స్వామి యొక్క పెన్



చాలా కాలం క్రితం, స్వామి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో ఎల్లప్పుడు ముందుండేవాడు. తల్లిదండ్రులతో ఎంతో విధేయత చూపేవాడు. తన క్లాస్‌లో చాలా మంది అబ్బాయిల కంటే తెలివైనవాడు మరియు అందరితో పద్ధతిగా ఉంటాడు. స్వామి కంటే పెద్దవాళ్లు మరియు చిన్నవాళ్లు కూడా అతన్ని ఇష్టపడేవారు. స్వామి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అతన్ని చాలా ఇష్టపడతారు.

కానీ, అందరు ఒకలా ఉండరు కదా! స్వామి మంచితనాన్ని మరియు స్వామిని అందరు ఇష్టపడడాన్ని చూసి అసూయపడే వారు కూడా స్వామి చుట్టూ చాలా మంది ఉన్నారు. అలా అసూయపడే వారిలో టింకు అనే అబ్బాయి ఒకడు. టింకు, స్వామి యొక్క క్లాస్‌మెట్. స్వామిలా కాకుండా, అతను చదువులో ఎప్పుడూ వెనకబడి ఉంటాడు. మరియు ఎప్పుడూ క్లాస్ సమయంలో ఆడటానికి ఇష్టపడేవాడు. అతను తన తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించడు, తన సహవిద్యార్థులను వేధిస్తూ ఉంటాడు మరియు స్వామితో కూడా చాలా సార్లు చెడ్డగా ప్రవర్తించాడు.

అతను ఎప్పుడూ స్వామిని అణచివేయడానికి ప్రయత్నించేవాడు మరియు తరగతిలోని ఇతర పిల్లల ముందు అతనిని తక్కువ చేసేవాడు. కానీ అతను ఏమి చేసినా, స్వామి తిరిగి మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. చదువులో గానీ, క్రీడల్లో గానీ, తన క్లాస్‌మేట్స్‌తో గానీ, స్వామి ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు.

తన పన్నెండవ పుట్టినరోజున, స్వామి తన తల్లిదండ్రుల నుండి ఒక మంచి పెన్ను బహుమతిగా పొందాడు. క్లాసులో టీచర్లు చెప్పే నోట్స్ రాసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలని ఆ పెన్‌ని స్కూల్‌కి తీసుకొచ్చాడు. ఇది అందమైన పెన్, చాలా వేగంగా వ్రాయడానికి సహాయపడుతుంది. అది చూసిన టింకుకి స్వామి మీద ఇంకా అసూయ పెరిగింది.

వెంటనే స్వామి దగ్గరికి వెళ్లి, “అరే, ఈ పెన్ ఎక్కడిది నీకు? దొరికిందా? కొన్నావా?” అని అడిగాడు. "నా తల్లిదండ్రులు నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు" అని సమాధానమిచ్చాడు స్వామి.

టీంకు కోపం మరియు అసూయతో మునిగిపోయాడు. టింకు చాలా చెడ్డ అబ్బాయి. అతను తన తల్లిదండ్రుల నుండి చాలా అరుదుగా బహుమతి పొందాడు. అతను స్వామి పెన్ను ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడు. విరామం సమయంలో, అందరూ క్లాస్ నుండి బయటకు వెళ్లినప్పుడు, టింకు, స్వామి బ్యాగ్ తెరిచి తన పెన్ను తీశాడు. తర్వాత దాన్ని తన బ్యాగ్‌లో దాచుకుని ఏమి తలియనట్టు టిఫిన్‌ చేసేందుకు బయటకు వెళ్లాడు.

స్వామి తిరిగి వచ్చి చూసేసరికి తన పెన్ను కనబడలేదు. అతను దాని గురించి తన క్లాస్ టీచర్‌కు తెలియజేశాడు. కనిపించకుండా పోయిన పెన్ కోసం వెతకడం జరిగింది మరియు క్లాస్ టీచర్ తరగతిలోని ప్రతి ఒక్కరి బ్యాగ్‌ని వెతకమని క్లాస్ మానిటర్‌ను ఆదేశించాడు. అలా అందరి బాగ్స్ వెతకగా, టింకు బ్యాగ్‌లో పెన్ను దొరికింది.

కోపంతో ఉన్న టీచర్ తప్పు చేసిన టింకుని పిలిచి, "ఈ పెన్ నీ బాగ్ లోకి ఎలా వచ్చింది?" అని అడిగాడు. దానికి టింకు దగ్గర సమాధానం లేదు. ఎదో ఆవేశంలో స్వామి దగ్గరి నుండి పెన్ దొంగిలించడానికి ప్రయత్నించాడు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని టింకు అనుకోలేడు.

కోపంతో ఉన్న టీచర్ ని చూసి టింకు భయంతో వణికిపోయాడు. టీచర్, టింకుతో, "నువ్వు వెంటనే వెళ్లి నీ తల్లి తండ్రుల్ని తీసుకుని రా.. నేను వాళ్లతో మాట్లాడాలి," అన్నాడు. టింకు ఇంకా బయపడి గట్టిగ ఏడవడం ప్రారంభించాడు.

అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న స్వామికి, టింకుని చూసి జాలేసింది. వెంటనే టీచర్ దగ్గరికి వెళ్లి, "ఈ సారికి టింకుకి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేయమని," అడిగాడు.

అది విన్న టింకు, సిగ్గుతో తల దించుకుని, "స్వామి ఎంత మంచివాడో అసలు… నేను చాలా పెద్ద తప్పు చేసా…" అని మనసులో అనుకున్నాడు. స్వామి మాటలు విన్న టీచర్, టింకుతో, "నీకు ఇదే ఆఖరి అవకాశం. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే, నీ తల్లి తండ్రులను పిలిపించి వాళ్ల ముందే నీకు పనిష్మెంట్ ఇస్తాను," అని చెప్పి వదిలేసాడు.

అప్పటి నుండి టింకు తన పద్ధతిని మార్చికుని స్వామితో స్నేహం చేస్తూ, అందరితో మంచిగా ఉండటం, కష్టపడి చదవడం మొదలు పెట్టాడు.

కథ యొక్క నీతి: ఎవరైనా మీకు హాని చేసినా, వారికి మీరు హాని చేయకండి. అందరితో మంచిగా ఉండండి.

Responsive Footer with Logo and Social Media