రాజు మిదాస్ కథ



అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు మిడాస్, ఆయనకి ఎక్కువ సంపాదించాలని ఆశ చాలా ఉండేది. ఎప్పుడూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి దాన్ని ఎలా దాచుకోవాలని ఆలోచనలోనే ఉండేవాడు. ఒకసారి మిడాస్ చాలా రోజులు ప్రార్థించడం వల్ల ఒక దేవత ప్రత్యక్షమైంది,ఆమెను మిడాస్ ఒక కోరిక కోరాడు అదేంటంటే తను ఏది ముట్టుకున్న అది బంగారంగా మారిపోవాలని కోరుకున్నాడు. అది విన్న దేవత సరి నీవు కోరుకునే విధంగానే జరుగుతుంది అని అతనికి వరమిచ్చి మాయమైపోయింది.

మరుక్షణం నుంచి మిడాస్ ఏం పట్టుకున్న బంగారంగా మారిపోయేది అదంతా చూసి మిడాస్ కు చెప్పలేనంత ఆనందం కలిగింది. కొంత సేపటికి అతనికి దాహంగా ఉండడం నీరు తాగుదాం అనే ఉద్దేశంతో అతను గ్లాసుని పట్టుకొనేసరికి గ్లాసు దానిలో ఉన్న నీరు కూడా బంగారం గా మారిపోయింది, మిడాస్కు విషయం అర్థం కాలేదు.

ఆ రోజు నుంచి అతను తిండికి పూర్తిగా దూరమయ్యాడు అంతేకాక అతను పట్టుకున్న ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి మనిషి బంగారంగా మారిపోయేవారు ఇదంతా చూసిన మిడాస్ కి చాలా బాధగా అనిపించింది. ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే అంతలో అతని ప్రియమైన ఒక్కగానొక్క కూతురు మిడాస్ దగ్గరికి వచ్చి అతనిని హత్తుకోగానే ఆమె కూడా బంగారంగా మారిపోయింది.

తన కూతురిని ఆ విధంగా చూసిన మిడాస్ తట్టుకోలేక ఏడుస్తూ దేవతకై మళ్ళీ ప్రార్థించాడు, కొన్ని రోజులకు ఆమె ప్రత్యక్షమై ఏం కావాలని అడగగా నా వరాన్ని తీసేసుకోమని ఇంతసేపు ఇంతకాలం తనవల్ల బంగారంగా మారిన ప్రతి వస్తువుని తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేయమని ప్రార్థించాడు. అప్పుడు దేవత సరే అని అతనికి ఒక నీటిని ఇచ్చింది మిడాస్ ఆ జలాన్ని బంగారం గా మారిన ప్రతి వస్తువు మీద వ్యక్తుల మీద చల్లడంతో వాళ్లందరూ మామూలుగా మారిపోయారు. అప్పటినుంచి మిడాస్ మనుషులు ఇచ్చే ఆనందాన్ని ఏ బంగారం ఇవ్వలేదని తెలుసుకున్నాడు.

కథ యొక్క నీతి: ధనం సంపాదించాలనే ఇష్టంలో మనుషుల యొక్క నిజమైన ఆనందం, ప్రేమ మరియు కుటుంబం ఏమీ లభించవు. పరిమితమైన ఆశలు, ఉన్నతమైన విలువలు ఉన్నాయంటే జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది.

Responsive Footer with Logo and Social Media