సూక్తులు



1. సమయాన్ని సరిగా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి.

2. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకొంటే అతడంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి వుంటాడు.

3. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నయినా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు.

4. జీవితం ఓ యుద్ధభూమి, పోరాడితే గెలిచేందుకూ అవకాశం ఉంటుంది. ఊరక నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు.

5. పనిలో ప్రతిసారీ సంతోషం లభించక పోవచ్చు. కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు.

6. జీవితంలో సరైనవాటిని ఎంచుకోవడం వలన అవుతాయి. సంతృప్తి, విజయం సాధ్యం

7. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు.

8. మీరు ఉన్నతంగా ఎదగటానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి.

9. హృదయం పవిత్రమైనపుడు దారి విశాలంగా కనిపిస్తుంది. గమ్యం స్పష్టమవుతుంది.

10. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్నివేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు. రెండింటి కంటే ముఖ్యమైంది ధైర్యం.

11. నిరాడంబరమైన తేనెటీగ అన్నిరకాల పువ్వులనుంచి తేనెను తీసుకున్నట్లే, తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచీ సారాన్ని గ్రహిస్తాడు.

12. మీరు ప్రతిరోజూ తృప్తిగా నిద్రించాలనుకుంటే, ప్రతి ఉదయమూ ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.

13. తన జ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యౌవనంలో వుంటాడు.

14. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత వుంటుంది.

15. అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.

16. నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు. ఎంతపని పూర్తయిందో చెప్పు

17. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకూ చేస్తూనే ఉండాలి.

18. ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిని అదుపులో ఉంచుకోవడం.

19. అందంలేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు.

20. మంచి పనికి మించిన పూజలేదు. మానవత్వానికి మించిన మతం లేదు.

21. ధనం ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు.

22. మనం ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడం అంటూ ఉండదు.

23. ప్రతి వ్యక్తీ తన విద్యుక్తధర్మాన్ని తాను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తుండాలి. సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమాన బుద్ధిని కలిగి ఉండాలి. అదే ఉత్తమ యోగం. దీనిని సాధించినవాడు ఉత్తమయోగి,

24. తప్పు చేసారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.

25. ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. 26. ఆత్మగౌరవం, ఆత్మనిగ్రహం, ఆత్మజ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.

27. సముద్రపు కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు. పడినా లేస్తున్నందుకు.

28. 'ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న'.

29. ఇతరుల గురించి మంచిగా కున్నట్టే. మాట్లాడితే నిన్ను గురించి మంచిగా మాట్లాడు

30. వెన్న కరిగితే వేడికి నిదర్శనం మనసు కరిగితే మానవతకు నిదర్శనం.

31. మనిషి ఎప్పుడూ తనకున్న సంపదతో తృప్తి పడాలి: కానీ తనకున్న విజ్ఞానంతో తృప్తి పడకూడదు.

32. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది.

33. ఒకరి సాయమందుకున్నప్పటి సంతోషంకన్నా, వేరొకరికి సహాయం అందించడంలోని ఆనందమే మిన్న

34. ప్రపంచంలోని మేధావులందరికన్నా, ఒక మంచి సహృదయంగల వ్యక్తి ఎంతో గొప్పవాడు.

35. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యంకాదు. అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది.

36. ఒకరిని ఎంతకాలమైతే మనం అనుకరిస్తూ వుంటామో, అంతకాలం మనం ముందుకు వెళ్ళలేము.

37. మన మంచిని ఇతరులు చెప్పుకోవడం ఘనత. మనమే చెప్పుకోవడం పొగడ్త.

38. సృష్టిలో తీయనిది స్నేహమే. హితం కోరేవాడే అసలైన స్నేహితుడు.

39. ఒక స్థితి నుండి ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నించడమే యోగం.

40. వివేకి అయిన మానవుడు ప్రతీ క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి.

41. ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమిని, ఎప్పుడూ వదులుకోకు ఓర్హుని.

42. పండితుడంటే విషయం తెలిసినవాడు. జ్ఞాని అంటే తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు.

43. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో పోరాడి ఓడినవారు తిరిగి గెలవటం అంతే నిజం.

