రాజు తెలివి



అనగనగా దేవపురి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు విజయుడు, అతను చాలా మంచి వాడు తన రాజ్యం లో ఒక్క నిరుద్యోయోగి కూడా ఉండకూడదు అనే ఉదేశ్యం తో రాజ్యం లో ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వుద్యోగం కల్పించాడు ఇక తన రాజ్యం లో ఎటువంటి నిరుద్యోగి లేడని భావించాడు.

ఒక రోజు రాజుగారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వారిలో ఒకడు మహారాజా ! మీ మంచితనం వలన మనరాజ్యం లో నిరుద్యోగం అనేదే లేకుండా పోయింది కానీ మా యిద్దరి కొడుకుల వలన మీ ఆశకు భంగం కలిగే లాగా వుంది అని వాపోయారు. అందుకు విజయుడు మీ సమస్యేంటో నాకు అర్థం కాలేదు, కొంచం వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆవ్యక్తి మహారాజా అందరిలాగే మా కొడుకులు కూడా మీరు ఏర్పరిచిన పనిలో చేరారు, కానీ వారికున్న దుర్వ్యసనాల వల్ల ఏ పనికూడా రెండురోజులుకన్నా ఎక్కువ చేయలేక పోతున్నారు అన్నాడు. విషయం అర్థమైన రాజుగారు మరికొంతసేపు వారితో మాట్లాడి వారి కొడుకుల గురించి తెలుసుకొని, మీ సమస్య నేను తీరుస్తానని వారికి మాటిచ్చి అక్కడ నుండి పంపాడు.

మరుసటి రోజు రాజుగారు భటులను ఆ ఇద్దరు వ్యక్తుల కొడుకుల దగ్గరికి పంపి వారిని ఆస్థానానికి రప్పించారు. వారిలో మొదటి వానితో చూడు నీకు చిత్రలేఖనం అంటే ఇష్టమని బాగా గీస్తావు కూడా అని తెలిసింది. ఈ రోజు నుండి నిన్ను మన ఆస్థానంలో చిత్రకారునిగా నియమిస్తున్నాను. రోజూ మన రాజ్యం లో సంచరిస్తూ నీకు నచ్చిన వాటిని మరియు పిల్లలకు ఉపయోగకరమైన వాటిని గీసి నాకు చూపించి మన పాఠశాలలో చదువుతున్న పిల్లలకు వాటి గురించి వివరించాలి. ఒకసారి గీసిన చిత్రం మళ్ళీ గీయకూడదు పని మీద శ్రద్ధతగ్గితే మన వంటశాలలో పనిచేయవలసి ఉంటుంది అని చిన్న బెదిరింపు స్వరంతో చెప్పాడు.

రాజు గారు చెప్పిందంతా విన్న మొదటివాడు అబ్బా...! నా మనసుకు నచ్చిన పని, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు మనసులో. రాజుగారు రెండవవాడిని పిలిచి నీకు కుస్తీ అంటే ఇష్టం అని తెలిసింది, ఈ రోజు నుండి నిన్ను మన ఆస్థానం లో కుస్తీ అధ్యాపకునిగా నియమిస్తున్నాను. నువ్వు ఎంత మందిని కుస్తీలో నిష్ణాతుల్ని చేస్తే నీకు అంత డబ్బు వస్తుంది. పని మీద శ్రద్ధ తగ్గితే నువ్వు కూడా మన వంటశాలలో పనిచేయవలసి ఉంటుంది అన్నారు. తన మనసుకి నచ్చిన పని అవ్వడంతో రెండవవాడు కూడా రాజుగారికి కృతఙ్ఞతలు చెప్పి పనిలో చేరాడు.

నీతి : ఏదన్నా పని చేయడానికి మనకు ఆసక్తి కలగడం లేదంటే ఆ పని అంటే మనకు ఇష్టం లేదని అర్జం, అందుకే మనసుకు నచ్చిన పని చేయాలి అప్పుడు ఏ దుర్వ్యసనాలు అడ్డురావు.

కథ యొక్క నీతి: మనసుకు నచ్చిన పని చేస్తే ఆ పనిలో సఫలత సాధించడం సులభం.

Responsive Footer with Logo and Social Media