా దాన్ని ఏ విధంగా బాగు చేయాలా అని ఆలోచించాలి అప్పుడే నీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది.

కథ యొక్క నీతి : ప్రయత్నిస్తే ఏదయినా సాధ్యమే.

Responsive Footer with Logo and Social Media