తెలివైన కాకి మరియు పాము



అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకున్నది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టినవి. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి, వచ్చేసరికి గుడ్లు ఉండడం లేదు, రోజూ అలానే జరిగేది.

ఒక రోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపైనుండి తమ గుడ్లు ఏమైపోతున్నాయో గమనించాయి. అదే సమయానికి, పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి, గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట. తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని, పిల్లలను చేయాలనుకున్నాయి. దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు.

ఒక రోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబుగారి పిల్లలు వచ్చారు. వాళ్లు ఒంటి పైన ఉన్న నగలను తీసి, చెరువు గట్టు పైన పెట్టి, చెరువులోకి దిగారు. ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించుకున్నాయి. వారు చూస్తుండగా, నగల దగ్గరికి వచ్చి, ఒక కాకి "కావ్, కావ్" మని అరిచి, ఒక బంగారు నగును నోట్లో పెట్టుకొని పుట్టలోకి విడిచింది. వెంటనే ఆ పిల్లలు వెళ్లి, మునసబుగారితో, కాకి నగను పుట్టలోకి విడిచిన విషయం చెప్పారు.

వెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టను తవ్వి, నగ తీసుకురమ్మని చెప్పాడు. ఆ పని వాళ్లు పలుగులను పట్టుకొని వెళ్లారు. ఆ పుట్టను తవ్వుతుండగా, పాము బయటకు రావడాన్ని చూశారు. దానిని వెంటనే చంపేశారు ఆ పని వాళ్ళు. చెట్టు పైన ఉన్న కాకుల పామును చంపడం చూసి, అవి సంతోష పడ్డాయి.

ఈ రోజు నుండి మనం గుడ్లు పెట్టి పిల్లలను చేయవచ్చు అనుకున్నాయి కాకులు. ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు, హాయిగా ఉండసాగాయి.

కథ యొక్క నీతి: ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.

Responsive Footer with Logo and Social Media