44. అవినీతి మార్గంలో జీవించే ధనికుడికన్నా నిజాయితీగా బ్రతికే నిరుపేద మేలు.

45. బాధ్యతగా జీవించడం ముఖ్యం, బాధ్యతతో అందరూ జీవించేలా ప్రయత్నించాలి.

46. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు.

47. తెలియక తప్పులు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పులు చేసేవాడు మూర్ఖుడు. అమాయకుణ్ణి మార్చవచ్చు కాని మూర్ఖుణ్ణి మార్చలేం.

48. గొప్ప వ్యక్తి శీలానికి, సత్ప్రవర్తనకు, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తాడు.

49. విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు.

50. ఆనందంగా, ఆటలాగా, పాటలాగా పని చేయడమే కర్మ యోగం.

51. కోరికలతో జీవించే వ్యక్తికి సేవాభావం ఉండదు. సేవాభావంతో జీవించే వ్యక్తికి కోరికలు ఉండవు. 52. నిరంతరం తపన, ఆరాటం వుండాలి అదే తపస్సు. తపస్సు ద్వారా మనిషి సాధించలేనిది ఉండదు.

53. సమదృష్టితో సమాజాన్ని చూడాలి. సత్యవంతంగా జీవితాన్ని కొనసాగించాలి.

54. సాధారణ వ్యక్తులుగా కన్పించినంత మాత్రాన గొప్పవారు సాధారణ వ్యక్తులుకారు.

55. స్నేహితులను, ఎన్నుకోవడానికి ముందు బాగా ఆలోచించు. ఎన్నుకున్న తరువాత వారితో స్నేహం దృఢంగా కొనసాగేలా చూసుకో.

56. పట్టుదల, సహనం, పవిత్రత అనేవి జీవిత ప్రధాన సూత్రాలు.

57. ధనాన్ని ఎవరైనా కూడ బెట్టగలరు. కానీ ధర్మాన్ని కూడబెట్టిన వారే ధన్యాత్ములు.

58. చెట్టు తన పండు తాను తినదు. నది తన నీరు తాను త్రాగదు. అట్లే సత్పురుషులు చేయు పనులు పరుల కోసమే చేస్తారు.

59. ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు మహా సముద్రం కంటే చాలా గొప్పది.

60. విజయవంతమైన ప్రతివ్యక్తి వెనుక తోడుగా, ఎక్కడో అక్కడ అద్భుతమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉండి తీరాలి.

61. విజయానికి ఒకే ఒక్క మార్గం. మరొక్కసారి ప్రయత్నించడమే.

62. జీవితంపట్ల అవగాహన ఉన్న వ్యక్తి జీవితాన్ని సద్వినియోగపరచుకుంటాడు.

63. కొత్త స్నేహాలు చేయని మనిషి కొంత కాలానికి ఒంటరివాడై పోతాడు.

64. వివిధ విషయాలను ఎదుటివారి దృష్టికోణం నుండి పరిశీలించే సామర్థ్యం కలిగి ఉండటం ఏకైక విజయ రహస్యం.

65. సజ్జనుల సాంగత్యం మనస్సును నిర్మలంగా ఉంచుతుంది.

66. దానము చేయని ధనము, సంస్కారములేని చదువు వ్యర్థము.

67. కుటుంబంపట్ల, సమాజంపట్ల, ప్రపంచంపట్ల బాధ్యతాయుతంగా జీవించాలి.

68. తన ఆదాయాన్ని మించిన వ్యయంవుంటే ఎవడూ ధనికుడు కాడు. తన వ్యయాన్ని మించి ఆదాయం వున్నప్పుడు ఎవడూ పేదవాడు కాడు.

69. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు నీ వైపుకు వేస్తుంది.

70. క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితంలో ఏ పనినీ సాధించలేడు. పైకి రాలేడు.

71. సత్యమే పలికే వాళ్ళకి లభ్యం కానిది ఉండదు.

72. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే; సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే... శిఖరాగ్రం మీదనే.

73. పదిమందిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నించకు, ప్రయత్నించావా ఆ నిమిషంలో నీవు కూడా చీకట్లో ఉంటావని గుర్తుంచుకో.

74. శారీరకంగా వచ్చే అందం ఈ రోజున వుంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది.

75. అసాధ్యమనిపించే అతిగొప్ప వాగ్దానం కన్నా, నిజమైన మంచి అతి చిన్నదైనా మేలు.

76. ఓటమి తరువాత నిలుపుకునే నిబ్బరమే మరల విజయంవైపు మరలిస్తుంది.

77. సంతోషంగా జీవించడానికి సులభమైన మార్గం నిజాయితీగా జీవించడమే.

78. బోధకుడుగా వుండాలని కోరే ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలనే నూరి పోయకుండా, మనస్సులకు ఉత్తేజాన్ని కలిగించేలాగ లక్ష్యం ఉండాలి.

79. వినేటప్పుడు మనస్సును చేసేటప్పుడు బుద్ధిని మేల్కొలుపు.

80. కాలాన్ని వృథా చేసేవాడు కాలంలో వృథా అవుతాడు.

81. శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి.

82. ఒక మాట మాట్లాడేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడకూడదు.

83. ఎన్ని సమస్యలెదురైనా దృఢచిత్తంతో, ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.

84. కష్టమైనా సాధించగలననుకునేవాడే అసలైన విజేత.

85. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్యకాదు, ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య

86. మన జీవితాలను ప్రకాశవంతం చేసుకోవచ్చని మహాత్ముల జీవితాలు గుర్తు చేస్తాయి.

87. సాహసించి ఏ ప్రయత్నమూ చేయని కార్యశూన్యులు మాత్రమే ఎటువంటి పొరబాట్లు, తప్పిదాలు చేయరు.

88. మనం ఆనందం పొందడం కన్నా, ఇతరులకు ఆనందాన్ని పంచడంలోనే ఎక్కువ ఆనందం లభిస్తుంది.

89. అంతరాయాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి.

90. విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఎన్నడూ ఏ పనీ చేయలేరు. 91. బలహీనుడు ఎప్పటికీ క్షమించలేడు. క్షమా గుణం బలవంతుల లక్షణం.

92. జీవితం ఒక అపూర్వ వరం. దాన్ని చరితార్థం చేసుకోవాలి.

93. సంపాదించడం అందరికీ తెలుసు, కానీ ఖర్చెలా చేయాలన్నది మాత్రం లక్షల్లో ఒక్కరికే తెలుసు.

94. సలహా అనేది మీ స్నేహితులను కేవలం సంతోష పెట్టేదిగా కాదు, సహాయ పడేదిగా వుండాలి. 95. పుస్తక పఠనం లెక్కలేనంత మంది అనుభవాలను, ఆలోచనలను తెలియజేస్తుంది.

96. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది.

97. సమాజసేవకు కావలసింది సంపద కాదు... ఉదార హృదయం.

98. మహాత్ములు ఒక్క నిమిషమైనను వ్యర్థముగా గడపరు.

99. మహాత్ముల స్ఫూర్తిని పొందినవారు గొప్పగా ఆలోచిస్తారు. త్యాగాలు చేస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు.

100. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు వున్నాయి. ఒకటి పేరు పొందడం, ఇంకొటి దాన్ని నిలబెట్టుకోవడం.

101. దయ ఎన్నడూ వృధా కాదు. దానిని పొందేవాడి మీద అది ఏ ప్రభావమూ చూపక పోయినా కనీసం దాన్ని ఇచ్చే వాడికైనా అది మేలు చేస్తుంది.

102. సత్యం, అహింస, సేవానిరతి, క్రమశిక్షణ, క్షమాగుణం, ఇవే విజయానికి మూల సూత్రాలు.

103. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

104. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఇతరులకు సేవ చేయడం నేర్చుకో పెత్తనం చెలాయించడం కాదు.

105. మనిషిని మహనీయునిగా మార్చేది, మాటలు నెమ్మదిగాను, వనులు ఉత్సాహాంగాను చేసిననాడే.

106. ఏళ్ళ తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరులు ఆత్మవిశ్వాసం కోల్పోరు.

107. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నా కిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం.

108. ఎంతటి విషమ పరిస్థితులెదురైనా మంచితనం, మానవత్వాల్లో నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. కాసిని మురికి నీళ్ళు ఉన్నంత మాత్రానా సముద్రం మురికి కూపం అవుతుందా?

109. ప్రేమగా, ఇష్టంగా చేసేటప్పుడు ఆ పనితనం చాలా గొప్పగా ఉంటుంది. మీకు దక్కాల్సిన ఫలం దక్కుతుంది. ఒక వేళ మీరే వద్దనుకున్నా ఆ ఫలం తనంతట తానే మీ పాదాలవద్దకు వచ్చి చేరుతుంది.

110. మన మనస్సు పవిత్రంగా ఉండి ఏ చిన్న పనిచేసినా అది విజయవంతం అవుతుంది.

111. ఇతరులు నీపై నమ్మకం పెంచుకోవాలంటే ముందు ఎదుటివారు నీపై నమ్మకం పెంచుకునేలా జీవించు.

112. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ కించపరచలేరు. 113. కలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు.

114. చేయాల్సిన పనులలో మీకు ఇష్టం లేని పని రోజుకి ఒకటైనా చేయండి. బాధపడకుండా బాధ్యతలు నెరవేర్చడం అలవడుతుంది.

115. తనకు లేని వాటి కోసం విచారించక, తనకు వున్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైన వాడు. 116. ఆశను ఎన్నడూ విడనాడకు జీవితంలో నిన్ను నిలిపేది అది ఒక్కటే.

117. ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది.

118. నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి పారిపోతుంది. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది.

119. సామాన్యుడు అవకాశం కోసం ఎదురు చూస్తూండిపోతాడు, ఉత్సాహవంతుడు అవకాశాన్ని కల్పించుకుంటాడు.

120. ధీరులంటే ప్రపంచాన్ని జయించిన వారు కాదు. తన మనస్సును జయించిన వారే నిజమైన ధీరులు.

121. ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినపుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. 122. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్య కారణ సంబంధాన్నే విశ్వసిస్తారు. 123. వైఫల్యాన్ని పరాజయంగా కాక ఆలస్యంగా లభించనున్న విజయంగా భావించేవారే విజేతలవుతారు.

124. అతి కష్టమైన పని... నిన్ను నువ్వు తెలుసుకోవడం. అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం.

125. వివేకి ఎన్నడూ జరిగిన నష్టాన్ని తలచుకుని దిగులు పడడు, దాన్ని ఎలా భర్తీ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తాడు.

126. ఒంటరిగా ఉండగలిగే శక్తి సంపాదించుకో. ఏకాంతంలోని ప్రయోజనాన్ని కోల్పోవద్దు.

127. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.

128. ఉత్తమమైన ఆలోచనలు నిరంతరం శక్తినిస్తాయి. అధమ స్థాయి ఆలోచనలు శక్తిని హరించి వేస్తాయి.

129. ప్రపంచంలో అన్నింటి కన్నా కష్టమైన విషయం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే.

130. గతం నుంచి ఏమీ నేర్చుకోనివాడు భవిష్యత్తులో కష్టపడతాడు.

131. మనం ప్రారంభాన్ని సరిగా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే సరిగా వస్తుంది.

132. ఎన్ని గ్రంథాలు చదివావు అనికాదు. ఎటువంటి గ్రంథాలు చదివావన్నది ముఖ్యం.

133. నిజాయితీ పరుడైన వ్యక్తి తన అంతరాత్మ అంగీకరించని పని చేయలేడు.

134. అందరూ చేస్తున్నపని నీవు చేస్తూ వుంటే నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇతరులు చేయలేని పని నీవు చేయగలిగితేనే చరిత్ర సృష్టించగలవు.

135. వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తానే మహాకార్యాలు సాధ్యమవుతాయి.

136. బాధ్యతగల వ్యక్తికి పనే ప్రపంచం, బాధ్యతారహితుడికి సోమరులే ఆదర్శం.

137. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యక్తులు మారకుండా వ్యవస్థను మార్చలేం.

138. నిరంతరం భయపడేవాడు తామసికుడు. నిరంతరం ఇతరులను భయ పెట్టేవాడు రాజసికుడు. ధైర్యంగా జీవించేవాడు సాత్వికుడు.

139. అసంతృప్తికి మూలకారణం ఇతరులతో పోల్చుకొనడమే.

140. కష్టమైన కార్యనిర్వహణ ద్వారానే నిజమైన ఆనందం దొరుకుతుంది.

141. మంచి వారితో స్నేహం ఉదయపు ఎండలా పెరుగుతుంది. చెడ్డ వారితో స్నేహం సాయంత్రపు ఎండలా తరిగి పోతుంది.

142. అవసరానికి ఉపయోగపడడం ఉత్తమమైన పని. ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరమైన వ్యక్తికి తప్పనిసరిగా ఉపయోగపడాలి.

143. ఫలితాన్ని ఆశిస్తూ పరుగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకు వస్తుంది.

144. ఎవరైతే ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడతారో వారి చెంత భగవంతుడు ఉంటాడు.

145. ప్రతిభావంతుడు సముద్రపు గట్టులాంటి వాడు అలల వంటి సమస్యలకు వెనుదిరిగిపోడు. 146. పొగడ్త పన్నీరులాంటిది దాన్ని వాసన చూడాలే తప్ప తాగకూడదు.

147. మన ప్రవర్తనే మన మిత్రుల్ని, శత్రువుల్ని సమకూరుస్తుంది.

148. సహనం గల మనిషి తను అనుకున్న వాటినల్లా సాధించుకోగలిగే అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు.

149. పనితనం లేనివాడు పనిముట్లను నిందించకూడదు.

150. విజయం - ప్రయాణమే గానీ గమ్యం కాదు.

151. భగవంతుడు ఇచ్చిన దానితో హాయిగా, సంతోషంగా, తృప్తిగా జీవించడమే నిజమైన వైరాగ్యం. 152. మనకు రెండు రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పాలి, రెండోది ఎలా జీవించాలో నేర్పాలి.

153. పరిస్థితులెప్పుడూ అనుకూలంగా ఉండాలని ఆశించవద్దు. ఈ ప్రపంచం నీ వొక్కడి కొరకే ఏర్పడలేదు.

154. నీ పనుల్లో నిండుగా ప్రేమ, మంచితనం, స్వచ్ఛతా వుండడమే దివ్యమైన జీవితం.

155. ఉన్నత లక్ష్యాలనే కలిగి వుండు, అత్యున్నతమైన దానిని సాధించాలని గాఢంగా కోరుకో.

156. గతం అనేది శవంలాంటిది. తిరిగిరాదు, భవిష్యత్తు పుట్టని బిడ్డలాంటిది, మన చేతులలో లేదు. వర్తమానం మాత్రమే వాస్తవం, దానిని సమూలంగా వినియోగించడమే యోగం.

157. తన మీద తనకు విశ్వాసంఉన్నవ్యక్తి బలవంతుడు. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి బలహీనుడు.

158. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు....రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరచిపోవడం, సమయాన్ని, సద్వినియోగం చేయడం.

159. చిన్నపొరపాటే కదా అని నిర్లక్ష్యం తగదు, పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. 160. మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేక పోవడానికి కారణం.

161. ఎవరూ చూడనప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం.

162. విజేత వెనుక ఉండేది అదృష్టమో, మంత్రదండమో కాదు... కఠిన శ్రమ, అంకిత భావం.

163. మంచి పుస్తకాలు దగ్గరుంటే మనకు మంచి మిత్రులు లేని లోపం కనిపించదు. గ్రంథపఠనాభిలాష గల వాడెక్కడున్నా సుఖంగా నివసించగలడు.

164. పుణ్యపురుషులు ఇతరుల కోసం జీవిస్తారు. జ్ఞాని ఇతరులకోసం తనను తానే అర్పించుకుంటాడు.

165. మనం ఎందుకు జన్మించామో తెలుసుకోకుండానే మనలో చాలామంది ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.

166. ఒక దురభ్యాసానికి అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పెంచి పోషించవచ్చు.

167. ఆశావాదికి ఆపదలో కూడా అవకాశాన్ని వెదుక్కోగల శక్తి ఉంటుంది.

