తెలివైన తాబేలు
ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.
ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసిన తాబేలు నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు, తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది.
తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్న అంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది. అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా, నా శరీరంలో ఇతర ఏ మాంసమైనా తినలేవు అంది తాబేలు.
ఎందుకలా అన్నదో అర్థం కాక, నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ నా శరీరం తీరే అంత నా నక్క బావ, నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను, మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో, వెంటనే మెత్తపడుతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.
అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మినట్లుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది.
కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ, నేను పూర్తిగా నాననివ్వు. నువ్వు కాలు పెట్టిన చోట నాన లేదు అన్నది.
దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.
కథ యొక్క నీతి: సత్యం మరియు తెలివితేటలు తమకు ఎప్పుడూ మనోజ్ఞమైన మార్గాన్ని చూపిస్తాయి.