సోమరిపోతు గాడిద



ఒక ఉప్పు వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. వ్యాపారి గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించేవాడు. ఆ గాడిద చాలా బద్దకంగా ఉండేది, వ్యాపారి చెప్పిన పని ఏదీ సరిగ్గా చేసిది కాదు. వ్యాపారి రోజూ ఉప్పు మూటను గాడిద పై పెట్టి వేరే వూరు సంతకు వెళ్లి అక్కడ ఉప్పు అమ్మేవాడు.

రోజూ లాగే వ్యాపారి ఆ రోజు కూడా ఉప్పు మూటను గాడిద పై పెట్టి సంతకు ప్రయాణమయ్యాడు, మార్గమధ్యం లో ఒక వంతెన దాటవలసి వచ్చింది. అంతసేపు ఉప్పుమూట మోస్తున్న గాడిదకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది... వెంటనే కాలుజారినట్లు నటించి వంతెన మీదనుండి కాలువలో పడిపోయింది, నీటిలో పడడం వలన మూటలో వున్న ఉప్పంతా కరిగిపోయి,సంచి తేలిక అయిపోయింది గాడిదకు సంతోషంగా అనిపించింది. వ్యాపారి మాత్రం ఉప్పు అంతా కరిగిపోయినందుకు చాలా బాధపడ్డాడు. తరువాత చాలా సార్లు గాడిద అదేవిధంగా నీటిలో తెలీక పడినట్లు పడిపోయేది, ఉప్పుకరిగి పోయేది... కొంత కాలానికి వ్యాపారికి గాడిద పై అనుమానం వచ్చింది, దీనికి ఎలాయినా బుద్ధిచెప్పాలని ఒక రోజు సంచిలో ఉప్పుకు బదులు ఇసుక వేశాడు. విషయం తెలీక గాడిద రోజులాగే ఆరోజు కూడా నీటిలో పడింది ఉప్పు ఐతే కరిగిపోయేది కానీ అది ఇసుక కదా నీరు మొత్తం పీల్చుకొని బాగా బరువెక్కింది,గాడిద వీపు మీద భారం ఎక్కువైపోయింది చేసిది లేక అలాగే భారంగా అడుగులు వేస్తూ యజమాని ఇంటికి నడిచింది.

ఇంకెప్పుడు నీటిలో పడడం అనే సాహసం చేయలేదు, బుద్దితెచ్చుకొని యజమానికి సహాయంగా ఉండేది.

కథ యొక్క నీతి: బుద్ధి వాడి చాకచక్యం శక్తివంతమైనది, అహంకారంతో పనులు చేయడం వల్ల నష్టం మాత్రమే.

Responsive Footer with Logo and Social Media