సింహం మరియు ఎలుక కథ
అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది. ఒక రోజు మధ్యాహనం ఆ సింహము కునుకుతీస్తూ ఉండగా ఒక ఎలుక సింహం పైన పడింది. వెంటనే సింహానికి మేలుకో రావడంతో, కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. బాగానే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.
అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే – "ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!" అని ప్రాధేయపడింది.
అడవిలో మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ "నువ్వు నాకు ఏమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు." అని ఆ ఎలుకను వదిలేసింది.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లో సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. తన బలంతో ఎంత ప్రయత్నించినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి.
కొద్ది సేపటికి చిన్నగా, భయంతో ఉన్న ఎలుక చెట్టువెనుకనుంచి కనిపించింది. మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక, సింహం పరిస్థితే చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది.
ఎలుక చాలా సేపు కష్టపడడంతో, చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. వెంటనే సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది.
ఎలుక పారిపోవడాన్ని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది: "ఈ చిన్న ఎలుక నాకు ఏమి పనికివస్తుంది అనుకున్నాను. ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. ఏ జంతువునీ తక్కువగా అంచనా వేయకూడదు!"
కథ యొక్క నీతి: ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది.