సమస్య



ఒక రైతు తన కుమార్తెకు వివాహం చేసి పంపించాడు. ఒక్కతే కుమార్తె కావడంతో చిన్నతనం నుంచి ఆమె పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. ఆమెను ఒక్కసారిగా వివాహం చేసి కొత్తవారైన అత్తవారింటికి పంపడంతో... ఆమె అత్తమామలతో వారి బంధువులతో కొత్త వారితో ఇమడలేక పోయింది. వివాహమైన నెలరోజులకు అత్తవారింటి నుంచి చెప్పకుండా పుట్టింటికి వచ్చింది, అనుకోకుండా ఇంటికి వచ్చిన కుమార్తెను చూసిన రైతు ఏమైందని ఆరాతీయగా.

ఆమె తండ్రితో నాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు పైగా నాకు అన్ని పనులు చెబుతున్నారు అని తండ్రి ముందు ఏడవడం ప్రారంభిస్తోంది. విషయం అర్థం చేసుకున్న తండ్రి, ఆమెతో ఏమీ మాట్లాడకుండా బయటకి వెళ్లి మూడు కుండలను వాటితో పాటు కొన్ని బంగాళదుంపలను, గుడ్లను, కొన్ని కాఫీ గింజలు తీసుకొని వచ్చాడు. ఆయన ఆ మూడు కుండలను పొయ్యిమీద పెట్టి ఒక్కొక్క దాంట్లో ఒక వస్తువును ఉంచాడు. ఒకదాంట్లో బంగాళదుంపలు ఇంకొక దాంట్లో గుడ్లు మరొకదాంట్లో కాఫీ గింజలు వేసి నీళ్లు పోసి పొయ్యి వెలిగించి వాటిని వేడి చేయడం మొదలు మొదలుపెట్టాడు.

కొంత సమయం అలాగే గడిచింది, తండ్రి తన మాటలకు ఎటువంటి జవాబు చెప్పక పోవడంతో కుమార్తె అలాగే తండ్రిని చూస్తూ ఉంటుంది. ఒక ఇరవై నిమిషాలు గడిచాక ఆమె తండ్రితో నాన్నా... మీరు నా మాటలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మీ పని మీరే చేసుకుంటున్నారు అని అంటుంది.

అప్పుడు రైతు మరల సమాధానం చెప్పకుండా మూడు కుండలనుంచి దానిలో వేసిన వస్తువులను ఒకొక్కటిగా బయటికి తీసి కుమార్తె ముందుంచి,ఒక సారి నువ్వు ఈ బంగాళదుంపలను పట్టుకుని చూడు అని చెపుతాడు అప్పుడు ఆమె వాటిని పట్టుకొని ఇవి చాలా మెత్తగా వున్నాయి అని చెప్తుంది, అదేవిధంగా ఈ గుడ్లను పట్టుకో అని చెప్తాడు అప్పుడు ఆమె గుడ్లను పట్టుకొని ఇవి చాలా గట్టిగా అయ్యాయి అని చెబుతోంది, తర్వాత అతను కాఫీ గింజలు వేసి మరిగించిన నీటిని ఇచ్చి ఇది ఎలా ఉంది అని అడిగితే ఆమె వాటి వాసన చూసి చాలా అద్భుతంగా ఉంది దీని వాసన అని చెబుతుంది.

అప్పుడు రైతు చూడమ్మా!! వేడిచేయక ముందు ఈ బంగాళదుంపలు చాలా గట్టిగా ఉన్నాయి, ఇంకా ఈ గుడ్లు చాలా బలహీనంగా కింద పడితే పగిలిపోయే విధంగా ఉన్నాయి అదే విధంగా ఈ కాఫీ గింజలు ఎటువంటి రుచి లేని విధంగా ఉన్నాయి,కానీ వీటిని వేడి నీటిలో ఉడికించిన తర్వాత ఇవి వాటి స్వభావాన్ని వదిలి కొత్త స్వభావాన్ని ఏర్పర్చుకున్నాయి.

అదే విధంగా మనిషి జీవితంలో కొన్ని కష్టాల్ని బాధల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్న తర్వాత వాటి వలన కొన్ని పాఠాలు నేర్చుకొని ఒక చక్కటి రూపాంతరం చెందాలి, అప్పుడే మనిషి జీవితంలో ఎదుగుతాడు అంతేకాని కష్టాలు వచ్చాయని మనం కృంగిపోయి మన బాధ్యతల నుంచి దూరంగా పారిపోతే మన జీవితంలో మనకు ఎప్పటికీ ఎదుగుదల మార్చు ఉండదు.

నువ్వు కూడా మా దగ్గర ఉన్నన్ని రోజులు సురక్షితమైన ఇటువంటి భాద్యతలు లేని జీవితాన్ని గడిపావు, కానీ మీ అత్త గారి ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త మనుషులతో కలవలేక, భాధ్యతలు తీసుకోలేక భాదపడుతున్నావు నువ్వు ఈ ఇబ్బందులును నీకు అనుకూలంగా మలుచుకుని నీవు అందరితో కలిసి పోయినట్లయితే కొన్ని రోజులకు నీలో కూడా చక్కని మార్పు వస్తుంది అని చెప్తాడు తండ్రి. కూతురు విషయం అర్థం చేసుకొని నమ్మకం తో పుట్టింటి నుండి అత్తగారింటికి బయలుదేరుతుంది.

కథ యొక్క నీతి: సమస్య మనకు జీవితం లో చాలా పాఠాలు నేర్పిస్తుంది, మనం సమస్యను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం కొత్తవిషయాలు నేర్చుకోగలం.

Responsive Footer with Logo and Social Media