168. అవసరంలేని వస్తువులనుకొంటూ ఎదుటివారితో పోటీపడడం మంచిది కాదు.

169. అన్నదానం ఆకలిని తీర్చగలుగుతుంది. అక్షరదానం అజ్ఞానాన్ని తొలగించ గలుతుంది.

170. విద్యను దాచుకోవద్దు. పదిమందికీ పంచు. అది మరింత రాణిస్తుంది.

171. మనిషికి బాగా అవసరమయ్యేది కాలమే! అయితే మనిషి ఎక్కువగా దుర్వినియోగం చేసుకునేది కూడా కాలాన్నే!

172. వేలకొద్దీ నీతులు బోధించే బదులు ఒక్క మంచి పనిచేసి చూపించడం మేలు.

173. మంచిపని చెయ్యడానికి ఎటువంటి సమయమైనా మంచి సమయమే.

174. మనిషి మరణించటానికి సదాసిద్ధంగా ఉండగలిగిననాడే, స్వేచ్ఛగా జీవించ గలుగుతాడు.

175. ఈ ప్రపంచంలో సముద్రం కంటే, సారాయి ఎక్కువ మందిని ముంచేసింది.

176. జ్ఞానం అమాంతంగా పొంగిపొర్లదు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది.

177. జయించడానికే జన్మించారు. దృఢ సంకల్పం కలిగి పట్టు వీడక పని చేయండి.

178. ఒక అవకాశం చేజారిపోతే కన్నీళ్ళు పెట్టుకోకు.. మరొక అవకాశం చేజారి పోకుండా జాగ్రత్తపడు. 179. మంచితనాన్ని కేవలం మాటలవరకే పరిమితం చేయకు. దానిని మనస్సు వరకు వ్యాపింపచేయడం మానకు.

180. ఒక మంచి స్నేహితుడ్ని ఎన్ని కష్టాలొచ్చినా నిలుపుకో. ఒక దుర్గుణం కలవాడ్ని ఎంతటి వాడైనా వదులుకో.

181. భవిష్యత్తులో ఏమి కానున్నదో అని భయపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే నిజమైన ధీరుడు.

182. ఆకు చివర నీటి బిందువులా కాలం అంచుల్లో నీ జీవితాన్ని నృత్యం చేయించు.

183. ఆనందంగా పనిచేయడం గొప్ప ఆరోగ్యసూత్రం. ఓటమి పొందడం నేరం కాదు.

184. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మహాత్ముడు.

185. ఒక ఊరు బాగుపడాలంటే ఒక మంచి మనిషి పూనుకోవలసి వుంటుంది.

186. ఏదైనా పని చేయడానికి బద్ధకిస్తే ఆ పనిని పదిసార్లు తిరిగి చేయాల్సి వస్తుంది.

187. మంచిపని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది.

188. ఎవడు ఇంద్రియాలను లొంగదీసుకుంటాడో అతనే వివేకి,

189. కష్టం ఎరుగని వాడికి సుఖం విలువ తెలియదు.

190. జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి నిరంతరం దుఃఖంలో ఉంటాడు.

191. ఎవరైనా ఒక దానిని నిజంగా, మనసారా ఇష్టపడితే దానిని పొందకుండా ఆపే శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు.

192, అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపి వేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట ప్రభావితం వేస్తుంది.

193. శ్రమయే మనుషుల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది.

194. ఆశలు, ఆశయాలు అందరికీ వుంటాయి. కాని నిత్యం శ్రమించేవారే వాటిని నేర్చుకోగలుగుతారు.

195.. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది.

196. అందర్నీ సంతృప్తి పరచాలనుకుంటే ఒక్కరి కూడా సంతృప్తి పరచలేము.

197. నేటి తెలివైన నిర్ణయం, రేపటి బంగారు భవితకు పునాది.

198. ఆత్మవిశ్వాసం వున్న వ్యక్తి ఇతరులను తనవెంట నడిపింపజేసే నాయకుడు అవుతాడు.

199. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. అలాగే, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది.

200. కష్టాలలో ఉన్నవారిని చూసి దుర్భలులు బాధపడతారు, ధీరులు సాయపడతారు.

Responsive Footer with Logo and Social Media